వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

యుఎస్‌లోని భారతీయ ప్రవాసులు 'వసుధైవ కుటుంబం' ఆలోచన విధానానికి నిజమైన రాయబారులు - శ్రీ గోయల్


‘ఇండియా-అమెరికా స్టార్టప్ సేతు’ భారతీయులు, అమెరికన్ కంపెనీల మధ్య వారధిగా పనిచేస్తుంది, పరివర్తన, నైపుణ్యం పెంపులో
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఊతం ఇస్తుంది - శ్రీ గోయల్

మన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు భారతదేశ జాతీయ ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నాయి - శ్రీ గోయల్

పండుగలకు, బహుమతుల కోసం ఓడిఓపి ఉత్పత్తులను ఉపయోగించాలని శ్రీ గోయల్ భారతీయ ప్రవాసులను కోరారు

శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన కమ్యూనిటీ రిసెప్షన్‌లో ప్రసంగించిన శ్రీ గోయల్

Posted On: 07 SEP 2022 10:25AM by PIB Hyderabad

'వసుధైవ కుటుంబం' (ప్రపంచం ఒక కుటుంబం) అనే గొప్ప ఆలోచన విధానానికి నిజమైన రాయబారులు అమెరికాలోని భారతీయ ప్రవాసులు అని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ, జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అన్నారు. భాగస్వామ్యాలు, కొత్త సాంకేతికతలు, కొత్త ఆలోచనల ద్వారా సహకారం అందించడం, మద్దతు ఇవ్వడం ద్వారా అమెరికాలో వారి అసాధారణమైన విలువ సృష్టించుకోవడమే కాకుండా భారతదేశానికి తిరిగి అందించినందుకు భారతీయ సమాజాన్ని ఆయన అభినందించారు. శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన కమ్యూనిటీ రిసెప్షన్‌లో ఆయన ప్రసంగించారు. .

 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001R4M9.jpg

 

ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ఆత్మనిర్భర్‌గా మారేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోందని శ్రీ గోయల్ అన్నారు. ప్రభుత్వం ఎగుమతులకు పెద్దపీట వేస్తోందని, ప్రభుత్వంలో మరింత సమన్వయంతో పనిచేయడంపై దృష్టి సారించామని, భారతదేశంలోకి పెట్టుబడులను ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టామని, కొత్త రవాణా విధానాలను, పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలపడాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. సెమీకండక్టర్స్ పాలసీ, గ్లోబల్ స్కేల్ ఆఫ్ ఆపరేషన్స్‌తో పెద్ద ఫ్యాక్టరీలను ప్రోత్సహించడానికి 13 రంగాలకు ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహకాల పథకం గురించి కూడా ఆయన మాట్లాడారు.

భారత్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునే కంపెనీలకు తగు సహకారం అందిస్తున్నామని శ్రీ గోయల్‌ తెలిపారు. భారతదేశం భారీ మార్కెట్ సామర్థ్యాన్ని అందిస్తుందని, ఇది పెట్టుబడికి చాలా ఆకర్షణీయంగా ఉంటుందని, ఆయన అన్నారు.

భారత్‌తో కలిసి పనిచేయడానికి ప్రపంచవ్యాప్తంగా చాలా ఆసక్తి ఉందని, అభివృద్ధి చెందిన దేశాలతో మెరుగైన వాణిజ్య ఏర్పాట్లపై మా దృష్టి ఉందని అన్నారు. మా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు భారతదేశ జాతీయ ప్రయోజనాలపై ఆధారపడి ఉన్నాయని, ఎఫ్ టి ఏ లపై అనేక దేశాలతో చురుకైన చర్చలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.

 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002BEXY.jpg

 

పండుగలు, ఇతర సందర్భాలలో బహుమతిగా ఇవ్వడానికి ఓడిఓపి  (ఒక జిల్లా ఒక ఉత్పత్తి) ఉత్పత్తులను ఉపయోగించాలని ప్రవాస భారతీయులను కోరుతూ, ఇది భారతదేశంలోని మిలియన్ల మంది నేత కార్మికులు, చేతివృత్తుల వారికి జీవనోపాధిని కల్పిస్తుందని అన్నారు.
 

భారతదేశం మెరుగ్గా మారుతున్నదని, ఈ రోజు చాలా ఆత్మవిశ్వాసంతో ఉందని, శ్రీ గోయల్ అన్నారు. రాబోయే 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడానికి భారతదేశం చేస్తున్న ప్రయాణంలో ప్రవాస భారతీయుల సహకారం, భాగస్వామ్యాన్ని ఆయన కోరారు.

 

 

 

*****



(Release ID: 1857665) Visitor Counter : 93