ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధుల సమావేశాన్ని ప్రారంభించిన డాక్టర్ మన్సుఖ్ మాండవీయ


మన సంస్కారంలో అంతర్భాగంగా ఉన్న సేవ, సహకారం స్ఫూర్తితో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పనిచేస్తోంది.. డాక్టర్ మాండవీయ

"వినూత్న మరియు సహకార విధానాల ద్వారా మరింత ఎక్కువ మందికి సేవ చేసేందుకు ఐఆర్‌సిఎస్ కాలానుగుణంగా తనను తాను మెరుగుపరచుకోవడానికి మరియు పునర్నిర్వచించుకోవడానికి కృషి చేయాలి ".. మాండవీయ

Posted On: 22 SEP 2022 12:49PM by PIB Hyderabad

' సేవా గుణం, సహకారం అనేవి మన సంస్కారంలో అంతర్భాగంగా ఉన్నాయి. సంస్కారం, సేవ, సహకారం స్ఫూర్తిగా తీసుకుని పనిచేస్తున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రజలకు అవసరమైన మరియు అత్యవసర సమయాల్లో  సహాయం చేయడానికి, అండగా నిలుస్తున్నది' అని కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధుల సమావేశాన్ని డాక్టర్ మాండవీయ ఈ రోజు ఢిల్లీలో ప్రారంభించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పనితీరును మరింత మెరుగు పరిచేందుకు అనుసరించాల్సిన చర్యలను చర్చించి ఖరారు చేసేందుకు రెండు రోజుల ఆలోచనా శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. సమావేశంలో రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ ల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు,కార్యదర్శులు, ఇతర సభ్యులు పాల్గొంటున్నారు.    

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0029O0C.jpg


ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన డాక్టర్ మాండవీయ సంస్థను అభినందించారు.ఇండియన్ రెడ్ క్రాస్  ప్రజల విశ్వసనీయతను పొందిందని అన్నారు. అవసరమైన సమయంలో ప్రజలు సంస్థను ఆశాకిరణంగా చూస్తూ సహాయం పొందుతున్నారని డాక్టర్ మాండవీయ పేర్కొన్నారు. అయితే, ఉనికి, విశ్వసనీయతను కొనసాగించేందుకు  మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇండియన్ రెడ్ క్రాస్ మారక తప్పదని డాక్టర్ మాండవీయ స్పష్టం చేశారు. 'తన బలాలు, బలహీనతలను బేరీజు వేసుకుని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పనితీరును మెరుగు పరుచుకోవడానికి సంస్థ కృషి చేయాలి.దీనికోసం సంస్థ నిర్మాణాత్మక మరియు సంస్థాగత వ్యవస్థలో మార్పు తీసుకు రావాల్సి ఉంటుంది.ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రాంతీయ కేంద్రాల పనితీరు మెరుగుపరిచేందుకు, పారదర్శక విధానంలో నియామకాలు జరిగేలా చూసి, సమస్యల పరిష్కారానికి పటిష్ట విధానాన్ని అమలు చేయడానికి చర్యలు అమలు జరగాలి. ప్రజలకు అవసరమైన సేవలు అందించేందుకు డిజిటల్  సాంకేతిక అంశాలను మరింత ఎక్కువగా ఉపయోగించాల్సి ఉంటుంది.” అని ఆయన పేర్కొన్నారు.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003QMWR.jpg


కోవిడ్ మహమ్మారి సమయంలో దేశంలో ఆరోగ్య పరిరక్షణ రంగంలో చోటుచేసుకున్న మార్పులను డాక్టర్ మాండవీయ వివరించారు. ' ఇతర దేశాల్లో అమలు జరుగుతున్న ఆరోగ్య సంరక్షణ విధానాలు గతంలో దేశానికి ఆకర్షణీయంగా ఉండేవి. అయితే, కోవిడ్ మహమ్మారి మన ఆరోగ్య సంరక్షణ బలాన్ని తెలియజేసింది. అభివృద్ధి చెందిన దేశాలతో సహా ఇతర దేశాల ఆరోగ్య సంరక్షణ బలహీనతలను వెల్లడించింది. ప్రాంతీయ నమూనాల సహాయంతో కోవిడ్ పరిస్థితిని పటిష్టంగా ఎదుర్కొని విజయం సాధించిన భారతదేశం వ్యాక్సిన్ మైత్రి ద్వారా ఇతర దేశాలకు టీకాలు సరఫరా చేసింది. దేశంలో అభివృద్ధి చేసిన ఔషధాలు నాణ్యతతో  రాజీ పడకుండా ఆశించిన ఫలితాలు అందించాయి. ఎక్కువ ధరలతో ప్రజలు దోపిడీకి గురి కాలేదు. వసుదైక కుటుంబం అన్న భావనతో  పనిచేసి విజయం సాధించాము.' అని డాక్టర్ మాండవీయ వివరించారు.
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యక్రమాలను విస్తృతం చేయడానికి, ఇతర వినూత్న కార్యక్రమాలు చేపట్టేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని సమావేశానికి హాజరైన వారిని డాక్టర్ మాండవీయ కోరారు.  

 

***



(Release ID: 1861515) Visitor Counter : 124