రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
వ్యాపార నిర్వహణను సులభతరం, డీలర్ల ద్వారా నమోదిత వాహనాల అమ్మకం మరియు కొనుగోలులో పారదర్శకతను ప్రోత్సహించేందుకు ముసాయిదా నోటిఫికేషన్
Posted On:
15 SEP 2022 10:50AM by PIB Hyderabad
దేశంలో వ్యాపార నిర్వహణను సులభతరం చేయడానికి మరియు డీలర్‌ల ద్వారా నమోదిత వాహనాల అమ్మకం, కొనుగోళ్లలో పారదర్శకతను ప్రోత్సహించడానికి రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (మొర్త్) 12 సెప్టెంబర్ 2022న జి.ఎస్.ఆర్ 693 (ఈ) డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. భారతదేశంలో ప్రీ-ఓన్డ్ కార్ల మార్కెట్ క్రమంగా పుంజుకుంది. ఇటీవల ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్‌ల ఆగమనం, ప్రీ-ఓన్డ్ వాహనాల కొనుగోలు మరియు అమ్మకంలో పాలుపంచుకోవడం ఈ మార్కెట్‌కు మరింతగా ఊపందుకుంది. ఇటీవలి కాలంలో ఇందుకు సంబంధించి ప్రస్తుత పర్యావరణ వ్యవస్థలో అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. వాహనాన్ని తదుపరి బదిలీదారునికి బదిలీ చేసేటప్పుడు, థర్డ్ పార్టీ డ్యామేజ్ బాధ్యతలకు సంబంధించి వివాదాలు, డిఫాల్టర్‌ను గుర్తించడంలో ఇబ్బందు ఎదురవుతుండడం వంటి సమస్యలు వస్తున్నాయి. దీంతో మొర్త్ సెంట్రల్ మోటర్ వెహికల్ రూల్స్, 1989లో అధ్యాయం - IIIలో సవరణలను ప్రతిపాదించింది, ప్రీ-ఓన్డ్ కార్ మార్కెట్ కోసం సమగ్ర నియంత్రణ పర్యావరణ వ్యవస్థను నిర్మించే విధంగా ఇది ప్రతిపాదించబడింది.
ప్రతిపాదిత నియమాల యొక్క ముఖ్య నిబంధనలు క్రింది విధంగా ఉన్నాయి:
1. డీలర్ యొక్క ప్రామాణికతను గుర్తించడానికి రిజిస్టర్డ్ వాహనాల డీలర్‌ల కోసం అధికార ధ్రువీకరణ పత్రం ప్రవేశపెట్టబడింది.
2. ఇంకా, రిజిస్టర్డ్ ఓనర్ మరియు డీలర్ మధ్య వాహనం డెలివరీ గురించి తెలియజేయడానికి సంబంధించిన విధానం వివరంగా వివరించబడింది.
3. రిజిస్టర్డ్ వాహనాలను కలిగి ఉన్న డీలర్ యొక్క అధికారాలు మరియు బాధ్యతలు కూడా స్పష్టం చేయబడ్డాయి.
4. తమ ఆధీనంలో ఉన్న మోటారు వాహనాల కోసం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పునరుద్ధరణ/ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ పునరుద్ధరణ, నకిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఎన్ఓసీ, యాజమాన్యం బదిలీ వంటి అంశాలపై డీలర్‌లకు అధికారం ఇవ్వబడింది.
5. నియంత్రణ చర్యగా, ఎలక్ట్రానిక్ వెహికల్ ట్రిప్ రిజిస్టర్ నిర్వహణ తప్పనిసరి చేయబడింది, ఇందులో చేపట్టిన ట్రిప్ వివరాలు ఉంటాయి. ప్రయాణ ప్రయోజనం, డ్రైవర్, సమయం, మైలేజ్ మొదలైనవి ఇందులో నమోదవుతాయి.
ఈ నియమాలు నమోదిత వాహనాల మధ్యవర్తులు / డీలర్‌లను గుర్తించడం, సాధికారత కల్పించడంలో సహాయపడతాయని మరియు అలాంటి వాహనాల అమ్మకం లేదా కొనుగోలులో మోసపూరిత కార్యకలాపాలకు వ్యతిరేకంగా తగు విధమైన రక్షణను అందించడానికి సహాయపడతాయని భావిస్తున్నారు.
ఈ ముసాయిదా నోటిఫికేషన్ విషయమై ముప్పై రోజుల వ్యవధిలో భాగస్వామ్య పక్షాల నుండి వ్యాఖ్యలు మరియు సూచనలు ఆహ్వానించబడ్డాయి.
ఈ గెజిట్ నోటిఫికేషన్‌ను వీక్షించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
****
(Release ID: 1859824)
Visitor Counter : 149