ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారతదేశం రోజుకు సగటున 9 మిలియన్ల కంటే ఎక్కువ ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డిబిటి) చెల్లింపులను చేసింది (2021-22 ఆర్థిక సంవత్సరంలో)


రోజుకు సగటున 284 మిలియన్ల డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయి

Posted On: 01 SEP 2022 7:31PM by PIB Hyderabad

ప్రస్తుతం డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. అలాగే, ప్రజల జీవితాలను మరియు పాలనను మెరుగుపరచడానికి సాంకేతికతను ఉపయోగించడంలో భారతదేశం అగ్రగామిగా ఉంది. భారతీయ మార్కెట్ మరియు ఇతర రంగాలలో అమలు చేయబడిన డిజిటల్ పరిష్కారాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు అసూయతో చూస్తున్నాయి. భారతదేశం డిజిటల్‌లో అగ్రగామిగా ఉంది. డిజిటల్, భారతదేశాన్ని హైలైట్ చేస్తోంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రధాని మోదీ విజన్‌కు మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. డిజిటల్ మనీ ట్రాన్స్‌ఫర్ మరియు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్) విజయవంతమైన విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. 2013 నుండి,  ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా రూ.24.8 కోట్లకు పైగా బదిలీ చేయబడింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో, ఇది రూ.6.3 లక్షల కోట్లు. అంటే రోజుకు సగటున 90 లక్షలకు పైగా ప్రత్యక్ష ప్రయోజన బదిలీలు జరిగాయి. ప్రధానమంత్రి రైతు ఆదాయ మద్దతు పథకం కింద 10 కోట్ల మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు దాదాపు రూ.20,000 కోట్లు బదిలీ చేశారు.

2021-22 సంవత్సరంలోనే 8,840 కోట్లకు పైగా డిజిటల్ మనీ లావాదేవీలు జరిగాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 3,300 కోట్లు.(24 జూలై 2022 వరకు), రోజుకు సగటున 28.4 కోట్ల డిజిటల్ మనీ లావాదేవీలు జరిగాయి, 

డిజిటల్ రంగంలో పెట్టుబడులు (డిబిటి,జె.ఎ.ఎం ట్రినిటీ, ఎన్.పి.సి.ఐ మొదలైనవి) భారతదేశ విజయానికి ఉదాహరణ. 'అభివృద్ధి చెందుతున్న' దేశాలే కాకుండా 'అభివృద్ధి చెందిన' దేశాలు కూడా దీని నుండి నేర్చుకోవచ్చు.

 

***


(Release ID: 1856356) Visitor Counter : 223