ప్రధాన మంత్రి కార్యాలయం

పశ్చిమ బంగాల్ లో జరిగిన ఒక దు:ఖ భరిత ఘటన లో ప్రాణనష్టం వాటిల్లడం పట్లబాధ ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


బాధితుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుందనిఆయన ప్రకటించారు

Posted On: 09 AUG 2022 10:24PM by PIB Hyderabad

పశ్చిమ బంగాల్ లోని బీర్ భూమ్ జిల్లా లో జరిగిన ఒక దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. బాధితుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుందని కూడా శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎమ్ఒ) ఒక ట్వీట్ లో -

‘‘ పశ్చిమ బంగాల్ లోని బీర్ భూమ్ జిల్లా లో జరిగిన ఒక దు:ఖభరిత ఘటన కారణం గా ప్రాణనష్టం వాటిల్లినందుకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను.

ఈ దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన ప్రతి ఒక్క వ్యక్తి తరఫు దగ్గరి బంధువుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి 2 లక్షల రూపాయల వంతు న మరియు గాయపడ్డ వారికి 50,000 రూపాయల వంతు న పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది: ప్రధాన మంత్రి’’ అని పేర్కొంది.

 

 



(Release ID: 1850509) Visitor Counter : 123