ప్రధాన మంత్రి కార్యాలయం
కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో మహిళ ల క్రికెట్ జట్టు వెండి పతకాన్ని గెలుచుకొన్నందుకు జట్టు సభ్యురాళ్ళ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
08 AUG 2022 8:20AM by PIB Hyderabad
బర్మింగ్ హమ్ లో నిర్వహిస్తున్న కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో మహిళ ల క్రికెట్ జట్టు వెండి పతకాన్ని గెలుచుకొన్నందుకు జట్టు లోని సభ్యురాళ్ళ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘క్రికెట్ మరియు భారతదేశం అనేవి విడదీయలేని అటువంటివి గా ఉన్నాయి. మన మహిళ ల క్రికెట్ జట్టు కామన్ వెల్థ్ గేమ్స్ లో మొదటి నుంచి కూడా ఉత్కృష్టమైన క్రికెట్ ను ఆడడం తో పాటుగా ప్రతిష్టాత్మకమైనటువంటి రజత పతకాన్ని స్వదేశాని కి తీసుకు వస్తున్నారు; క్రికెట్ క్రీడ లో ఇది మొట్టమొదటి కామన్ వెల్థ్ గేమ్స్ పతకం కావడం తో, ఇది ఎప్పటికీ ప్రత్యేకమైంది గా ఉండబోతోంది. జట్టు సభ్యురాళ్ళు అందరి కి ఒక ఉజ్వలమైన భవిష్యత్తు లభించాలి అని కోరుకొంటూ, వారికి ఇవే శుభాకాంక్షలు.’’ అని పేర్కొన్నారు.
****
DS/ST
(రిలీజ్ ఐడి: 1849887)
సందర్శకుల సూచీ సంఖ్య : : 161
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam