ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహారాణిరెండో ఎలిజాబెథ్ కన్నుమూత పట్ల  సంతాపాన్నివ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 08 SEP 2022 11:30PM by PIB Hyderabad

మహారాణి రెండో ఎలిజాబెథ్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

మహారాణి రెండో ఎలిజాబెథ్ ను మన కాలం లోని ఒక మహోన్నత వ్యక్తి గా స్మరించుకోవడం జరుగుతుంది. ఆమె తన దేశాని కి మరియు ప్రజల కు ప్రేరణాత్మకమైనటువంటి నాయకత్వాన్ని అందించారు. ఆమె సార్వజనిక జీవనం లో గౌరవాన్ని మరియు సంయమనాన్ని కనబరిచారు. వారి కన్నుమూత వార్త నాకెంతో బాధ ను కలిగించింది. ఈ దు:ఖ ఘడియ లో వారి కుటుంబ సభ్యుల కు మరియు యునైటెడ్ కింగ్ డమ్ యొక్క ప్రజానీకాని కి నేను నా యొక్క సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను.’’

నేను 2015 వ సంవత్సరం లో మరియు 2018 వ సంవత్సరంలో నేను యు.కె. ను సందర్శించినప్పుడు, మహారాణి రెండో ఎలిజాబెథ్ తో మరచిపోలేనటువంటి సమావేశాల లో పాలుపంచుకొన్నాను. వారి స్నేహపూర్ణత్వాన్ని మరియు సహృద‌య‌త్వాన్ని నేను ఎన్నటికి కూడాను మరచిపోలేను. ఒక భేటీ సందర్భం లో, ఆమె తన వివాహ వేళ మహాత్మ గాంధీ బహుమతి గా ఇచ్చిన రుమాలు నాకు చూపించారు. నేను ఆ భావపూర్ణమైనటువంటి క్షణాన్ని సదా నా మనసు లో పదిలపరచుకొంటాను.’’ అని పేర్కొన్నారు.

Her Majesty Queen Elizabeth II will be remembered as a stalwart of our times. She provided inspiring leadership to her nation and people. She personified dignity and decency in public life. Pained by her demise. My thoughts are with her family and people of UK in this sad hour.

— Narendra Modi (@narendramodi) September 8, 2022

I had memorable meetings with Her Majesty Queen Elizabeth II during my UK visits in 2015 and 2018. I will never forget her warmth and kindness. During one of the meetings she showed me the handkerchief Mahatma Gandhi gifted her on her wedding. I will always cherish that gesture. pic.twitter.com/3aACbxhLgC

— Narendra Modi (@narendramodi) September 8, 2022

*****

DS/TS


(Release ID: 1857935) Visitor Counter : 118