మంత్రిమండలి
భారతదేశం లో ఫెడరేశన్ ఇంటర్ నేశనల్ డి ఫుట్ బాల్ అసోసియేశన్ (ఫీఫా) అండర్ 17 మహిళల ప్రపంచ కప్ 2022 కు ఆతిథ్యాన్ని ఇవ్వడం కోసం గ్యారంటీలపై సంతకాలు చేయడానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి
Posted On:
14 SEP 2022 3:58PM by PIB Hyderabad
భారతదేశం లో ఫెడరేశన్ ఇంటర్ నేశనల్ డి ఫుట్ బాల్ అసోసియేశన్ (ఎఫ్ఐఎఫ్ఎ- ‘ఫీఫా’) అండర్ 17 మహిళల ప్రపంచ కప్ 2022 కు ఆతిథ్యం ఇవ్వడం కోసం గ్యారంటీల పై సంతకాలు చేయడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదాన్ని తెలిపింది.
ఫీఫా యు-17 మహిళల ప్రపంచ కప్ 2022 ను భారతదేశం లో ఈ సంవత్సరం అక్టోబర్ 11వ తేదీ నాటి నుండి అదే నెల 30వ తేదీ మధ్య కాలం లో నిర్వహించడం జరుగుతుంది. ప్రతి రెండు సంవత్సరాల కు ఒకసారి జరిగే ఈ ఆట ల పోటీ ల తాలూకు ఏడో సంచిక కు భారతదేశం మొట్టమొదటి సారి గా ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. ఫీఫా అండర్-17 మెన్స్ వరల్డ్ కప్ 2017 నుండి లభించిన సకారాత్మకమైన వారసత్వాని కి కొనసాగింపు గా, దేశం మహిళల ఫుట్ బాల్ లో ఒక చరిత్రాత్మకమైన ఘట్టాని కి సంసిద్ధం అవుతున్నది. ఈ కార్యక్రమం లో ప్రపంచవ్యాప్తం గా అత్యుత్తమ యువ మహిళా ఫుట్ బాల్ క్రీడాకారులు ఈ ప్రతిష్టాత్మకమైన ట్రోఫీ ని గెలుచుకోవడం కోసం వారి వారి నైపుణ్యాల ను కనబరచనున్నారు.
ఆర్థిక వ్యయం:
అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్) కు ఆట మైదానాల యొక్క నిర్వహణ, క్రీడా మైదానం లో ఆసీనులయ్యే ప్రేక్షకుల సామర్థ్యం, శక్తి మరియు కేబుల్ ను ఏర్పాటు చేయడం, మైదానాల మరియు శిక్షణ స్థలాల బ్రాండింగ్ మొదలైన కార్యకలాపాల కోసం 10 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని నేశనల్ స్పోర్ట్ స్ ఫెడరేశన్స్ (ఎన్ఎస్ఎఫ్ స్) యొక్క సహాయ పథకం రూపం లో బడ్జెటులో జరిపిన కేటాయింపు నుండి భరించడం జరుగుతుంది
సహాయ పథకం యొక్క లక్ష్యాలు:
· ఫీఫా యు-17 విమెన్స్ వరల్డ్ కప్ ఇండియా 2022 కు దేశం లోని మహిళల ఫుట్ బాల్ క్రీడ ను పటిష్ట పరచే సామర్ధ్యం ఉంది.
· ఫీఫా అండర్-17 పురుషుల ప్రపంచ కప్ 2017 నుండి లభించిన సకారాత్మకమైన వారసత్వాన్ని ముందుకు తీసుకు పోతూ, దేశం మహిళల ఫుట్ బాల్ లో ఒక మహత్త్వపూర్ణమైన ఘట్టాని కి సంసిద్ధం అవుతున్నది. ప్రపంచవ్యాప్తం గా అత్యుత్తమ యువ మహిళా ఫుట్ బాల్ క్రీడాకారులు ఈ కార్యక్రమం లో పాలుపంచుకొని, ప్రతిష్టాత్మకమైన ట్రోఫీ ని గెలుచుకోవడం కోసం వారి నైపుణ్యాల ను కనబరచనున్నారు. ఒక సకారాత్మకమైన సంప్రదాయాన్ని నెలకొల్పడం కోసం ఈ కింది లక్ష్యాల ను సంకల్పించుకోవడమైంద
· ఫుట్ బాల్ జగత్తు లో మరియు నిర్ణయాలు తీసుకొనే సంస్థలలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడం.
