ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఆగస్టు 2022 లో స్థూల జీఎస్టీ రెవెన్యూ వసూళ్లు రూ. 1,43,612 కోట్ల


ఆగస్ట్ 2022 నెల ఆదాయాలు 2021లో అదే నెలలో జీఎస్టీ రాబడి కంటే 28% ఎక్కువ

వరుసగా ఆరు నెలల పాటు నెలవారీ జీఎస్టీ ఆదాయం రూ. 1.4 లక్షల కోట్ల కంటే ఎక్కువ

Posted On: 01 SEP 2022 11:46AM by PIB Hyderabad

 

ఆగస్టు 2022 నెలలో వసూలైన స్థూల జీఎస్టీ రాబడి

రూ. 1,43,612 కోట్లు - ఇందులో సీజీఎస్టీ రూ. 24,710 కోట్లు, ఎస్జీఎస్టీ రూ. 30,951 కోట్లు, ఐజీఎస్టీ రూ. 77,782 కోట్లు (వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ. 42,067 కోట్ల తో సహా), సెస్

రూ. 10,168 కోట్లు (వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ. 1,018 కోట్ల తో సహా).

ప్రభుత్వం ఐజీఎస్టీ నుండి సిజీఎస్టీ కి రూ. 29,524 కోట్లు, ఎస్జీఎస్టీ కి  రూ. 25,119 కోట్లు చెల్లించింది. రెగ్యులర్ సెటిల్మెంట్ తర్వాత ఆగస్టు 2022 నెలలో కేంద్రం, రాష్ట్రాల మొత్తం ఆదాయం సీజీఎస్టీ కి రూ. 54,234 కోట్లు, ఎస్జీఎస్టీ కి  56,070 కోట్లు.

ఆగస్టు 2022 నెల ఆదాయాలు గత ఏడాది ఇదే నెలలో వచ్చిన రూ. 1,12,020 కోట్ల జీఎస్టీ ఆదాయాల కంటే 28% ఎక్కువ. ఈ నెలలో, వస్తువుల దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయాలు 57% ఎక్కువగా ఉన్నాయి. దేశీయ లావాదేవీల (సేవల దిగుమతితో సహా) ద్వారా వచ్చే ఆదాయాలు గత ఏడాది ఇదే నెలలో ఈ వనరుల నుండి వచ్చిన ఆదాయాల కంటే 19% ఎక్కువగా ఉన్నాయి.

ఇప్పుడు వరుసగా ఆరు నెలలుగా, నెలవారీ జీఎస్టీ ఆదాయాలు రూ. 1.4 లక్షల కోట్ల మార్కు దాటింది. గత సంవత్సరం ఇదే కాలంలో జీఎస్టీ  రాబడిలో ఆగస్టు 2022 వరకు వృద్ధి 33% ఉంది.  మెరుగైన సమ్మతిని నిర్ధారించడానికి గతంలో కౌన్సిల్ తీసుకున్న వివిధ చర్యల స్పష్టమైన ప్రభావం ఇది. ఆర్థిక పునరుద్ధరణతో పాటు మెరుగైన రిపోర్టింగ్ స్థిరమైన ప్రాతిపదికన జీఎస్టీ ఆదాయాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతోంది. జూలై 2022 నెలలో, 7.6 కోట్ల ఇ-వే బిల్లులు ఉత్పత్తి అయ్యాయి. ఇది జూన్ 2022లో 7.4 కోట్ల కంటే స్వల్పంగా ఎక్కువ, జూలై 2021లో 6.4 కోట్ల కంటే 19% ఎక్కువ.

దిగువ చార్ట్ ప్రస్తుత సంవత్సరంలో నెలవారీ స్థూల జీఎస్టీ ఆదాయాల ట్రెండ్‌లను చూపుతుంది. ఆగస్టు 2021తో పోలిస్తే 2022 ఆగస్టు నెలలో ప్రతి రాష్ట్రంలో సేకరించబడిన జీఎస్టీ రాష్ట్రాల వారీ గణాంకాలను చూపుతుంది.

 

 

 

ఆగష్టు 2022 ఓ రాష్ట్రాలవారీ జీఎస్టీ ఆదాయం:

రాష్ట్రం 

ఆగస్టు-21

ఆగస్టు-22

వృద్ధి 

జమ్మూ కాశ్మీర్ 

392

434

11%

హిమాచల్ ప్రదేశ్ 

704

709

1%

పంజాబ్ 

1,414

1,651

17%

చండీగఢ్ 

144

179

24%

ఉత్తరాఖండ్ 

1,089

1,094

0%

హర్యానా 

5,618

6,772

21%

ఢిల్లీ 

3,605

4,349

21%

రాజస్థాన్ 

3,049

3,341

10%

ఉత్తర ప్రదేశ్ 

5,946

6,781

14%

బీహార్ 

1,037

1,271

23%

సిక్కిం 

219

247

13%

అరుణాచల్ ప్రదేశ్ 

53

59

11%

నాగాలాండ్ 

32

38

18%

మణిపూర్ 

45

35

-22%

మిజోరాం 

16

28

78%

త్రిపుర 

56

56

0%

మేఘాలయ 

119

147

23%

అస్సాం 

959

1,055

10%

పశ్చిమ బెంగాల్ 

3,678

4,600

25%

ఝార్ఖండ్ 

2,166

2,595

20%

ఒడిశా 

3,317

3,884

17%

ఛత్తీస్గఢ్ 

2,391

2,442

2%

మధ్యప్రదేశ్ 

2,438

2,814

15%

గుజరాత్ 

7,556

8,684

15%

దామన్ డయ్యు 

1

1

4%

దాద్రా నగర్ హవేలీ 

254

310

22%

మహారాష్ట్ర 

15,175

18,863

24%

కర్ణాటక 

7,429

9,583

29%

గోవా 

285

376

32%

లక్షద్వీప్ 

1

0

-73%

కేరళ 

1,612

2,036

26%

తమిళ నాడు 

7,060

8,386

19%

పుదుచ్చేరి 

156

200

28%

అండమాన్ నికోబర్ దీవులు 

20

16

-21%

తెలంగాణ 

3,526

3,871

10%

ఆంధ్రప్రదేశ్ 

2,591

3,173

22%

లడఖ్ 

14

19

34%

ఇతర ప్రాంతాలు 

109

224

106%

కేంద్ర పరిథి 

214

205

-4%

మొత్తం 

84,490

1,00,526



(Release ID: 1856302) Visitor Counter : 210