వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
భారతదేశం అంటే అవకాశాలు అని అర్థం; ఇది కేవలం భారతదేశ దశాబ్దం మాత్రమే కాదు, ఇది భారతదేశ శతాబ్దం: స్టాన్ ఫోర్డ్ విద్యార్థులతో కేంద్ర మంత్రి శ్రీ పియూష్ గోయల్
గత కొన్ని సంవత్సరాలుగా భారత దేశం
శరవేగంగా మార్పు చెందుతోంది, తన ఆర్థిక వ్యవlస్థను అభివృద్ధి చేసుకుంటోంది, తన
వ్యవస్థలను మెరుగు పరుస్తోంది, సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్వయింపచేసుకుంటూ
ప్రపంచంలో అత్యుత్తమ వాటి గురించి
తెలుసుకుంటున్నది: శ్రీ గోయల్
భారతదేశ ఎల్ ఇ డీ లైటింగ్ విజయ గాథ ఒక అద్భుతమైన దార్శనికత, కృషి , బలమైన నిర్వహణ పద్ధతులను ఉపయోగించిన ఫలితము: శ్రీ గోయల్
Posted On:
07 SEP 2022 9:15AM by PIB Hyderabad
'భారత దేశం' అంటే 'అవ కాశాలు' అని, ఇది కేవలం భారత దేశ దశబ్దమే కాదు శతాబ్దం అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, వినియోగ దారుల వ్యవహారాలు, ఆహార ,ప్రజా పంపిణీ , జౌళి శాఖల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అన్నారు. ఈ రోజు శాన్ ఫ్రాన్సిస్కో లోని స్టాన్ ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో అధ్యాపకులు, విద్యార్థులతో శ్రీ పీయూష్ గోయల్ సమావేశమయ్యారు.
త్వరితగతిన మార్పు చెందగల, తన ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసుకోగల, వడానికి, తన వ్యవస్థలను మెరుగుపరచుకోగల, సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా ఉపయోగించగల, ప్రపంచంలోన అత్యుత్తమ వాటి నుండి నేర్చుకోగల బలమైన పునాదిని ఏర్పరచుకోవడంలో భారతదేశం గత కొన్ని సంవత్సరాల సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుందని శ్రీ గోయల్ అన్నారు. దేశంలోని ప్రతి పౌరుడు, దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ మెరుగైన జీవితం, ఉజ్వల భవిష్యత్ కు హక్కు కలిగి ఉండేలా భారత దేశం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు.
గత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 675 బిలియన్ డాలర్లు దాటిన భారత ఎగుమతులను గురించి ప్రస్తావిస్తూ, 2030 నాటికి అంతర్జాతీయ వాణిజ్యాన్ని 2 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని దేశం ఇప్పుడు కోరుకుంటోందని, భారతదేశం తన 100 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకునే సమయానికి అది 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అవుతుందని ఆయన అన్నారు.
భారతదేశం ప్రపంచానికి అందించే అవకాశం అలాంటిదని, ఇది కేవలం భారతదేశ దశాబ్దం మాత్రమే కాదని, ఇది భారతదేశ శతాబ్దం అని ఆయన అన్నారు.
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ,స్టార్టప్ ఛాంపియన్ లుగా వేగంగా ఆవిర్భవిస్తున్న భారతదేశ యువతపై తన విశ్వాసాన్ని వ్యక్తం చేసిన శ్రీ గోయల్, భారతదేశ నూతన విద్యావిధానం ఉదార విద్యకు ఒక ఉత్తేజాన్ని ఇస్తోందని, ప్రపంచంలోని అత్యుత్తమ విద్యాసంస్థలతో లోతైన సహకారాన్ని చూస్తోందని అన్నారు.
