ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కర్నాటక లోని తుమకూరు జిల్లా లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం కారణం గా ప్రాణనష్టం వాటిల్లినందుకు సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి


బాధితుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారాన్ని ఆయన ప్రకటించారు

నాడు పోస్టు చేయడమైనది: 25 AUG 2022 11:08AM by PIB Hyderabad

కర్నాటక లోని తుమకూరు జిల్లా లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం కారణం గా ప్రాణనష్టం వాటిల్లినందుకు  ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. బాధితుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుందని కూడా శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

‘‘కర్నాటక లోని తుమకూరు జిల్లా లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం  హృద‌య‌ విదారకం గా ఉంది. ప్రియతముల ను కోల్పోయిన కుటుంబాల కు ఇదే సంతాపం.  ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తులు త్వరగా పున:స్వస్థులు కావాలని ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను.  మృతుల దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి రెండు లక్షల రూపాయల వంతున చెల్లించడం జరుగుతుంది. గాయపడ్డ వారి కి 50,000 రూపాయల వంతున చెల్లించడం జరుగుతుంది: ప్రధాన మంత్రి’’ అని తెలిపింది.

 

 

 

***

DS/SH


(రిలీజ్ ఐడి: 1854283) సందర్శకుల సూచీ సంఖ్య : : 160