పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

జీవవైవిధ్యం సంరక్షణ రంగం లో భారతదేశానికి మరియు నేపాల్ కు మధ్య ఎమ్ఒయు పై సంతకాల కుఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 31 AUG 2022 12:17PM by PIB Hyderabad

జీవ వైవిధ్య సంరక్షణ విషయం లో నేపాల్ ప్రభుత్వం తో ఒక అవగాహనపూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు) పై సంతకం చేయాలంటూ పర్యావరణం, అడవులు మరియు జలవాయు పరివర్తన మంత్రిత్వ శాఖ చేసిన ఒక ప్రతిపాదన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఆమోదాన్ని తెలిపింది. ఇరు దేశాల మధ్య కారిడర్ ల ను మరియు పరస్పరం జతపడ్డ క్షేత్రాల ను పున:ప్రారంభించడం తో పాటు జ్ఞ‌ానాన్ని మరియు సర్వోత్తమ పద్ధతుల ను ఒక పక్షాని కి మరొక పక్షం వెల్లడి చేసుకోవడం సహా వనాలు, వన్యజీవులు, పర్యావరణం, జీవ వైవిధ్య సంరక్షణ మరియు జలవాయు పరివర్తన ల రంగం లో సహకారాన్ని, సమన్వయాన్ని ప్రోత్సహించడం మరియు బలపరచడం ఈ ప్రతిపాదన యొక్క ఉద్దేశ్యాలు గా ఉన్నాయి.

ఉభయ దేశాల మధ్య కారిడర్ ల ను మరియు పరస్పరం జతపడ్డ క్షేత్రాల ను పున:ప్రారంభించడం తో పాటు జ్ఞ‌ానాన్ని మరియు సర్వోత్తమ పద్ధతులను ఒక పక్షాని కి మరొక పక్షం వెల్లడి చేసుకోవడం సహా వనాలు, వన్యప్రాణులు, పర్యావరణం, జీవవైవిధ్య సంరక్షణ మరియు జలవాయు పరివర్తన ల రంగం లో ఉభయ పక్షాలు ఒక పక్షాని కి మరొక పక్షం సహకరించుకోవడాన్ని, సమన్వయపరచుకోవడాన్ని ప్రోత్సహించడం లో మరియు బలపరచడం లో ఈ అవగాహనపూర్వక ఒప్పంద పత్రం సాయపడుతుంది.

 

***

 (Release ID: 1855822) Visitor Counter : 108