ప్రధాన మంత్రి కార్యాలయం

సెప్టెంబర్ 17న మధ్య ప్రదేశ్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి


భారతదేశం లో అంతరించిపోయినటువంటి అడవి చీతాల ను కునో జాతీయ ఉద్యానం లోఉండడం కోసం విడచిపెట్టనున్న ప్రధాన మంత్రి

‘ప్రాజెక్ట్ చీతా’ లో భాగం గా నమీబియా నుండి చీతాల ను తీసుకు వచ్చి భారతదేశంలో ప్రవేశపెట్టడం జరుగుతోంది;  ‘ప్రాజెక్ట్ చీతా’ అనేది పెద్ద వన్య మాంసాహారి జంతువులఖండాంతర స్థానాంతరణ తో ముడిపడ్డ ప్రపంచంలోని తొలి పథకం అనిచెప్పాలి

చీతాల ను భారతదేశానికి తిరిగి తీసుకు రావడం వల్ల బహిరంగ వనాలు మరియు పచ్చికభూముల సంబంధి ఇకోసిస్టమ్స్ పునరుద్ధరణ లో సహాయకారి కానుండడం తో పాటు గా స్థానిక సముదాయాని కి జీవనోపాధిఅవకాశాలు కూడాను అధికం అవుతాయి

పర్యావరణ పరిరక్షణ మరియు వన్యజీవుల సంరక్షణ విషయం లో ప్రధాన మంత్రివచనబద్ధత కు అనుగుణం గా ఈ కార్యక్రమం ఉంది

శ్యోపుర్ లోని కరాహల్ లో జరిగే ఎస్ హెచ్ జి సమ్మేళనం లో ప్రధాన మంత్రి పాలుపంచుకొంటారు

సమ్మేళనాని కి వేల మంది మహిళా ఎస్ హెచ్ జి సభ్యులు/కమ్యూనిటీ రిసోర్స్పర్సన్స్ హాజరు కానున్నారు

పిఎమ్ కౌశల్ వికాస్ యోజన లో భాగం గా నాలుగు పర్ టిక్యులర్ లీ వల్ నరబల్ట్రైబల్ గ్రూప్స్ స్కిలింగ్ సెంటర్ లు నాలుగిటి ని కూడా ప్రధాన మంత్రిప్రారంభిస్తారు 

Posted On: 15 SEP 2022 1:12PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17వ తేదీ నాడు మధ్య ప్రదేశ్ ను సందర్శించనున్నారు. ఆ రోజు న ఉదయం సుమారు 10:45 నిమిషాల ప్రాంతం లో కొన్ని చీతాల ను ప్రధాన మంత్రి కూనో నేశనల్ పార్క్ లో ఉండడానికి గాను వదలి పెడతారు. ఆ తరువాత మిట్టమధ్యాహ్నం ఇంచుమించు 12 గంటల వేళ కు ఆయన శ్యోపుర్ లోని కరాహల్ లో జరిగే మహిళా స్వయంసహాయ సమూహాల (ఎస్ హెచ్ జి) సభ్యులు/కమ్యూనిటి రిసోర్స్ పర్సన్స్ తో కలసి ఎస్ హెచ్ జి సమ్మేళనం లో పాల్గొననున్నారు.

కునో నేశనల్ పార్క్ లో ప్రధాన మంత్రి

కునో నేశనల్ పార్క్ లో ఉండడానికి చీతాల ను ప్రధాన మంత్రి ద్వారా విడచిపెట్టడం; భారతదేశం లో వన్య జీవుల ఆవాసాలను పునర్జీవింపచేయడం మరియు దీనిలో వివిధత్వాన్ని తీసుకురావాలనే ఆయన ప్రయాసల లో ఒక భాగం గా ఉంది. చీతా సంతతి భారతదేశం లో అంతరించినట్లుగా 1952వ సంవత్సరం లో ప్రకటించడం జరిగింది. ఉద్యానం లో విడచి పెట్టనున్నటువంటి చీతా లు నమీబియా కు చెందినవి; వాటిని ఈ సంవత్సరం ఆరంభం లో సంతకాలైన ఒక ఎంఒయు లో భాగం గా తీసుకు రావడమైంది. భారతదేశం లో చీతాల ను మళ్లీ ప్రవేశపెట్టే కార్యం ప్రాజెక్ట్ చీతాలో ఒక భాగం గా జరుగుతున్నది. ప్రాజెక్ట్ చీతా అనేది పెద్ద వన్య మాంసాహారి జంతువుల ఖండాంతర స్థానాంతరణ తో ముడిపడ్డటువంటి ప్రపంచంలోకెల్లా తొలి పథకం అని చెప్పాలి.

