ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో పారా పవర్ లిఫ్టింగ్ మెన్స్ హెవీవెయిట్ పోటీ లో బంగారు పతకాన్నిగెలుచుకొన్నందుకు శ్రీ సుధీర్ కు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి 

प्रविष्टि तिथि: 05 AUG 2022 9:41AM by PIB Hyderabad

కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో పారా పవర్ లిఫ్టింగ్ మెన్స్ హెవీవెయిట్ ఈవెంట్ లో స్వర్ణ పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ సుధీర్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘సిడబ్ల్యుజి 2022 పారా-స్పోర్ట్ స్ పతకాల లెక్క లో సుధీర్ ద్వారా ఒక గొప్ప ఆరంభం నమోదు అయింది. ఆయన ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పసిడి ని గెలిచి, తన సమర్పణ భావాన్ని మరియు దృఢ సంకల్పాన్ని మరో సారి చాటారు. బరి లో ఆయన నిలకడ గా రాణిస్తూ వస్తున్నారు. ఆయన కు ఇవే అభినందన లు మరియు భావి ప్రయాసలన్నిటికి గాను ఆయన కు శుభాకాంక్షలు కూడాను.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH

 

 


(रिलीज़ आईडी: 1848849) आगंतुक पटल : 185
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam