ప్రధాన మంత్రి కార్యాలయం

‘పిఎమ్ స్మృతి చిహ్నాల వేలంపాట’ కు లభించిన ఉత్సాహభరిత ప్రతిస్పందన నుప్రశంసించిన ప్రధాన మంత్రి 

Posted On: 28 SEP 2022 5:40PM by PIB Hyderabad

‘పిఎమ్ స్మృతి చిహ్నాల వేలంపాట’ పట్ల ప్రస్తుతం వ్యక్తం అవుతున్నటువంటి ఉత్సాహానికి గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన సంతోషాన్ని వెలిబుచ్చారు. వేలాని కి పెట్టినటువంటి బహుమతుల ను ఒకసారి పరిశీలించి, మరి వాటిని వారి యొక్క కుటుంబ సభ్యుల కు ఇంకా మిత్రుల కు కానుకలు గా ఇవ్వాలంటూ ఆయన అందరికీ, ప్రత్యేకించి యువజనుల కు విజ్ఞప్తి చేశారు.



ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -



‘‘పిఎమ్ జ్ఞాపికల వేలంపాట కు గడచిన కొన్ని రోజులు గా లభిస్తున్న ప్రతిస్పందన ను చూస్తే నాకు ఆనందం కలుగుతోంది. వాటి లో పుస్తకాలు మొదలుకొని కళాకృతుల వరకు మరియు కప్పులు, ఇంకా పింగాణీ వస్తువులు మొదలుకొని ఇత్తడి సామగ్రి వరకు.. అనేకమైన నజరానాల ను కొన్ని సంవత్సరాల బట్టి నాకు అందినవి ఉన్నాయి. వాటన్నింటిని వేలం కోసం పెట్టడం జరిగింది. pmmementos.gov.in/#/’’


‘‘పిఎమ్ స్మృతి చిహ్నాల వేలంపాట’ నుండి అందే సొమ్ము ను ‘నమామి గంగే’ కార్యక్రమాని కి ఇవ్వడం జరుగుతుంది. నేను మీ అందరినీ, ప్రత్యేకించి యువజనుల ను, కోరేది ఏమిటి అంటే.. వేలాని కి ఉంచిన బహుమతుల ను మీరు ఒకసారి పరిశీలించండి; వాటిని మీరు కుటుంబ సభ్యుల తో పాటు మీ యొక్క మిత్రుల కు కానుకలు గా కూడా ఇవ్వండి.. అనేదే’’ అని పేర్కొన్నారు.

 

***


DS/AK

 



(Release ID: 1863379) Visitor Counter : 126