ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కంచు పతకాన్ని గెలుచుకొన్నందుకు గాను శ్రీ లవ్ ప్రీత్ సింహ్ కు అభినందనలుతెలిపిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 03 AUG 2022 5:44PM by PIB Hyderabad

పురుషుల 109 కిలో గ్రాముల వెయిట్ లిఫ్టింగ్ లో కాంస్య పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ లవ్ ప్రీత్ సింహ్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘పురుషుల 109 కిలో గ్రాముల వెయిట్ లిఫ్టింగ్ లో కాంస్య పతకాన్ని గెలుచుకొన్నందుకు ప్రతిభావంతుడు శ్రీ లవ్ ప్రీత్ సింహ్ కు ఇవే అభినందనలు. యువకుడు మరియు హుషారయిన శ్రీ లవ్ ప్రీత్ తన శాంత స్వభావం తోను, క్రీడలంటే ఉన్న సమర్పణ భావం తోను అందరిని ప్రభావితులను చేశారు. భావి ప్రయత్నాల లో ఆయన సఫలం కావాలని ఆకాంక్షిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

*****

DS/TS

 


(రిలీజ్ ఐడి: 1848000) సందర్శకుల సూచీ సంఖ్య : : 153
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam