మంత్రిమండలి
azadi ka amrit mahotsav

యూనివర్సల్ పోస్టల్ యూనియన్ రాజ్యాంగానికి ప్రతిపాదించిన 11వ అదనపు సవరణలకు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం

Posted On: 10 AUG 2022 6:05PM by PIB Hyderabad
యూనివర్సల్ పోస్టల్ యూనియన్ రాజ్యాంగానికి ప్రతిపాదించిన 11వ అదనపు సవరణలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. 2021 ఆగస్టు 9-27 వరకు అబిడ్జాన్ (కోట్ డి ఐవోయిర్)లో జరిగిన యూనివర్సల్ పోస్టల్ యూనియన్ 27వ మహాసభ ఆమోదించి సంతకాలు చేసిన విధంగా సవరణలు జరిగాయి. 
కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన తీర్మానం మేరకు రాష్ట్రపతి సంతకం చేసిన ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ ర్యాటిఫికేషన్ను కేంద్ర తపాలా శాఖ కలిగి ఉంటుంది. దీనిని యూనివర్సల్ పోస్టల్ యూనియన్ కు చెందిన ఇంటర్నేషనల్ బ్యూరో లో పోస్టల్ శాఖ డిపాజిట్ చేస్తుంది. 
రాజ్యాంగానికి ప్రతిపాదించిన సవరణలను సభ్య దేశాలు సాధ్యమైనంత త్వరగా ఆమోదించాలని  యూనివర్సల్ పోస్టల్ యూనియన్ రాజ్యాంగంలోని 25 మరియు 30 అధికారణాలో పొందుపరిచిన నిబంధనలను భారతదేశం గౌరవించినట్లు అవుతుంది. 

 కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం వల్ల యూనివర్సల్ పోస్టల్ యూనియన్ 27వ మహాసభలు ఆమోదించిన రాజ్యాంగ సవరణలు  యూనియన్ చట్టాలకు మరింత చట్టపరమైన స్పష్టత మరియు స్థిరత్వాన్ని నిర్ధారిస్తాయి. సాంకేతిక పదాలకు సంబంధించి స్పష్టత కల్పించడంతో పాటు ఎంతోకాలం నుంచి భాషాపరమైన వైరుధ్యాలను తొలగించి 1969లో జరిగిన  లా ఆఫ్ ట్రీటీస్ లో కుదిరిన ఒప్పందం ప్రకారం  'అంగీకారం లేదా ఆమోదంకోసం నిబంధనలు అమలులోకి వస్తాయి. 

 
***
 

(Release ID: 1850673) Visitor Counter : 254