సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ సత్యేంద్ర ప్రకాష్
Posted On:
01 AUG 2022 4:14PM by PIB Hyderabad
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్‌గా శ్రీ సత్యేంద్ర ప్రకాష్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారిగా ఉన్న శ్రీ ప్రకాష్ 1988 బ్యాచ్‌కి చెందినవారు. ఇంతకు ముందు ఆయన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ప్రిన్సిపల్ డిజి హోదాలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ప్రజా సంబంధ, సమాచారం, మీడియా నిర్వహణ, పాలన, విధాన రూపకల్పన, కార్యక్రమాల అమలు క్షేత్రంలో శ్రీ సత్యేంద్ర ప్రకాష్‌కు విస్త్రత అనుభవం ఉంది. ఆయన యునెస్కో, యునిసెఫ్, యుఎన్‌డిపి తదితర అంతర్జాతీయ, వివిధ జాతీయ వేదికలలో భారత ప్రభుత్వానికి ఆయన ప్రాతినిధ్యం వహించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ కోసం ప్రభుత్వ ప్రకటనల విషయ క్రమబద్ధీకరణ, ఇంటర్నెట్, డిజిటల్ మీడియా విధానం, ఎఫ్ ఎమ్ రేడియో విధానం, డిజిటల్ సినిమా విధానం తదితరాలకు ముసాయిదా మార్గదర్శకాలను రూపకల్పన చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. గణతంత్ర దినోత్సవం 2021, రోజున వోకల్ ఫర్ లోకల్ అన్న ఇతివృత్తంపై సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తొలి టాబ్లూని ప్రదర్శించడంలో ఆయన పాత్రను గుర్తించారు.
భారత ప్రభుత్వ అనేక ప్రధాన ప్రజా ప్రచార కార్యక్రమాలతో సంబంధాన్ని కలిగి ఉండటమే కాక ప్రజలకు చేరువయ్యే కార్యకలాపాలను రూపొందించి, అమలు చేయడంలో పాత్రను పోషించారు. ముఖ్యమైన ఐఇసి ప్రచార కార్యక్రమాలను రూపకల్పన చేసిన ఘనతను పొందారు. ఓటరు చైతన్యం, అవగాహన ద్వారా 2021-22లో ప్రజల ఎన్నికల భాగస్వామ్యాన్ని పెంపొందించినందుకు ఆయనకు ఇటీవలే భారత ఎన్నికల కమిషన్ ఆయన గుర్తించి, జాతీయ అవార్డును అందచేసింది.
బాధ్యతలు స్వీకరించిన శ్రీ సత్యేంద్ర ప్రకాష్‌ను పిఐబి సీనియర్ అధికారులు స్వాగతించారు.
***
(Release ID: 1847172)
Visitor Counter : 213