· భారతదేశం లో మరింత మంది అమ్మాయిల కు ఫుట్ బాల్ ఆడేందుకు ప్రేరితులను చేయడం.
· చిన్న వయస్సు నుండే సమానమైన ఆట తాలూకు ఆకళింపు ను సరళం చేసివేసి బాలికలు, బాలురు భేదభావానికి అతీతం గా ఈ ఆట లో పాల్గొనేందుకు స్థైర్యాన్ని ఇవ్వడం
· భారతదేశం లో మహిళల కోసం ఫుట్ బాల్ క్రీడ తాలూకు స్థాయి ని మెరుగు పరచేందుకు ఒక అవకాశాన్ని ప్రసాదించడం
· మహిళలు పాల్గొనే క్రీడ యొక్క వాణిజ్య విలువ ను మెరుగుపరచడం.
ఔచిత్యం:
ఫీఫా అండర్-17 మహిళల ప్రపంచ కప్ అనేది ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం. మరి దీని ని భారతదేశం లో మొట్టమొదటిసారి గా నిర్వహించడం జరుగుతుంది. ఇది యువజనులను మరింత ఎక్కువ సంఖ్య లో క్రీడల లో పాలుపంచుకొనేటట్టు ప్రోత్సహిస్తుంది; అంతేకాక, భారతదేశం లో ఫుట్ బాల్ క్రీడ వృద్ధి చెందడం లో కూడాను సహాయకారి కాగలదు. ఈ కార్యక్రమం భారతదేశాని కి చెందిన అమ్మాయిల లో ఫుట్ బాల్ ను వారికి నచ్చిన ఒక క్రీడ గా ప్రోత్సహించడం ఒక్కటే కాకుండా, దేశం లోని అమ్మాయిలు, మహిళలు ఫుట్ బాల్ అన్నా, సాధారణం గా ఆడే ఇతర ఆటలన్నా ఆదరణ ను కనబరచడాన్ని సరళతరం చేయనుంది.
పూర్వరంగం:
ఫీఫా యు-17 మహిళల ప్రపంచ కప్ అనేది ఫీఫా ద్వారా 17 ఏళ్ల వయస్సు లేదా అంత కంటే తక్కువ వయస్సు కలిగిన మహిళా కీరడాకారుల కోసం నిర్వహిస్తున్నటువంటి ఒక ప్రపంచ చాంపియన్ శిప్. ఈ క్రీడల ను నిర్వహించడాన్ని 2008వ సంవత్సరం లో ప్రారంభించడం జరిగింది. ఈ పోటీ ని సరి సంఖ్య కలిగిన సంవత్సరాల లో నిర్వహించడం జరుగుతున్నది. దీని ఆరో సంచిక ను ఉరుగ్వే లో 2018వ సంవత్సరం లో నవంబర్ 13వ తేదీ నాటి నుండి అదే ఏడాది లో డిసెంబర్ 1వ తేదీ మధ్య కాలం లో జరిపారు. ఫీఫా అండర్-17 మహిళల ప్రపంచ కప్ యొక్క వర్తమాన విజేత గా స్పెయిన్ ఉన్నది. ఫీఫా అండర్-17 విమెన్స్ వరల్డ్ కప్ ఇండియా 2022 ఈ టోర్నమెంట్ యొక్క ఏడో సంచిక కాగలదు. దీనిలో భారతదేశం సహా 16 జట్లు పాలుపంచుకోనున్నాయి. అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్) ఈ పోటీల యొక్క మ్యాచ్ లను మూడు స్థానాల నిర్వహించదలచుకొన్నట్లు ప్రతిపాదన చేసింది. ఆ మూడు స్థానాల లో ఏవేవి ఉన్నాయి అంటే అవి (ఎ) భువనేశ్వర్ (బి) నవీ ముంబయు మరియు (సి) గోవా లు. భారతదేశం 2017వ సంత్సరం లో అక్టోబరు 6వ తేదీ మొదలుకొని అదే నెల లో 28వ తేదీ వరకు దేశం లోని న్యూ ఢిల్లీ, గువాహాటీ, ముంబయి, గోవా, కోచీ మరియు కోల్ కాతా వంటి ఆరు వేరు వేరు స్థలాలలో ఫీఫా అండర్ -17 మెన్స్ వరల్డ్ కప్ ఇండియా-2017 కు ఫలప్రదం గా ఆతిథ్యాన్ని ఇచ్చింది.
***
(Release ID: 1859295)
Visitor Counter : 275
Read this release in:
Marathi
,
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada