మంత్రిమండలి

విద్య రంగం లో సహకారం అనే అంశం పైభారతదేశాని కి మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రంపై సంతకాల కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి 

Posted On: 07 SEP 2022 4:06PM by PIB Hyderabad

విద్య రంగం లో సహకారం అనే అంశం పై భారత ప్రభుత్వ విద్య మంత్రిత్వ శాఖ కు మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) ప్రభుత్వ విద్య మంత్రిత్వ శాఖ కు మధ్య ఒక అవగాహన పూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు) పై సంతకాలు చేయడాని కి మాన్య ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదాన్ని తెలిపింది. భారతదేశాని కి మరియు యుఎఇ కి మధ్య విద్య రంగం లో ప్రస్తుతం కొనసాగుతూ ఉన్న సహకారాన్ని మరింత గా బలపరచడం తో పాటు ఇతర తత్సంబంధిత కార్యక్రమాల పరిధి ని విస్తరించడం అనేవి ఈ ఎమ్ఒయు యొక్క ఉద్దేశ్యాలు గా ఉన్నాయి.

విద్య రంగం లో యుఎఇ తో 2015వ సంవత్సరం లో కుదిరిన ఒక ఎమ్ఒయు యొక్క కాల పరిమితి 2018వ సంవత్సరం లో ముగిసిపోయింది. రెండు దేశాల విద్య శాఖ మంత్రుల మధ్య 2019వ సంవత్సరం లో జరిగిన ఒక సమావేశం లో, ఒక కొత్త ఎమ్ఒయు పై సంతకాలు చేద్దామని యుఎఇ పక్షం ప్రతిపాదించింది. కొత్త ఎమ్ఒయు లో భారతదేశం యొక్క విద్య బోధన తాలూకు ఇకోసిస్టమ్ లో జాతీయ విద్య విధానం (ఎన్ఇపి) 2020 ద్వారా తీసుకు వచ్చిన మార్పుల ను కూడా చేర్చడం జరిగింది.

విద్య తాలూకు సమాచారం యొక్క ఆదాన ప్రదానం, టెక్నికల్ ఎండ్ వొకేశనల్ ఎడ్యుకేశన్ ఎండ్ ట్రైనింగ్ (టివిఇటి) యొక్క బోధన సిబ్బంది లో సామర్థ్యాన్ని పెంపొందింపచేయడం, శిక్షణ, సంయుక్త డిగ్రీ కోర్సులు / డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాముల కోసం రెండు దేశాల లో ఉన్నత విద్య సంస్థల తో పాటు ఈ తరహా ఇతర రంగాల మధ్య శిక్షణ సంబంధి సహకారానికి మార్గాన్ని సుగమం చేయడం అనేవి ఈ ఎమ్ఒయు ఉద్దేశ్యాలు గా ఉన్నాయి.

ఈ ఎమ్ఒయు భారతదేశాని కి మరియు యుఎఇ కి మధ్య విద్య సంబంధి సహకారాని కి నూతన జవసత్త్వాలను ప్రసాదిస్తుంది. అంతేకాక విద్య సంబంధి గతిశీలత ను పెంపొందింప చేస్తుంది. భారతీయుల కు యుఎఇ ఒక ప్రముఖమైన కార్యస్థలం గా ఉన్నందువల్ల టివిఇటి లో సహకారం అనే అంశాన్ని కూడా ఈ ఎమ్ఒయు లో పొందుపరచడమైంది.

ఈ ఎమ్ఒయు పై సంతకాలు అయ్యే తేదీ నాటి నుండి అయిదు సంవత్సరాల కాలం పాటు అమలు లో ఉంటుంది. రెండు పక్షాల సమ్మతి తో ఈ ఎమ్ఒయు దానంతట అదే నవీకరణ అయిపోయేందుకు కూడాను ఆస్కారం ఉన్నది. ఒకసారి సంతకాలు అయ్యాయి అంటే ఈ ఎమ్ఒయు 2015వ సంవత్సరం లో యుఎఇ తో కుదుర్చుకొన్న ఇదివరకటి ఎమ్ఒయు రద్దయిపోయి, దాని స్థానం లో ఇది అమలులోకి వస్తుంది.

 

***

 (Release ID: 1857564) Visitor Counter : 132