భారతదేశ భవిష్యత్తు కోసం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన దార్శనికతను, ప్రణాళికలను కొన్ని దృఢమైన యాజమాన్య సూత్రాల ఆధారంగా ఆవిష్కరించారు శ్రీ గోయెల్ తెలిపారు. ఎల్ ఇ డీ లైటింగ్ విప్లవాన్ని ఇందుకు నిదర్శనంగా పేర్కొన్న శ్రీ గొయెల్, ఇంధన రంగం సుస్థిరత పై 2014 లో ప్రధాన మంత్రి ప్రత్యేక దృష్టి పెట్టానని, విద్యుత్ రంగంలో పెట్టుబడుల భారాన్ని తగ్గించడానికి, సామాన్యుల విద్యుత్ బిల్లులను తగ్గించడానికి, 2015లో ఎల్ ఈడీ లైటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారని ఆయన వివరించారు.
అత్యంత ఖరీదైన ఎల్ ఈడి దీపాల కొనుగోలుకు సబ్సిడీని ఉపసంహరించుకోవాలన్న ప్రధాన మంత్రి నిర్ణయం ఎల్ ఇడి లైటింగ్ ను ప్రోత్సహించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నంలో నిర్వచించే క్షణం అని శ్రీ గోయల్ అభిప్రాయపడ్డారు. దిగుమతిదారుల నుండి పంపిణీదారుల నుండి సరఫరాదారుల వరకు ప్రభుత్వం వాటాదారులందరితో విస్తృతంగా నిమగ్నమైంది, కొంతవరకు ఆర్థిక వ్యవస్థలను తీసుకురావడం ద్వారా , సరఫరాదారులు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను కొంతవరకు సమర్థవంతంగా పరిష్కరించడం ద్వారా ఈ కార్యక్రమం మొదటి సంవత్సరంలోనే ఎల్ఇడి బల్బ్ ధరను విజయవంతంగా 85%
తగ్గించిందని ఆయన తెలిపారు.
ఎల్ ఇ డి లైటింగ్ కార్యక్రమం విజయవంతం కావడం కోసం భారత దేశం రూట్ కాజ్ అనాలిసిస్ , ఇన్నోవేటివ్ ఫైనాన్సింగ్ మోడల్స్ , ఎకానమీస్ ఆఫ్ స్కేల్ వంటి పలు మేనేజ్ మెంట్ సూత్రాలను విజయవంతంగా
ఉపయోగించుకున్నట్లు ఆయన తెలిపారు.ఆ కార్యక్రమం కారణంగా భారతదేశం సుమారు
80 మిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను ఆదా చేయగలిగిందని, ఒకప్పుడు ఎల్ ఈడీ ల్యాంపుల నికర దిగుమతిదారుగా ఉన్న భారతదేశం
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసే అనేక మంది హై క్వాలిటీ ఎల్ ఇ డీ ల్యాంపుల తయారీదారులను కలిగి ఉందని శ్రీ గోయల్ తెలిపారు.
ఈ ఒకే ఒక కార్యక్రమం ద్వారా వచ్చిన భారీ మార్పును ప్రస్తావిస్తూ, భారతదేశం ఇప్పుడు ఇలాంటి వందలాది పరివర్తనాత్మక
కార్యక్రమాలను ప్లాన్ చేస్తోందని శ్రీ గోయల్ చెప్పారు. భారతదేశ ఫిన్ టెక్ విజయం గురించి మంత్రి మాట్లాడుతూ, అన్ని డిజిటల్ లావాదేవీలలో దాదాపు 40 శాతం నేడు భారతదేశం వెలుపల జరుగుతున్నాయని, చిన్న విక్రేతలు కూడా డిజిటల్ చెల్లింపులను అంగీకరిస్తున్నారని అన్నారు.
భారతదేశం ప్రపంచానికి అందించిన అద్భుతఅవకాశాలను గురించి ప్రస్తావిస్తూ, భారతదేశంతో మమేకం కావాలని, గొప్ప ఆకాంక్షలతో ఒక బిలియన్ కు పైగా ప్రజలతో కలిసి పనిచేయాలని శ్రీ గోయల్ స్టాన్ ఫోర్డ్ లోని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
******
(Release ID: 1857548)
Visitor Counter : 296