హోం మంత్రిత్వ శాఖ
ఈరోజు తిరువనంతపురంలో 30వ దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ సమావేశానికి కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షత వహించారు.
Posted On:
03 SEP 2022 5:07PM by PIB Hyderabad
రానున్న ఓనం పండుగ సందర్భంగా కేరళ ప్రజలకు కేంద్ర హోం, సహకార మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. కేరళ ప్రకృతి సౌందర్యానికి నిలయం, ఓనం కేరళకు మాత్రమే కాకుండా భారతీయ సంస్కృతి లో ప్రధాన పర్వదినం.
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో గత ఎనిమిదేళ్లలో దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ స్వరూపం మారిపోవడంతో పాటు కౌన్సిల్‌లు నిర్వహించే సమావేశాల సంఖ్య గణనీయంగా పెరిగింది.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రారంభించిన 'హర్ ఘర్ తిరంగ' ప్రచారంలో, పౌరులు తమ రాష్ట్ర, కుల, మత భావాలకు అతీతంగా విశాల జాతీయ స్ఫూర్తి ని ప్రదర్శించారు. వారి ఇళ్ల పై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం ద్వారా మన జాతీయ ఐక్యతను చాటడం ద్వారా దేశభక్తి కి అద్భుతమైన ఉదాహరణను చూపించారు.
దేశం యొక్క ఉజ్వల భవిష్యత్తు కోసం రాబోయే పదకొండు నెలల ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో దేశభక్తి స్ఫూర్తిని క్షేత్ర స్థాయికి తీసుకెళ్లడానికి అందరూ కలిసి పనిచేయాలి.
ఈరోజు తిరువనంతపురంలో జరిగిన 30వ దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ సమావేశంలో మొత్తం 26 సమస్యలు చర్చించబడ్డాయి, 9 సమస్యలు పరిష్కరించబడ్డాయి, 17 అంశాలు తదుపరి పరిశీలన కోసం వుంచారు, వీటిలో 9 అంశాలు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించినవి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ల మధ్య అపరిష్కృతంగా వున్న సమస్యలను పరస్పరం పరిష్కరించుకోవాలని కేంద్ర హోంమంత్రి కోరారు
ప్రధానమంత్రికి దక్షిణ భారతదేశంతో ప్రత్యేక అనుబంధం ఉంది, అందుకే 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత, శ్రీ నరేంద్ర మోడీ, సాగరమాల ప్రాజెక్టుతో పాటు తీరప్రాంత రాష్ట్రాల అభివృద్ధికి భారీ పోర్టుల ఆధునీకరణ కోసం అనేక పథకాలను ప్రారంభించారు.
2014కు ముందు దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ సమావేశాలు ఏడాదికి సగటున రెండు సమావేశాలు నిర్వహించగా, ఈ ప్రభుత్వం 2.7కి, స్టాండింగ్ కమిటీ సమావేశాలు సగటున 1.4 సమావేశాలు జరిగేవి, ఈ ప్రభుత్వం దీన్ని కూడా దాదాపు రెట్టింపు కు పెంచి 2.75 సార్లు నిర్వహించింది.
2014కు ముందు దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ సమావేశాల్లో పరిష్కారమయ్యే సమస్యల శాతం 43 కాగా ఇప్పుడు 64 శాతానికి పెరిగింది.
2006 నుంచి 2013 మధ్య జరిగిన మండల పరిషత్ సమావేశాల్లో 104 సమస్యలు, 2014 నుంచి 2022 వరకు 555 అంశాలపై చర్చించగా, ఇందులో 64 శాతం పరస్పర అంగీకారంతో పరిష్కరించుకున్నారు.
108 ప్రాజెక్టుల విలువ రూ. 76,000 కోట్లు పూర్తి కాగా, 98 ప్రాజెక్టులు రూ. 1,32,000 కోట్లు నిర్మాణంలో ఉన్నాయి మరియు తీర ప్రాంత రాష్ట్రాలకు ‘సాగరమాల’ కింద రూ. 2 లక్షల కోట్లు ప్రాజెక్టులు అమలు చేస్తున్నారు
ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద నీలి విప్లవం కోసం కోస్తా జిల్లాల సమగ్ర అభివృద్ధికి రూ.7,737 కోట్ల వ్యయం తో మొత్తం 61 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి.
2015 నుంచి దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో మత్స్య మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి పథకానికి రూ.4,206 కోట్లు మంజూరు చేశారు.
తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్‌లలో ఓడరేవులు మరియు మత్స్య పరిశ్రమల కోసం ప్రాథమిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి 56 ప్రాజెక్టులకు రూ.2,711 కోట్లు మంజూరు చేయబడ్డాయి.
7,500 కిలోమీటర్ల పొడవైన మన తీరప్రాంతంలో, దాదాపు 4,800 కిలోమీటర్లు దక్షిణాది రాష్ట్రాలలో ఉన్నాయి, దేశంలోని 12 ప్రధాన ఓడరేవులలో 7 ఈ ప్రాంతంలో ఉన్నాయి.
భారతదేశంలోని 3,461 మత్స్యకార గ్రామాలలో, వాటిలో 1,763 దక్షిణాది రాష్ట్రాలలో ఉన్నాయి మరియు సముద్ర ఉత్పత్తుల వాణిజ్యం మరియు ఎగుమతుల పెరుగుదలకు అపారమైన అవకాశం ఉంది.
నదీజలాల పంపకానికి సంబంధించిన సమస్యలకు ఉమ్మడి పరిష్కారాన్ని అన్వేషించాలని దక్షిణ జోనల్ కౌన్సిల్‌లోని అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంమంత్రి పిలుపునిచ్చారు.
దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ 12వ సమావేశంలో మొత్తం 89 అంశాలపై చర్చించగా, అందులో 63 అంశాలు పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవడం ఒక ముఖ్యమైన విజయం.
జోనల్ కౌన్సిల్ సమావేశాల ప్రధాన లక్ష్యాలు – కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య వివాదాలు మరియు అంతర్ రాష్ట్ర వివాదాలను పరస్పర ఒప్పందం ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడం, రాష్ట్రాల మధ్య ప్రాంతీయ సహకారాన్ని ప్రోత్సహించడం, జాతీయ ఉమ్మడి ప్రాముఖ్యత మరియు సమస్యలపై అన్ని రాష్ట్రాలకు మేధోమథనం చేయడానికి ఒక వేదికను అందించడం, రాష్ట్రాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి సహకార వ్యవస్థను ఏర్పాటు చేయడం.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ టీమ్ ఇండియా భావనను దేశం ముందు ఉంచారు, దేశ సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్రాలు కలిసి టీమ్ ఇండియాగా ఏర్పడ్డాయి.
హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాదకద్రవ్యాల సమస్యను అత్యంత అప్రమత్తంగా అరికట్టడానికి ప్రయత్నించింది, రాష్ట్రాలు ‘నార్కో కోఆర్డినేషన్ సెంటర్ (NCORD) యొక్క సాధారణ సమావేశాలను జిల్లా స్థాయికి తీసుకెళ్లాలి.
12 లక్షలకు పైగా క్యూ ఆర్ ఆధారిత (QR) పీ వీ సీ (PVC) ఆధార్ కార్డులు మత్స్యకారులకు అందించారు, ఇది తీరప్రాంత రాష్ట్రాల మత్స్యకారులను గుర్తించడానికి మాత్రమే కాకుండా, దేశ సముద్ర భద్రతను కూడా బలోపేతం చేస్తుంది.
ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ల ఏర్పాటు కోసం ఒక విధానాన్ని రూపొందించి రాష్ట్రాలకు పంపారు, తద్వారా శిక్షలు పడే అవకాశాలు పెంచుతుంది.
ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక బ్యాంకు శాఖ ఉండాలన్నదే మోదీ ప్రభుత్వ లక్ష్యం, ఇందుకోసం దక్షిణాది రాష్ట్రాలు తమ తమ ప్రాంతాల్లోని ఐదు కిలోమీటర్ల పరిధిలో ప్రతి గ్రామానికి బ్యాంకింగ్ సౌకర్యాలు కల్పించే దిశగా సహకార బ్యాంకులు శాఖలు విస్తరించేవిధంగా ఒప్పించేందుకు కృషి చేయాలి.
