సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
బెంగళూరులో 16&17 సెప్టెంబర్,2022న ఆవర్తన్- రెండు రోజుల కార్యక్రమాన్ని నిర్వహించనున్న సిఒఇకె
Posted On:
15 SEP 2022 10:52AM by PIB Hyderabad
ఖాదీలోని కళాత్మక తొలుత హృదయానికి తర్వాత కంటికి నచ్చుతుంది - ఎంకె గాంధీ
ప్రజలతో అనుసంధానం అయ్య ప్రయత్నంలో భాగంగా, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ ఖాదీ బెంగళూరులోని అంతర్జాతీయ కేంద్రం (బెంగళూరు ఇంటర్నషనల్ సెంటర్ - బిఐసి)లో 16 & 17 సెప్టెంబర్ 2022ల్లో రెండు రోజుల పాటు ఆవర్తన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీతో కలిసి ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కెవిఐసి)కి మద్దతుగా ఎంఎస్ఎంఇ మంత్రిత్వ శాఖ ద్వారా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఖాదీ (సిఒఇకె) యువతను, అంతర్జాతీయ మార్కెట్‌కు చేరువ కావాలనే లక్ష్యంతో దీనిని రూపొందించారు. ఢిల్లీ కేంద్రంగా (హబ్), బెంగళూరు, గాంధీనగర్, కోల్‌కొత, షిల్లాంగ్‌లు దాని చువ్వలుగా (స్పోక్స్) ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో సిఒఇకె అంతర్గత రూపకర్తలు (ఇన్‌హౌజ్ డిజైనర్లు) రూపకల్పన చేరసిన, గృహ వస్త్ర సముదాయాలను అన్ని తరాల ప్రేక్షకుల కోసం ప్రదర్శనలో ఉంచనున్నారు. తమ తమ వస్త్రాలను, చీరెలను మార్కెట్ చేసుకునేందుకు ఖాదీ సంస్థలను ఆహ్వానించారు. దీనితో పాటుగా, సిఒఇకె బృందం ఖాదీ, దాని సూక్ష్మనైపుణ్యాలపై చర్చల సెషన్లను నిర్వహించందుకు ప్రణాళికలు వసింది. ఇందు కోసం సెప్టెంబర్ 16న రావలసిందిగా బెంగళూరులోని డిజైన్ కళాశాలల నుండి విద్యార్ధులను ఆహ్వానించారు. ఇందులో భాగంగా, ఖాదీ పునఃఅనుసంధానం, నూతన తరం కోసం ఖాదీ, ఖాదీ కోసం డిఎన్ఎ అన్న ఇతివృత్తాలపై ఖాదీ వారసత్వం, నిలకడగా కొనసాగించేందుకు సంభాషణలను ప్రోత్సహిస్తుంది.వివిధ కళా రూపాలను అనుసరించేవారికి చేరువ కావడం కోసం, ఖాదీతో కళాత్మకత ఎలా అల్లుకునిపోయి ఉన్నదో గుర్తించి, అంగీకరించడం కోసం ఖాదీ - కళాత్మకత అన్న సిఒఇకె మరొక చొరవ ఒక మాధ్యమం.
బెంగళూరులోని సమకాలీన యువ నృత్యకారిణి, నృత్యదర్శకురాలు అయిన కళ్యాణి శారదతో సిఇఒకె కలిసి పని చేస్తోంది. ఆమె 17 సెప్టెంబర్ 2022న సాయంత్రం 6.00 గంటలకు ప్రత్యేకంగా నృత్య దర్శకత్వం వహించిన ఆవర్తన్‌ను బిఐసిలో ప్రదర్శించనుంది. ఆమె ప్రదర్శన ఖాదీ ప్రత్యక ప్రక్రియను చిత్రీకరించడమ లక్ష్యంగా పెట్టుకుంది. సిఒఇకె బృందం ప్రత్యేకంగా రూపొందించిన ఖాదీ వస్త్రాలను నాట్యకారులు ప్రదర్శించనున్నారు. ఖాదీ స్ఫూర్తిని విస్త్రత ప్రేక్షకుల దృష్టికి తీసుకువెళ్ళేందుకు, ఖాదీని ఇతర కళారూపాలతో సమ్మిళితం చేసి, నూతన అర్థాలతో ఖాదీని వివరించడాన్ని ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది. ఎగ్జిబిషన్, సెషన్ల ద్వారా ఖాదీని యువతతో అనుసంధానం చేయడంపై ఈ కార్యక్రమం దృష్టి కేంద్రీకరించి, ఖాదీ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు వేదికను అందిస్తాయి.
***
(Release ID: 1859619)
Visitor Counter : 160