ప్రధాన మంత్రి కార్యాలయం
హర్ ఘర్ తిరంగా అభియాన్ పట్ల ప్రజల లో వ్యక్తం అవుతున్న ఉత్సాహాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
Posted On:
11 AUG 2022 7:31PM by PIB Hyderabad
హర్ ఘర్ తిరంగా అభియాన్ (ఇంటింటా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే ఉద్యమం) లో ప్రజలు ఉత్సాహం గా పాలుపంచుకొంటున్నారని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న పేర్కొన్నారు. ఈ భావన దేశం లో ఏకత్వం మరియు అఖండత్వం లకు ప్రతీక గా ఉందని ఆయన అన్నారు.
రక్షా బంధన్ సందర్భం లో చిన్నారుల తో తాను జరిపిన సంభాషణ తోపాటు గా వారి కి మువ్వన్నెల జెండాల ను ఇచ్చినప్పటి ఒక వీడియో ను కూడా ఆయన శేర్ చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘హర్ ఘర్ తిరంగా అభియాన్ పట్ల దేశ ప్రజలలో ఏ ప్రకారం గా అయితే ఉత్సాహం, ఉల్లాసం వ్యక్తం అవుతోందో, అది దేశం యొక్క ఏకత్వం మరియు అఖండత్వం ల తాలూకు అచంచలమైనటువంటి భావన కు సంతేకం గా ఉన్నది. ఈ భావన అమృత కాలం లో భారతవర్షాన్ని ఒక సరికొత్త ఎత్తు కు తీసుకుపోయేది గా ఉంది. #HarGharTiranga’’
భారతదేశం లో ప్రతి ఒక్కరి కి ఒక త్రివర్ణ పతాకం తో విశిష్టమైనటువంటి బంధం ఉన్నది. ఈ రోజు నేను నా యువ మిత్రుల కు తిరంగా ను ఇచ్చాను. వారి వదనాల లో చిరునవ్వే అంతా తెలియజెప్పేస్తున్నది.’’ అని పేర్కొన్నారు.
****
DS
(Release ID: 1851168)
Visitor Counter : 160
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam