ప్రధాన మంత్రి కార్యాలయం

గుజరాత్ లోని అంబాజీ లో జరిగిన ఒక దుర్ఘటన కారణం గా ప్రాణనష్టం వాటిల్లడంపట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి 

Posted On: 02 SEP 2022 2:03PM by PIB Hyderabad

గుజరాత్ లోని అంబాజీ లో జరిగిన ఒక దుర్ఘటన కారణం గా ప్రాణనష్టం సంభవించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తులు త్వరగా కోలుకోవాలని కూడా ఆయన ఆకాంక్షించారు.

ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎమ్ఒ) ఒక ట్వీట్ లో -

‘‘గుజరాత్ లోని అంబాజీ లో జరిగిన ఒక దుర్ఘటన కారణం గా ప్రాణనష్టం సంభవించినందుకు నేను ప్రగాఢమైన వేదన కు లోనయ్యాను. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తులు త్వరగా కోలుకోవాలని నేను కోరుకొంటున్నాను. బాధితుల కు చేతనైన అన్ని విధాలుగాను సహాయాన్ని అందించడం జరుగుతున్నది: ప్రధాన మంత్రి @narendramodi’’ అని పేర్కొంది.

 

******

DS/ST

 

 



(Release ID: 1856361) Visitor Counter : 127