భారతదేశం లో బహిరంగ అరణ్యాలు మరియు పచ్చికమైదాన సంబంధి ఇకోసిస్టమ్స్ పునరుద్ధరణ లో చీతా లు తోడ్పడనున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా జీవవైవిధ్యం సంరక్షణ తో పాటు గా జల భద్రత, కర్బన అవశేషాలు, నేల లో తేమ ను కాపాడడం వంటి ఇకోసిస్టమ్ ప్రక్రియల ను మెరుగుపరచడం లో దోహదపడి, తద్ద్వారా సమాజాని కి విశాల స్థాయి లో లబ్ధి చేకూరగలదు. పర్యావరణ పరిరక్షణ మరియు వన్యజీవి సంరక్షణ దిశ లలో ప్రధాన మంత్రి యొక్క వచనబద్ధత తో పర్యావరణ వికాసం మరియు పర్యావరణ పర్యటన కార్యకలాపాల ద్వారా స్థానిక సముదాయాని కి బ్రతుకుదెరువు తో ముడి పడ్డ అవకాశాలు పెరుగుతాయి.

ఎస్ హెచ్ జి సమ్మేళనం లో ప్రధాన మంత్రి

ప్రధాన మంత్రి శ్యోపుర్ లోని కరాహల్ లో ఏర్పాటవుతున్న ఎస్ హెచ్ జి సమ్మేళనం లో పాల్గొననున్నారు. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన-నేశనల్ రూరల్ లైవ్ లీ హుడ్ స్ మిశన్ (డిఎవై-ఎన్ఆర్ఎల్ఎమ్) లో భాగం గా ప్రోత్సాహాన్ని అందజేస్తున్నటువంటి వేల కొద్దీ మహిళా స్వయం సహాయ సమూహాల (ఎస్ హెచ్ జీస్) సభ్యులు/ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ ఈ సమ్మేళనాని కి తరలిరానున్నారు.

ఇదే కార్యక్రమం లో, పిఎమ్ కౌశల్ వికాస్ యోజన లో భాగం గా పర్ టిక్యులర్ లీ వల్ నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ (పివిటిజి) కి చెందిన నాలుగు నైపుణ్య కేంద్రాల ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు.

గ్రామీణ ప్రాంతాల కు చెందిన పేద కుటుంబాల ను దశల వారి గా ఎస్ హెచ్ జి లో చేరే అవకాశం ఇచ్చి, వారు వారి యొక్క జీవనోపాధి మార్గాల ను విధవిధాలు గా తీర్చిదిద్దుకొనేందుకు అవసరమైన దీర్ఘకాలిక సమర్థన ను అందించడం, వారి ఆదాయాల ను మరియు జీవన నాణ్యత ను మెరుగు పరచాలి అనేవి దీన్ దయాళ్ అంత్యోదయ యోజన-నేశనల్ రూరల్ లైవ్ లీ హుడ్ స్ మిశన్ యొక్క లక్ష్యాలు గా ఉన్నాయి. ఈ మిశన్ గృహహింస, మహిళల్లో విద్యః వ్యాప్తి, ఇంకా మహిళల కు సంబంధించిన ఇతర సమస్య లు, పోషణ, స్వచ్ఛత, ఆరోగ్యం వంటి అంశాల లో చైతన్యాన్ని తీసుకు రావడం, ప్రవర్తన లో పరివర్తన కోసం అవసరమైన సమాచారాన్ని అందించడం వంటి వాటి ద్వారా మహిళా ఎస్ హెచ్ జి సభ్యుల కు సాధికారిత కల్పన దిశ గా కూడా పాటుపడుతున్నది.

 

***(Release ID: 1859584) Visitor Counter : 197