ప్రధాన మంత్రి కార్యాలయం

సాహిబ్ జాదా అజీత్ సింహ్ నగర్  (మొహాలీ) లో ‘హోమీ భాభా కేన్సర్ హాస్పిటల్ ఎండ్  రిసర్చ్ సెంటర్’ ను దేశ ప్రజల కు అంకితం చేసిన ప్రధానమంత్రి 


‘‘భారతదేశాన్ని అభివృద్ధి పరచాలి అంటే, భారతదేశం ఆరోగ్య సేవల ను అభివృద్ధిచేయడం కూడా అంతే ముఖ్యం అన్నమాట’’

‘‘గత ఎనిమిది సంవత్సరాల లో సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ ను దేశం యొక్క అగ్ర ప్రాథమ్యాలలో ఒకటి గా చేయడమైంది’’

‘‘గడచిన 8 ఏళ్ళ లో దేశం లో 200 కు పైగా కొత్త వైద్య కళాశాలల ను  నిర్మించడం జరిగింది’’

‘‘ఒక ప్రగతిశీల సమాజం గా, మానసిక ఆరోగ్యం విషయం లో మన ఆలోచనల లో మార్పు ను  మరియు  పక్షపాతంలేని తనాన్ని తీసుకు రావడం కూడా మన బాధ్యతే’’

‘‘మేడ్ ఇన్ ఇండియా 5జి సర్వీసు లు రిమోట్ హెల్థ్ కేర్సెక్టర్ లో విప్లవాత్మకమైన మార్పుల ను తీసుకు వస్తాయి’’

Posted On: 24 AUG 2022 5:04PM by PIB Hyderabad

హోమీ భాభా కేన్సర్ హాస్పిటల్ ఎండ్ రిసర్చ్ సెంటర్ను సాహిబ్ జాదా అజీత్ సింహ్ నగర్, మొహాలీ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న దేశ ప్రజల కు అంకితం చేశారు. ఈ కార్యక్రమాని కి హాజరైన వారిలో పంజాబ్ గవర్నర్ శ్రీ బన్వారీలాల్ పురోహిత్, పంజాబ్ ముఖ్యమంత్రి శ్రీ భగవంత్ మాన్, కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింహ్ లు ఉన్నారు.

ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈనాటి కార్యక్రమం దేశం లో ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు మెరుగుపడడాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. ఈ ఆసుపత్రి పంజాబ్, హరియాణా మరియు హిమాచల్ ప్రదేశ్ ప్రజల కు సేవల ను అందిస్తుందని ఆయన చెప్పారు. హర్ ఘర్ తిరంగా అభియాన్ లో పంజాబ్ ప్రజలు ఉత్సాహం గా పాలుపంచుకొన్నందుకు గాను వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

భారతదేశాన్ని అభివృద్ధి చెందినటువంటి ఒక దేశం గా తీర్చిదిద్దే విషయం లో ఎర్ర కోట బురుజుల నుంచి తాను చేసిన ప్రకటన ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ‘‘భారతదేశాన్ని అభివృద్ధి చేయాలి అంటే దేశం లో ఆరోగ్య సేవల ను అభివృద్ధి పరచడం కూడా అంతే ప్రధానమైన విషయం అవుతుంది’’ అని పేర్కొన్నారు. భారతదేశ ప్రజలు చికిత్స కోసం ఆధునిక సదుపాయాలు కలిగిన నూతన ఆసుపత్రుల కు నోచుకొంటే గనక అప్పుడు వారు త్వరగా స్వస్థులవుతారు, మరి వారి శక్తి సరి అయిన దిశ లో ప్రవహిస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు. కేన్సర్ చికిత్స కోసం తగిన సదుపాయాల ను ఏర్పరచాలి అన్నదే ప్రభుత్వం యొక్క నిబద్ధత అని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. టాటా మెమోరియల్ సెంటర్ లో ప్రతి సంవత్సరం ఒకటిన్నర లక్షల మంది రోగుల కు చికిత్స ను అందించే సదుపాయాలు ప్రస్తుతం సమకూరాయి అని ఆయన వెల్లడించారు. పిజిఐ చండీగఢ్ మీద పడుతున్న భారాన్ని కొత్త ఆసుపత్రి, ఇంకా బిలాస్ పుర్ లో ఎఐఐఎమ్ఎస్ లు తగ్గించడం తో పాటు రోగుల కు, రోగుల కుటుంబాల కు బోలెడంత ఉపశమనాన్ని అందిస్తాయి అని ఆయన అన్నారు.

ఒక మంచి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ అంటే దాని కి అర్థం నాలుగు గోడల ను నిర్మించడం ఒక్కటే కాదు అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ఏ దేశం లోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ అయినా అది ప్రతి ఒక్క విధానం లోను పరిష్కారాల ను అందించడం తో పాటు దశల వారీ సమర్థన ను కూడా అందించినప్పుడే బలపడుతుంది అని ఆయన స్పష్టం చేశారు. సమగ్రమైనటువంటి ఆరోగ్య సంరక్షణ సేవల కు గడచిన ఎనిమిది సంవత్సరాల లో దేశం లో అగ్ర ప్రాధాన్యాన్ని కట్టబెట్టడం జరిగింది అని కూడా ప్రధాన మంత్రి వివరించారు.

ప్రస్తుతం, ఆరు విధాలు గా కృషి చేయడం ద్వారా దేశం లో ఆరోగ్య రంగ సదుపాయాల ను మెరుగుపరచడం జరుగుతున్నది అని ప్రధాన మంత్రి వెల్లడించారు. ఆ ఆరు విధాల ను గురించి ఆయన వివరిస్తూ, వాటిలో ఒకటోది- నివారణ ప్రధానమైన ఆరోగ్య సంరక్షణ ను ప్రోత్సహించడం; రెండోది - పల్లె ప్రాంతాల లో చిన్నవి, ఆదునికమైనవి అయినటువంటి ఆసుపత్రుల ను ఏర్పాటు చేయడం; మూడోది - నగర ప్రాంతాల లో వైద్య కళాశాల లను, అలాగే పెద్ద వైద్య పరిశోధన సంస్థల ను తెరవడం; నాలుగోది - దేశవ్యాప్తం గా వైద్యుల సంఖ్య ను, అలాగే పారా మెడికల్ స్టాఫ్ సంఖ్య ను పెంచడం; ఇక అయిదోది - మందుల ను, వైద్య సామగ్రి ని చౌక లో రోగుల కు అందజేయడం కాగా ఆరోది - సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ద్వారా రోగుల ఇక్కట్టులను తగ్గించడం అని పేర్కొన్నారు.

నివారణ పద్ధతి ని గురించి ప్రధాన మంత్రి చెప్తూ, నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల బారిన పడుతున్న రోగుల సంఖ్య జల్ జీవన్ అభియాన్ వల్ల చెప్పుకోదగినంత స్థాయి లో తగ్గుముఖం పట్టింది అని పేర్కొన్నారు. అదే విధం గా, స్వచ్ఛత, యోగ, ఫిట్ నెస్ ధోరణులు, పోషణ్ అభియాన్, వంట గ్యాసు మొదలైనవి రోగుల సంఖ్య ను తగ్గిస్తున్నాయి అని ఆయన అన్నారు. మరో వైపు నుంచి, నాణ్యమైనటువంటి పరీక్ష కేంద్రాల ను, మరి అలాగే ఒకటిన్నర లక్షల కు పైగా హెల్థ్ ఎండ్ వెల్ నెస్ సెంటర్ లను ఏర్పాటు చేయడం జరుగుతోంది. వాటిలో ఇప్పటికే 1.25 లక్షల కేంద్రాల ను నెలకొల్పడమైంది. పంజాబ్ లో దాదాపు గా 3000 కేంద్రాలు కార్యకలాపాల ను నిర్వహిస్తున్నాయి. దేశం మొత్తం మీద చూసుకొంటే 22 కోట్ల కు పైచిలుకు ప్రజల ను వారు కేన్సర్ బారిన పడ్డారా అనేది నిర్ధారించడం కోసం పరీక్షల ను జరపగా, వారిలో 60 లక్షల మంది కి ఒక్క పంజాబ్ లోనే పరీక్షలు నిర్వహించడమైంది అని ప్రధాన మంత్రి అన్నారు.

ఒకసారి రోగం జాడ ను కనిపెట్టడం జరిగిందా అంటే ఆ తరువాత గంభీరమైనటువంటి రుగ్మతల ను తగు విధం గా చికిత్స అందించే అవసరం తో పాటు అధునాతనమైన ఆసుపత్రులు కూడా అవసరపడతాయి అని ప్రధాన మంత్రి అన్నారు. దేశం లో ప్రతి జిల్లా లో కనీసం ఒక వైద్య కళాశాల ను ఏర్పాటు చేయాలి అనే లక్ష్యాన్ని సాధించడం కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటించారు. ఆరోగ్య రంగం లో మౌలిక సదుపాయాల ను కల్పించే ఉద్యమం లో భాగం గా ఆయుష్మాన్ భారత్ పథకం లో 64,000 కోట్ల రూపాయల ఖర్చు తో జిల్లా స్థాయి ఆధునిక ఆరోగ్య సదుపాయాల ను నిర్మించే పని లో నిమగ్నం అయింది అని ఆయన తెలిపారు. దేశం లో కేవలం 7 ఎఐఐఎమ్ఎస్ లు ఉన్న కాలం అంటూ ఒకటి ఉండగా, ప్రస్తుతం ఎఐఐఎమ్ఎస్ ల సంఖ్య 21 కి పెరిగింది అని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. దేశం లో వివిధ ప్రాంతాల లో సుమారు 40 కేన్సర్ ఇన్స్ టిట్యూట్ ల స్థాపన కు ప్రభుత్వం ఆమోదాన్ని తెలపగా, వాటిలో చాలా వరకు ఆసుపత్రులు ఈ సరికే సేవల ను అందించడం మొదలు పెట్టాయి అని ఆయన అన్నారు.

ఒక ఆసుపత్రి ని నిర్మించడం ముఖ్యం అయినట్లుగానే మంచి వైద్యుల ను, ఇతర పారామెడిక్స్ ను తగినంత మంది ని కలిగి ఉండడం అనేది కూడా అంతే ప్రధానమైన విషయం అవుతుంది అని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. ఈ కార్యాన్ని ప్రస్తుతం దేశం లో ఉద్యమం తరహా లో అమలు పరచడం జరుగుతున్నదని ఆయన పునరుద్ఘాటించారు. ‘‘2014వ సంవత్సరం కంటే పూర్వ కాలం లో దేశం లో ఉన్న వైద్య కళాశాలలు 400 కు మించలేదు. అంటే 70 సంవత్సరాల లో 400 కంటే తక్కువ సంఖ్య లోనే వైద్య కళాశాలలు ఉన్నాయి అన్నమాట. కాగా, గత 8 సంవత్సరాల కాలం లో 200 కు పైచిలుకు సంఖ్య లో కొత్త వైద్య కళాశాలల ను నిర్మించడం జరిగింది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రభుత్వం 5 లక్షల కు పైగా ఆయుష్ వైద్యుల ను అలోపతి ని అనుసరించే వైద్యులు గా గుర్తించింది. మరి, ఈ పరిణామం భారతదేశం లో వైద్యుడు-రోగి నిష్పత్తి మెరుగుపడటం లో తోడ్పడింది అని ప్రధాన మంత్రి వివరించారు. పేదల కు 5 లక్షల రూపాయల వరకు విలువైన ఉచిత చికిత్స ను ఆయుష్మాన్ భారత్ అందించింది. మరి దీనికి ఫలితమా అన్నట్లుగా 3.5 కోట్ల మంది రోగులు ఇంతవరకు చికిత్స పూర్తి చేసుకొన్నారు అని ఆయన అన్నారు. ఈ 3.5 కోట్ల మంది రోగుల లో చాలా మంది కేన్సర్ రోగులే అని కూడా ప్రధాన మంత్రి తెలియజేశారు. ఆయుష్మాన్ భారత్ పథకం రోగుల యొక్క డబ్బు లో ఇంచుమించు 40 వేల కోట్ల రూపాయల ను ఆదా చేసింది అని ఆయన తెలిపారు. కేన్సర్ చికిత్స కు వాడేటటువంటి 500 కు పైచిలుకు మందుల ధరల లో 90 శాతం వరకు తగ్గుదల చోటు చేసుకోవడం తో ఒక వేయి కోట్ల రూపాయల వరకు ఆదా అయినట్లు ఆయన వెల్లడించారు.

మొట్టమొదటి సారిగా ఆరోగ్య రంగం లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంత పెద్ద స్థాయి లో వినియోగించడం జరుగుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఆయన తన ప్రసంగాన్ని ముగించే కంటే ముందు, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్థ్ మిశన్ అనేది ప్రతి ఒక్క రోగి సకాలం లో అతి తక్కువ స్థాయి ఇబ్బందుల ను ఎదుర్కొంటూ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సదుపాయాల కు నోచుకొనేటట్లుగా పూచీ పడుతోందన్నారు. భారతదేశం లో రూపుదిద్దుకొనే 5జి సేవ లు త్వరలో ఆరంభం అయిన అనంతరం రిమోట్ హెల్థ్ కేర్ సెక్టర్ విప్లవాత్మకమైన మార్పుల కు ఆలవాలం అవుతుంది అని ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రస్తావించారు. ‘‘ఇది పేద కుటుంబాలు వారి ఊరి నుంచి బయలుదేరి పదే పదే పెద్ద ఆసుపత్రుల ను సందర్శించక తప్పని స్థితి ని తగ్గించి వేస్తుంది’’ అని ఆయన అన్నారు. కేన్సర్ వల్ల ఎదురయ్యే కుంగుబాటు తో రోగులు, వారి కుటుంబాలు ఎదురొడ్డి నిలచి పోరాటం చేసేటట్లు గా వారికి సాయపడవలసిన అవసరం ఎంతైనా ఉంది అని కూడా ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ఒక ప్రగతిశీలమైనటువంటి సమాజం గా, మానసిక ఆరోగ్యం విషయం లో మనకు ఉన్న ఆలోచనల లో మార్పు ను మరియు పక్షపాతం లేని తనాన్ని కొనితేవలసిన బాధ్యత సైతం మన మీద ఉంది. అది జరిగితేనే ఈ సమస్య కు ఒక సరి అయినటువంటి పరిష్కార మార్గాన్ని కనుగొనడం సాధ్యమవుతుంది’’ అని ఆయన అన్నారు.

పూర్వరంగం

పంజాబ్ మరియు పంజాబ్ చుట్టుపక్కల రాష్ట్రాల కు, ఇంకా కేంద్ర పాలిత ప్రాంతాల నివాసుల కు ప్రపంచ శ్రేణి కేన్సర్ సంరక్షణ ను అందించే ప్రయత్నం లో భాగం గా హోమీ భాభా కేన్సర్ హాస్పిటల్ ఎండ్ రిసర్చ్ సెంటర్ను సాహిబ్ జాదా అజీత్ సింహ్ నగర్ జిల్లా, మొహాలీ లోని న్యూ చండీగఢ్ పరిధి లో గల ముల్లాన్ పుర్ లో దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేశారు. ఈ ఆసుపత్రి ని 660 కోట్ల రూపాయల కు పైగా వ్యయం తో భారత ప్రభుత్వ అణుశక్తి విభాగాని కి చెందిన ఒక ఎయిడెడ్ ఇన్స్ టిట్యూట్ అయినటుంటి టాటా మెమోరియల్ సెంటర్ నిర్మించింది.

ఈ కేన్సర్ ఆసుపత్రి 300 పడకల ను కలిగిన, ఇన్ పేశెంట్ లకు మూడో స్థాయి కి చెందిన అభివృద్ధిపరచిన ఆరోగ్య సంరక్షణ సేవల ను, చికిత్సల ను అందించేటటువంటి ఆసుపత్రి గా ఉంది; మరి దీనిలో అన్ని రకాలైన కేన్సర్ కు సంబంధించిన చికిత్స ల కోసం ఆధునిక సదుపాయాలను జతపరచడమైంది. ఇక్కడ శస్త్ర వైద్యం/చికిత్స, ఎక్స్ రే చికిత్స, మెడికల్ ఆంకాలజి- కీమో థెరపి, ఇమ్యూనో థెరపి మరియు ఎముక మజ్జ మార్పిడి వంటి సౌకర్యాలు అందుబాటు లో ఉంటాయి.

ఈ ఆసుపత్రి యావత్తు ప్రాంతం లో కేన్సర్ సంరక్షణ మరియు చికిత్సల కు కేంద్రంగా పని చేయనుంది. కాగా సంగ్ రూర్ లోని 100 పడక ల ఆసుపత్రి ఈ కేంద్రాని కి శాఖగా విధుల ను నిర్వర్తించనుంది.

Speaking at inauguration of Homi Bhabha Cancer Hospital & Research Centre in Mohali, Punjab. https://t.co/llZovhQM5S

— Narendra Modi (@narendramodi) August 24, 2022

भारत को विकसित बनाने के लिए उसकी स्वास्थ्य सेवाओं का भी विकसित होना उतना ही जरूरी है।

जब भारत के लोगों को इलाज के लिए आधुनिक अस्पताल मिलेंगे, आधुनिक सुविधाएं मिलेंगीं, तो वो और जल्दी स्वस्थ होंगे, उनकी ऊर्जा सही दिशा में लगेगी: PM @narendramodi

— PMO India (@PMOIndia) August 24, 2022

अच्छे हेल्थकेयर सिस्टम का मतलब सिर्फ चार दीवारें बनाना नहीं होता।

किसी भी देश का हेल्थकेयर सिस्टम तभी मजबूत होता है, जब वो हर तरह से समाधान दे, कदम-कदम पर उसका साथ दे।

इसलिए बीते आठ वर्षों में देश में होलिस्टिक हेल्थकेयर को सर्वोच्च प्राथमिकताओं में रखा गया है: PM @narendramodi

— PMO India (@PMOIndia) August 24, 2022

आज एक नहीं, दो नहीं, छह मोर्चों पर एक साथ काम करके देश की स्वास्थ्य सुविधाओं को सुधारा जा रहा है।

पहला मोर्चा है, प्रिवेंटिव हेल्थकेयर को बढ़ावा देने का।

दूसरा मोर्चा है, गांव-गांव में छोटे और आधुनिक अस्पताल खोलने का: PM

— PMO India (@PMOIndia) August 24, 2022

तीसरा मोर्चा है- शहरों में मेडिकल कॉलेज और मेडिकल रीसर्च वाले बड़े संस्थान खोलने का

चौथा मोर्चा है- देशभर में डॉक्टरों और पैरामेडिकल स्टाफ की संख्या बढ़ाने का: PM @narendramodi

— PMO India (@PMOIndia) August 24, 2022

पांचवा मोर्चा है- मरीजों को सस्ती दवाइयां, सस्ते उपकरण उपलब्ध कराने का।

और छठा मोर्चा है- टेक्नोलॉजी का इस्तेमाल करके मरीजों को होने वाली मुश्किलें कम करने का: PM @narendramodi

— PMO India (@PMOIndia) August 24, 2022

अस्पताल बनाना जितना ज़रूरी है, उतना ही ज़रूरी पर्याप्त संख्या में अच्छे डॉक्टरों का होना, दूसरे पैरामेडिक्स का उपलब्ध होना भी है।

इसके लिए भी आज देश में मिशन मोड पर काम किया जा रहा है: PM

— PMO India (@PMOIndia) August 24, 2022

2014 से पहले देश में 400 से भी कम मेडिकल कॉलेज थे।

यानि 70 साल में 400 से भी कम मेडिकल कॉलेज।

वहीं बीते 8 साल में 200 से ज्यादा नए मेडिकल कॉलेज देश में बनाए गए हैं: PM

— PMO India (@PMOIndia) August 24, 2022

हेल्थ सेक्टर में आधुनिक टेक्नॉलॉजी का भी पहली बार इतनी बड़ी स्केल पर समावेश किया जा रहा है।

आयुष्मान भारत डिजिटल हेल्थ मिशन ये सुनिश्चित कर रहा है कि हर मरीज़ को क्वालिटी स्वास्थ्य सुविधाएं मिले, समय पर मिलें, उसे कम से कम परेशानी हो: PM @narendramodi

— PMO India (@PMOIndia) August 24, 2022

कैंसर के कारण जो depression की स्थितियां बनती हैं, उनसे लड़ने में भी हमें मरीज़ों की, परिवारों की मदद करनी है।

एक प्रोग्रेसिव समाज के तौर पर ये हमारी भी जिम्मेदारी है कि हम मेंटल हेल्थ को लेकर अपनी सोच में बदलाव और खुलापन लाएं। तभी इस समस्या का सही समाधान निकलेगा: PM

— PMO India (@PMOIndia) August 24, 2022

*****

 

DS/TS

 



(Release ID: 1854269) Visitor Counter : 161