ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
గోధుమ లేదా మెస్లిన్ పిండి తాలూకు ఎగుమతి విధానానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి
Posted On:
25 AUG 2022 2:43PM by PIB Hyderabad
ఎగుమతి పరమైనటువంటి ఆంక్షల నుంచి/ నిషేధం నుంచి గోధుమ లేదా మెస్లిన్ పిండి (హెచ్ఎస్ కోడ్ 1101) ని మినహాయించడం కోసం తత్సంబంధి విధానం లో సవరణ కు ఉద్దేశించిన ప్రతిపాదన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సిసిఇఎ) సమావేశం ఆమోదాన్ని తెలిపింది.
ప్రభావం:
ఈ ఆమోదం ఇక గోధుమ పిండి ఎగుమతి పైన ఒక ఆంక్ష ను విధించడాని కి అనుమతి ని ఇస్తుంది. ఈ చర్య గోధుమ పిండి ధరల పెరుగుదల ను ఆటంకపరచడం తో పాటు గా సమాజం లోని అత్యంత దుర్భల వర్గాల కు ఆహార భద్రత పరం గా కూడాను పూచీపడగలదు.
అమలు:
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డిజిఎప్ టి) ఈ మేరకు ఒక నోటిఫికేశన్ ను జారీ చేయవలసివుంటుంది.
పూర్వరంగం:
రష్యా మరియు యూక్రేన్ లు గోధుమల ప్రధాన ఎగుమతిదారు దేశాలు గా ఉన్నాయి. ప్రపంచం లో క్రయ విక్రయాలు జరిగేటటువంటి గోధుమలలో నాలుగింట ఒకటో వంతు వాటా రష్యా మరియు యూక్రేన్ లదే. కాగా రష్యా మరియు యూక్రేన్ ల మధ్య ఘర్షణ ప్రపంచ గోధుమల సప్లయ్ చైన్ లో అంతరాయాలకు దారి తీసి భారతదేశం గోధుమలకు డిమాండు అధికం అయిపోయింది. తత్ఫలితం గా, దేశీయ బజారు లో గోధుమల ధరలు హెచ్చాయి. దేశం లో 1.4 బిలియన్ ప్రజల ఆహార భద్రత కు పూచీపడడం కోసం, గోధుమల ఎగుమతి పై ఒక నిషేధాన్ని అమలు చేయాలన్న నిర్ణయాన్ని 2022వ సంవత్సరం మే నెల లో తీసుకోవడమైంది.
అయితే, గోధుమ ఎగుమతి మీద నిషేధం అమలు లోకి తీసుకు వచ్చినందువల్ల ( దేశీయ బజారు లో పెరుగుతున్న ధరల ను అడ్డుకోవడానికి మరియు దేశం లో ఆహార భద్రత కు పూచీపడడానికి ఈ చర్య ను చేపట్టడమైంది), విదేశీ బజారుల లో గోధుమ పిండి కి డిమాండు వృద్ధి చెందడమే కాక భారతదేశం నుంచి గోధుమ పిండి ఎగుమతుల లో 2022వ సంవత్సరం లో ఏప్రిల్ మొదలుకొని జులై మధ్య కాలం లో 2021 వ సంత్సరం లోని సమాన కాలం తో పోల్చితే 200 శాతం మేరకు పెరుగుదల నమోదు అయింది.
అంతర్జాతీయ బజారు లో గోధుమ పిండి తాలూకు డిమాండు అధికం కావడం అనేది దేశీయ బజారు లో గోధుమ పిండి ధర లో గణనీయమైన పెరుగుదల కు దారితీసింది.
ఇంతకు ముందు, గోధుమ పిండి యొక్క ఎగుమతి పైన నిషేధాన్ని గాని లేదా ఎటువంటి ఆంక్షల ను గాని విధించరాదని ఒక విధానం ఉండింది. అందుకని, ఆహార భద్రత కు పూచీ పడడం కోసం మరియు దేశం లో అంతకంతకు ఎగబాకుతున్న గోధుమ పిండి ధరల కు అడ్డుకట్ట వేయడం కోసం గోధుమ పిండి కి సంబంధించిన ఎగుమతి పై నిషేధం/ఆంక్షల నుంచి మినహాయింపు ను ఉపసంహరించడం ద్వారా తత్సంబంధిత విధానం లో ఓ పాక్షిక సవరణ అవసరపడింది.
(Release ID: 1854396)
Visitor Counter : 278
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam