మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఆస్ట్రేలియా తన సహభాగి అయిన గౌరవనీయ జేసన్ క్లేర్‌తో కలిసి 6వ ఆస్ట్రేలియా ఇండియా ఎడ్యుకేషన్ కౌన్సిల్‌కు సహాధ్యక్షత వహించి, ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
విద్య, స్కిల్లింగ్‌లలో సహకారాన్ని మరింతపెంచుకునేందుకు అంగీకరించిన ఇరు వర్గాలు
భారత్‌లో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేసుకునేందుకు అవకాశాలను అన్వేషించవలసిందిగా ఆస్ట్రేలియా విద్యా సంస్థలను ఆహ్వానించిన శ్రీ ప్రధాన్
భారతీయ విద్యార్ధుల పెండింగ్ వీసాల సమస్యను లేవనెత్తిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
Posted On:
22 AUG 2022 1:01PM by PIB Hyderabad
ఆస్ట్రేలియా సమస్థాయి మంత్రి గౌరవనీయ జేసన్ క్లేర్‌తో కలిసి ఆస్ట్రేలియా ఇండియా ఎడ్యుకేషన్ కౌన్సిల్ (ఎఐఇసి) 6 సమావేశానికి సహ అధ్యక్షత వహించడమే కాక ద్వైపాక్షిక సమావేశాన్ని కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ నేడు
నిర్వహించారు.
ద్వైపాక్షిక సమావేశం సందర్భంగా మంత్రులు విద్య, నైపుణ్యాల అభివృద్ధి, పరిశోధన, ఆవిష్కరణ, వ్యవస్థాపకతలలో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఫలవంతమైన చర్చలు జరిపారు. అలాగే, ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలను, స్కిల్లింగ్ సంస్థలను భారత్‌లో క్యాంపస్‌లను ఏర్పాటు చేసి, భారతీయ సంస్థలతో సహకారానికి గల అవకాశాలను అన్వేషించవలసిందిగా శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఆహ్వానించారు. గౌరవనీయ జేసన్ క్లేర్‌ను ఈ ఏడాది చివరిలోగా భారత్ పర్యటనకు రావలసిందిగా ఆహ్వానించారు.భారత్- ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి విద్యను కీలక స్తంభంగా చేసే ఉద్దేశ్యంతో అభ్యాసం, నైపుణ్యాలు, పరిశోధనలలో సహకారాన్ని విస్తరించేందుకు మంత్రులిద్దరూ అంగీకారానికి వచ్చారు.
ఆస్ట్రేలియా- ఇండియా ఎడ్యుకేషన్ కౌన్సిల్ 6వ సమావేశంలో మాట్లాడుతూ, విద్య, నైపుణ్యాల అభివృద్ధి, పరిశోధనా ప్రాధాన్యతల చర్యలను బలోపేతం చేసేందుకు, సంబంధాలను ముందుకు తీసుకువెళ్ళేందుకు ఎఐఇసి అత్యంత ప్రభావవంతమైన ఫోరం అని శ్రీ ప్రధాన్ అన్నారు. వచ్చే ఏడాది ఎఐఇసి 7వ సమావేశాన్ని భారత్‌లో నిర్వహించవలసిందిగా ఆయన ఆస్ట్రేలియా బృందాన్ని ఆహ్వానించారు.
ఆయుర్వేద, యోగ, వ్యవసాయం తదితర రంగాలలో ఇరు దేశాల మధ్య పరిశోధనకు సహకారం అవసరాన్ని శ్రీ ప్రధాన్ నొక్కి చెప్పారు. మైనింగ్, లాజిస్టిక్స్ నిర్వహణ తదితరాలలో నైపుణ్యాల ప్రమాణీకరణకు సహకారానికి ఆయన పిలుపు ఇచ్చారు. భారత్ డిజిటల్ యూనివర్సిటీని, గతి శక్తి యూనివర్సిటీని ఏర్పాటు చేసిందని, దీనికి సంబంధించిన పాఠ్యాంశాలను, ఇతర అంశాలను ఇరు దేశాలు కలిసి పని చేసి నిర్ణయించవచ్చని ఆయన అన్నారు.
దీనితోపాటుగా, ఆస్ట్రేలియాకు వెళ్ళే భారతీయ విద్యార్దుల పెండింగ్ వీసాల సమస్యను కూడా శ్రీ ప్రధాన్ లేవనెత్తారు. కాగా, పెండింగ్ వీసాల వ్యవహారాన్ని వేగవంతం చేయడంలో సహకరిస్తామని ఆస్ట్రేలియా మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం, ఇరువురు మంత్రులు సంయుక్త విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఇరు దేశాలలో నియంత్రణా వాతావరణంపై భాగస్వామ్య అవగాహనను పెంపొందించుకునేందుకు, సంస్థల ద్విమార్గ చలనశీలతను ప్రోత్సహించేందుకు దేశాంతర విద్యపై వర్కింగ్ గ్రూపు ఏర్పాటును ప్రకటించారు. జ్ఞాన వారధులను నిర్మించేందుకు, పరస్పర వృద్ధి, సుసంపన్నత కోసం విద్య, నైపుణ్యాలు, పరిశోధనలలో ఆస్ట్రేలియాతో ద్వైపాక్షిక చర్చలను, చర్యలను గాఢం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని శ్రీ ప్రధాన్ పునరుద్ఘాటించారు.
ఎమ్మెల్సీ, ఎన్ఎస్‌డబ్ల్యు విద్యా మంత్రి గౌరవనీయ సారా మిచెల్ తో కలిసి శ్రీ ప్రధాన్ ఒక పాఠశాలను సందర్శించనున్నారు. ఆయన సిడ్నీలో గల టిఎఎఫ్ఇ ఎన్ఎస్ఎఫ్, యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ (యుఎన్ఎస్‌డబ్ల్యు)ను సందర్శించి, ఆస్ట్రేలియా ప్రభుత్వ విద్యా విభాగపు సీనియర్ ప్రతినిధులు, వైస్ ఛాన్సలర్లతో ముచ్చటిస్తారు.
***
(Release ID: 1853589)
Visitor Counter : 201