ఈరోజు తిరువనంతపురంలో జరిగిన 30వ దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ సమావేశానికి కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి కేరళ, కర్ణాటక, తమిళనాడు ముఖ్యమంత్రులు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్‌లు, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్, దక్షిణ జోనల్ కౌన్సిల్ రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సెక్రటేరియట్ సెక్రటరీలు హాజరయ్యారు. మరియు రాష్ట్ర మరియు కేంద్ర మంత్రిత్వ శాఖలు మరియు వివిధ శాఖల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
కేంద్ర హోం మరియు సహకార మంత్రి తన ప్రారంభ ఉపన్యాసం లో ప్రకృతి అందాలకు నిలయమైన కేరళ ప్రజలకు ‘ఓనం’ శుభాకాంక్షలు తెలిపారు. ఓనం కేరళకే కాకుండా భారతీయ సంస్కృతికి ప్రధానమైన పండుగ అని అన్నారు. ఈ సంవత్సరం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంవత్సరంగా జరుపుకుంటున్నందున దేశ చరిత్రలో ఈ సంవత్సరం చాలా ముఖ్యమైనదని శ్రీ అమిత్ షా అన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రారంభించిన 'హర్ ఘర్ త్రివర్ణ' ప్రచారంలో దేశప్రజలు తమ రాష్ట్ర, కులం, మతాలకు అతీతంగా జాతీయ స్ఫూర్తి తో తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ఐక్యతకు, దేశభక్తికి అద్భుతమైన ఉదాహరణగా నిలిచారని ఆయన అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను జరుపుకున్నందుకు అన్ని రాష్ట్రాలకు శ్రీ షా కృతజ్ఞతలు తెలిపారు. దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం, రానున్న పదకొండు నెలల ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో ఈ దేశభక్తి స్ఫూర్తిని క్షేత్ర స్థాయి లో తీసుకురావడానికి అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో గత ఎనిమిదేళ్లలో జోనల్ కౌన్సిల్‌ల స్వరూపం మారిపోయిందని, సమావేశాల సంఖ్య గణనీయంగా పెరిగిందని కేంద్ర హోంమంత్రి తెలిపారు. 2014కు ముందు జోనల్ కౌన్సిల్‌సమావేశాలు ఏడాదికి సగటున రెండు సమావేశాలు నిర్వహించేవారని, దానిని ఈ ప్రభుత్వం 2.7కు పెంచింది. స్టాండింగ్ కమిటీల సమావేశాలు సగటున 1.4 ఉండగా, ఈ ప్రభుత్వం కూడా దాదాపు రెట్టింపు చేసి 2.75కు చేరుకుంది. 2014కు ముందు జోనల్ కౌన్సిల్‌సమావేశాల్లో పరిష్కారమయ్యే సమస్యల శాతం 43 కాగా ఇప్పుడు 64 శాతానికి పెరిగింది. 2006 నుంచి 2013 మధ్య జోనల్ కౌన్సిల్ సమావేశాల్లో 104 సమస్యలు, 2014 నుంచి 2022 వరకు 555 సమస్యలపై చర్చించగా, ఇందులో 64 శాతం పరస్పర అంగీకారంతో పరిష్కరించుకున్నారు. 9 తీరప్రాంత రాష్ట్రాలు, 4 రాష్ట్రాలు మరియు 3 కేంద్రపాలిత ప్రాంతాలలో 4 జోనల్ కౌన్సిల్‌లో సభ్యులుగా ఉన్నాయని, అంటే మొత్తం 7,500 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతంలో, దాదాపు 4,800 కిలోమీటర్ల తీరప్రాంతంలో ఈ రాష్ట్రాల పరిధిలోకి వస్తుందని ఆయన చెప్పారు. భారతదేశంలోని 12 ప్రధాన ఓడరేవులలో 7 ప్రధాన ఓడరేవులు ఈ ప్రాంతంలో ఉన్నాయని శ్రీ షా చెప్పారు. దీనితో, ఇప్పుడు భారతదేశంలోని మొత్తం 3,461 మత్స్యకార గ్రామాలలో, 1,763 మత్స్యకార గ్రామాలు ఈ తీరప్రాంత పరిది లో ఉన్నాయి మరియు సముద్ర ఉత్పత్తుల వాణిజ్యం మరియు ఎగుమతి పెరగడానికి అపారమైన అవకాశం ఉంది.
ప్రధానమంత్రికి దక్షిణ భారతదేశంతో ప్రత్యేక అనుబంధం ఉందని, అందుకే 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత శ్రీ నరేంద్ర మోదీ సాగరమాల ప్రాజెక్ట్‌తో పాటు తీర ప్రాంత అభివృద్ధికి భారీ ఓడరేవుల ఆధునీకరించే అనేక పథకాలను ప్రారంభించారని శ్రీ అమిత్ షా అన్నారు. వీటిలో 108 ప్రాజెక్టులు రూ. 76,000 కోట్లు పూర్తి కాగా, 98 ప్రాజెక్టులు రూ. 13,2000 కోట్లు వ్యయమయ్యే ప్రాజెక్టులు ఈ రాష్ట్రాలలో అమలులో ఉన్నాయి. ఇలా మొత్తం ప్రాజెక్టుల్లో రూ. తీరప్రాంత రాష్ట్రాలకు సాగరమాల కింద 2,00,000 కోట్ల ప్రాజెక్టులు అమలు చేస్తున్నారు. మొత్తంగా 7,737 కోట్లు వ్యయమయ్యే 61 ప్రాజెక్టులు అమలులో ఉన్నాయని తెలిపారు.
నీలి విప్లవం కోసం కోస్తా జిల్లాల సమగ్ర అభివృద్ధికి 7,737 కోట్లు ఖర్చు తో ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజనను అమలు చేస్తున్నారు. 2015 నుంచి దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలలో మత్స్య పరిశ్రమ మౌలిక సదుపాయాల అభివృద్ధి (ఫిషరీస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ స్కీమ్) కోసం రూ. 4,206 కోట్లు మంజూరయ్యాయి. తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్‌లలో 56 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. రాష్ట్రాలలో ఓడరేవులు మరియు మత్స్య పరిశ్రమల ప్రాథమిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 2,711 కోట్లు నిధులు కేటాయించారు
ఈరోజు తిరువనంతపురంలో జరిగిన 30వ దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశంలో 26 అంశాలపై చర్చించామని, 9 సమస్యలు పరిష్కరించామని, 17 అంశాలను తదుపరి పరిశీలనకు ఉంచామని, అందులో 9 అంశాలు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించినవని కేంద్ర హోంమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ తమ పెండింగ్ సమస్యలను పరస్పర అవగాహన తో చర్చల ద్వారా పరిష్కరించాలని శ్రీ షా కోరారు, ఇది వారి రాష్ట్రాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా మొత్తం దక్షిణ ప్రాంతం యొక్క సర్వతోముఖాభివృద్ధికి దారి తీస్తుంది. కౌన్సిల్‌లోని అన్ని సభ్యరాష్ట్రాలు నీటి పంపిణీకి సంబంధించిన సమస్యలకు ఉమ్మడి పరిష్కారాన్ని కనుగొనాలని ఆయన పిలుపునిచ్చారు. తన స్టాండింగ్ కమిటీ 12వ సమావేశంలో మొత్తం 89 అంశాలపై చర్చించామని, ఇందులో 63 అంశాలు పరస్పర ఒప్పందం ద్వారా పరిష్కరించుకోవడం గొప్ప విజయమని శ్రీ షా చెప్పారు
కేంద్ర, రాష్ట్రాలు, అంతర్రాష్ట్రాల మధ్య పరస్పర ఒప్పందం ద్వారా వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడం, రాష్ట్రాల మధ్య ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడం, అన్ని రాష్ట్రాలకు మేధోమథనానికి వేదికను అందించడం, ఉమ్మడి జాతీయ ప్రాముఖ్యత ఉన్న సమస్యలపై మరియు అన్ని రాష్ట్రాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి సహకార వ్యవస్థను ఏర్పాటు చేయడం వంటివి జోనల్ కౌన్సిల్ సమావేశం యొక్క ప్రధాన లక్ష్యాలని కేంద్ర హోం మరియు సహకార మంత్రి తెలిపారు. దేశ సర్వతోముఖాభివృద్ధి కోసం, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ టీమ్ ఇండియా భావనను దేశం ముందు ఉంచారని, అన్ని రాష్ట్రాలు కలిసి టీమ్ ఇండియాను ఏర్పాటు చేశాయని శ్రీ షా అన్నారు.
నార్కోటిక్స్ సమస్యను అరికట్టేందుకు హోం మంత్రిత్వ శాఖ అత్యంత కఠినంగా వ్యవహరించిందని శ్రీ అమిత్ షా తెలిపారు. అన్ని రాష్ట్రాల నుంచి ఎన్‌సీఓఆర్‌డీ సమావేశాలు నిర్వహించి నార్కోటిక్స్ సమస్యను అరికట్టేందుకు కార్యాచరణను జిల్లా స్థాయికి తీసుకెళ్లాలని ఆయన నొక్కి చెప్పారు. 12 లక్షల మందికి పైగా మత్స్యకారులకు క్యూ ఆర్ ఆధారిత (QR) పీ వీ సీ (PVC) ఆధార్ కార్డులు (క్యూఆర్ ఎనేబుల్డ్ పివిసి ఆధార్ కార్డులు) అందించినట్లు శ్రీ షా తెలియజేశారు. తద్వరా ఇవి తీరప్రాంత రాష్ట్రాల మత్స్యకారులకు గుర్తింపు కోసమే కాకుండా తీరప్రాంత భద్రత కూడా పటిష్టం కానుంది. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ల ఏర్పాటుకు సంబంధించిన విధానాన్ని రూపొందించి రాష్ట్రాలకు పంపినట్లు హోంమంత్రి తెలిపారు. దీంతో శిక్షల సంఖ్య పెరుగుతుంది. ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక బ్యాంకు శాఖ ఉండాలన్నదే మోడీ ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం దక్షిణ మండల కౌన్సిల్‌లోని సభ్య రాష్ట్రాలు తమ పరిధిలోని ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రతి గ్రామానికి బ్యాంకింగ్ సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేయాలని, సహకార సంఘ బ్యాంకులను ఒప్పించి బ్యాంకులు శాఖలను తెరవాలి. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను నేరుగా లబ్ధిదారులకు (DBT) ద్వారా అందజేయడంలో ఇది సహాయపడుతుంది.
***
(Release ID: 1856576)
Visitor Counter : 324