యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
కామన్‌వెల్త్ క్రీడలు 2022లో వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు మూడవ స్వర్ణ పతకాన్ని సాధించిన అచింత షూలీ
Posted On:
01 AUG 2022 11:51AM by PIB Hyderabad
కీలకాంశాలుః
అసాధారణ ప్రతిభను కనపబరిచిన అచింత షూలీని అభినందించిన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ
పతకాన్ని గెలవడమే కాక క్రీడలలో రికార్డు సాధించి, భారత్‌కు కీర్తిని తెచ్చిపెట్టినందుకు అచింతకు శుభాకాంక్షలుః శ్రీ అనురాగ్ ఠాకూర్
కామన్‌వెల్త్ క్రీడలు 2022లో పురుషుల 73 కేజీల ఫైనల్‌లో ఆదివారం రాత్రి వెయిట్ లిఫ్టర్ అంచిత షూలీ స్వర్ణ పతకాన్ని సాధించారు. క్రీడలలో అచింత మొత్తంగా 313 కేజీల (స్నాచ్ 143 కేజీలు + క్లీన్ అండ్ జెర్క్ 170 కేజీలు) బరువును లేపారు. దీనితో ఈ పోటీలో భారత్ సాధించిన మూడు స్వర్ణ పతకాలు సహా ఆరవ పతకమిది. రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ, కేంద్ర క్రీడా మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ తో పాటుగా దేశం నలుమూలల నుంచి భారతీయులు అచింత ప్రతిభను, ప్రదర్శనను అభినందించారు.
స్వర్ణ పతకాన్ని సాధించిన అచింతను రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. స్వర్ణ పతకాన్ని సాధించి, కామన్వెల్త్ క్రీడలలో త్రివర్ణ పతాకం రపరెపలాడేలా చేసిన అచింత షూలీ భారత్‌కు గర్వకారణం. తక్షణమే, ఒక్క ప్రయత్నంలోనే వైఫల్యాన్ని అధిగమించి, జట్టు వరుసలో అగ్రాన నిలిచావు. చరిత్రను సృష్టించిన ఛాంపియన్‌వి నువ్వు. నా హృదయపూర్వక శుభాకాంక్షలు! అని ఆమె ట్వీట్‌లో కొనియాడారు.
స్వర్ణ పతకాన్ని గెలిచిన అచింత షూలీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందించారు. కామన్‌వెల్త్ క్రీడలలో ప్రతిభావంతుడైన అచింత షూలీ స్వర్ణ పతకాన్ని సాధించినందుకు ఆనందంగా ఉంది. అతడు శాంత స్వభావానికి, పట్టుదలకీ పెట్టింది పేరు. ఈ ప్రత్యేక విజయం కోసం అతడు చాలా కృషిచేశాడు. అతడి భవిష్యత్ ప్రయత్నాలకు నా శుభాకాంక్షలు అని ప్రధాని ట్వీట్ చేశారు.
ప్రధాని వీడియో క్లిప్‌ను కూడా పంచుకున్నారు. మన బృందం కామన్‌వెల్త్ క్రీడలకు వెళ్ళేముందు నేను అచింత షూలీతో సంభాషించాను. అతడు తన తల్లి నుంచి, సోదరుడి నుంచి వచ్చిన సహాయం గురించి వివరించారు. ఇప్పుడు పతకాన్ని గెలుచుకున్నాడు కనుక ఒక సినిమా చూసే సమయం దొరుకుతుందని కూడా ఆశిస్తున్నాను, అని ప్రధాని ట్వీట్ లో అన్నారు.
క్రీడా మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ కూడా స్వర్ణ పతకాన్ని సాధించినందుకు అచింత షూలికి అభినందనలు తెలిపారు. ఎన్ ఎస్ ఎన్ ఐఎస్ పాటియాలాలోని శిక్షణా శిబిరంలో మిస్టర్. కామ్ గా ప్రాచుర్యం పొందిన అచింత షూలీ, కామన్ వెల్త్ క్రీడలు 2022లో భారత్‌కు మూడవ స్వర్ణ పతకాన్ని సాధించి పెట్టారు. అభినందనలు అచింతా, పతకాన్ని గెలవడమే కాక క్రీడలలో రికార్డు సాధించి, భారత్‌కు కీర్తిని తెచ్చిపెట్టినందుకు. మొత్తం 313 కేజీల బరువునెత్తడం ప్రశంసనీయం!! # చీర్4ఇండియా, అంటూ శ్రీఠాకూర్ ట్వీట్ చేశారు.
అచింత షూలీ విజయాల కోసం ఇక్కడ క్లిక్ చేయండిః
***
(Release ID: 1847175)
Visitor Counter : 183