రైల్వే మంత్రిత్వ శాఖ
119.32 ఎంటీల సరుకు లోడింగ్‌తో ఆగస్ట్'22లో అత్యధిక ఆగస్ట్ నెలవారీ రికార్డును నమోదు చేసిన భారతీయ రైల్వే.
ఆగస్టు నెలలో పెరిగిన లోడింగ్ 8.69ఎంటీగా ఉంది. అంటే 2021లో సాధించిన మునుపటి అత్యుత్తమ ఆగస్టు గణాంకాల కంటే ఇది 7.86% వృద్ధి
దీంతో భారతీయ రైల్వే వరుసగా 24 నెలలపాటు అత్యుత్తమ నెలవారీ సరుకు రవాణా గణాంకాలను నమోదు చేసింది
Posted On:
05 SEP 2022 11:14AM by PIB Hyderabad
భారతీయ రైల్వే (ఐఆర్) ఆగస్టు 22లో 119.32 ఎంటీల అత్యుత్తమ ఆగస్టు నెలవారీ సరుకు లోడింగ్‌ను నమోదు చేసింది. ఆగస్ట్ నెలలో పెరిగిన లోడింగ్ 8.69 ఎంటీగా ఉంది. అంటే 2021లో సాధించిన మునుపటి అత్యుత్తమ ఆగస్టు గణాంకాల కంటే ఇది 7.86% వృద్ధి. దీంతో భారతీయ రైల్వే 24 వరుస నెలలలో అత్యుత్తమ నెలవారీ సరుకు రవాణాను చేసింది.
బొగ్గులో 9.2 ఎంటీ, ఎరువులలో 0.71 ఎంటీ మిగిలిన ఇతర వస్తువులలో 0.68 ఎంటీ అలాగే కంటైనర్‌లో 0.62 ఎంటీ పెరుగుదలను భారతీయ రైల్వే సాధించింది. ఆటోమొబైల్ లోడింగ్‌లో పెరుగుదల ఎఫ్‌వై 2022-23లో ఫ్రైట్ వ్యాపారంలో మరో ముఖ్యాంశం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు వరకు 2206 రేక్‌లు లోడ్ చేయబడ్డాయి. గత సంవత్సరం ఇదే కాలంలో 1314 రేక్‌లు లోడ్ చేయబడ్డాయి. అంటే 68% వృద్ధి నమోదయింది.
2022 ఏప్రిల్ 1 నుండి ఆగస్ట్ 31 '2022 వరకు 620.87 ఎంటీకి సంచిత సరుకు రవాణా పెరిగింది. అంటే 2021-22లో సాధించిన 562.75 ఎంటీ నుండి 58.11 ఎంటీకి పెరిగింది. అంటే గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 10.32 వృద్ధితో 58.11 ఎంటీ పెరుగుదల నమోదయింది.
సరుకు రవాణా ఎన్‌టికేఎంలు (నెట్ టన్ కిలోమీటర్లు) ఆగస్టు '21లో 63 బిలియన్‌ల నుండి ఆగస్టు'22 నాటికి 73 బిలియన్లకు పెరిగి 16% వృద్ధిని నమోదు చేశాయి. మొదటి ఐదు నెలల్లో సంచిత ఎన్‌టికేఎంలు కూడా 18.29% పెరిగాయి.
విద్యుత్ మరియు బొగ్గు మంత్రిత్వ శాఖ సమన్వయంతో పవర్ హౌస్‌లకు బొగ్గు సరఫరాను పెంచడానికి భారతీయ రైల్వేలు చేసిన నిరంతర ప్రయత్నాలు ఆగస్టు నెలలో సరుకు రవాణా పనితీరును మెరుగుపర్చాయి. గత ఏడాది 34.18 ఎంటీ నుండి 44.64 ఎంటీ బొగ్గును పవర్ హౌస్‌లకు తరలించడంతో ఆగస్టులో 10.46 ఎంటీ బొగ్గు (దేశీయ మరియు దిగుమతి చేసుకున్నవి) పవర్ హౌస్‌లకు లోడ్ చేయడం పెరిగింది. అంటే 31% వృద్ధి. సంవత్సరం మొదటి ఐదు నెలల్లో గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 58.41 ఎంటీ అదనపు బొగ్గును పవర్ హౌస్‌లకు భారతీయ రైల్వే చేరవేసింది. అంటే ఇందులో 32% కంటే ఎక్కువ వృద్ధిని సాధించింది.
ఈ కింది కమోడిటీ వారీగా గ్రోత్ నంబర్ వృద్ధి దాదాపు అన్ని కమోడిటీ సెగ్మెంట్లలో ఐఆర్ అద్భుతమైన వృద్ధిని సాధించిందని చూపిస్తుంది:
సరుకు
|
తేడా (ఎంటీ)
|
తేడా (శాతాల్లో)
|
బొగ్గు
|
9.20
|
19.26
|
ఎరువులు
|
0.71
|
17.10
|
మిగిలిన ఇతర వస్తువులు
|
0.68
|
7.69
|
కంటైనర్లు
|
0.62
|
9.39
|
పిఓఎల్
|
0.28
|
7.80
|
***
(Release ID: 1856868)
Visitor Counter : 139