ప్రధాన మంత్రి కార్యాలయం

చెన్నై లోని అన్నా యూనివర్సిటీ లో 42వ స్నాతకోత్సవాన్ని ఉద్దేశించిప్రసంగించిన ప్రధాన మంత్రి


‘‘ఇది కార్యసాధన ల దినం ఒక్కటే కాదు, ఇది ఆకాంక్ష ల రోజు కూడాను’’

‘‘యావత్తు ప్రపంచం భారతదేశం యొక్క యువత కేసి ఆశ గా చూస్తున్నది.  ఎందుకంటే, మీరు దేశాని కి వృద్ధి తాలూకు చోదకశక్తులు గా ఉన్నారు; మరి భారతదశం ప్రపంచాని కి వృద్ధి చోదక శక్తి గా ఉంది’’

‘‘ప్రతికూల స్థితులు అనేవి మన లోపలి సత్తా ను బయటపెడతాయి.  భారతదేశం అజ్ఞాతశక్తి ని ఎంతో విశ్వాసం తో ఎదుర్కొన్నది’’

‘‘అంతర్జాతీయ వ్యాపారం పరంగా చూస్తే భారతదేశం యొక్క స్థానం అనేది దానిఅత్యుత్తమమైనటువంటి స్థాయి లో ఉన్నది’’

‘‘ప్రపంచవ్యాప్తం గా సప్లయ్ చైన్ లో భారతదేశం ఒక ముఖ్యమైన లంకె గామారుతున్నది’’

‘‘సాంకేతిక విజ్ఞానం పట్ల అభిరుచి, నష్ట భయాన్ని భరించే వారి పట్ల  నమ్మకం తో పాటు సంస్కరణల కు అనుకూలమైనటువంటి స్వభావం కూడాఉంది’’

‘‘ఒక బలమైన ప్రభుత్వం ప్రతి ఒక్క దాని ని గాని లేదా ప్రతి ఒక్కరి ని గాని అదుపు చేయదు.  అది జోక్యంచేసుకోవాలి అనేటటువంటి వ్యవస్థ లోని ఆవేశాన్ని అదుపు చేస్తుంది.  ఒక పటిష్టమైన ప్రభుత్వం ఆంక్షల ను విధించేది గా కాక ప్రతిస్పందన శీలమైందిగా ఉంటుంది.  ఒక శక్తివంతమైనటువంటి ప్రభుత్వం ప్రతిఒక్క రంగం లోకి ప్రవేశించదు;  అది తనను తాను హద్దు లోఉంచుకొని, ప్రజల లోని ప్రతిభాపాటవాల కు అవకాశాన్ని కల్పిస్తుంది’’

Posted On: 29 JUL 2022 11:40AM by PIB Hyderabad

అన్నా యూనివర్సిటీ 42వ స్నాతకోత్సవం ఈ రోజున చెన్నై లో జరుగగా, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ కార్యక్రమాని కి హాజరు అయ్యారు. ఈ సందర్భం లో పాలుపంచుకొన్న వారి లో తమిళ నాడు గవర్నరు శ్రీ ఆర్.ఎన్. రవి, తమిళ నాడు ముఖ్యమంత్రి శ్రీ ఎమ్.కె. స్టాలిన్ లతో పాటు కేంద్ర మంత్రి శ్రీ ఎల్. మురుగన్ కూడా ఉన్నారు.

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, పట్టాల ను అందుకొన్న విద్యార్థుల ను అభినందించారు. ‘‘ఇవాళ జరుగుతున్న అన్నా యూనివర్సిటీ 42వ స్నాతకోత్సవం లో పట్టభద్రులు అవుతున్న వారు అందరికి ఇవే అభినందనలు. మీరు మీ యొక్క మనస్సుల లో మీకంటూ ఒక భవిష్యత్తు ను ఇప్పటికే సంకల్పించుకొని ఉండి ఉంటారు. ఈ కారణం గా, నేటి రోజు కార్యసిద్ధుల కు సంబంధించినటువంటి దినం మాత్రమే కాదు, ఇది ఆకాంక్ష ల దినం అని కూడా చెప్పాలి’’, అని ఆయన అన్నారు. వారి ని రేపటి రోజు నాయకులు గా ప్రధాన మంత్రి పేర్కొంటూ, విద్యార్థినీ విద్యార్థుల తల్లితండ్రులు చేసిన త్యాగాల ను గురించి, అలాగే విశ్వవిద్యాలయం లోని అధ్యాపక సిబ్బంది మరియు అధ్యాపకేతర సిబ్బంది అందించినటువంటి సమర్థన ను గురించి కూడా ప్రస్తావించారు.

ప్రధాన మంత్రి 125 సంవత్సరాల క్రితం మద్రాసు గా వ్యవహారం లో ఉన్న ప్రాంతం లో భారతదేశ యువత సమక్షం లో నిలచిన అవకాశాల ను గురించి స్వామి వివేకనంద గారు ఆడిన మాటల ను గుర్తు కు తెచ్చుకొన్నారు. ‘‘యావత్తు జగత్తు భారతదేశం యొక్క యువతకేసి ఆశ గా చూస్తున్నది. ఎందుకంటే మీరు దేశాని కి వృద్ధి తాలూకు చోదక శక్తులు గా ఉన్నారు, మరి భారతదేశం ప్రపంచం యొక్క వృద్ధి కి చోదక శక్తి గా ఉంది’అని ప్రధాన మంత్రి అన్నారు.

అన్నా యూనివర్సిటీ తో పూర్వ రాష్ట్రపతి డాక్టర్ శ్రీ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ కు ఉన్న అనుబంధాన్ని కూడా ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకొన్నారు. ‘‘ఆయన ఆలోచన లు, ఆయన బోధించిన విలువ లు మీకు ఎల్లప్పటికీ ప్రేరణ ను అందిస్తూ ఉండు గాక’’, అని ప్రధాన మంత్రి అన్నారు.

కోవిడ్-19 మహమ్మారి ని ఇదివరకు ఎన్నడూ ఎరుగనిది అని ప్రధాన మంత్రి అన్నారు. అది వంద సంవత్సరాల కాలం లో ఒకసారి విరుచుకు పడేటటువంటి సంక్షోభం. అటువంటిది తలెత్తినప్పుడు ఏమి చేయాలి? అనేది ఎవరికీ తెలియదు. అది ప్రతి ఒక్క దేశాని కి పరీక్ష గా నిలచింది. గడ్డు స్థితులు అనేవి మన లోని సామర్థ్యాన్ని బయటపెడతాయి అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. భారతదేశం తనకు తెలియని దాని కి ఎంతో విశ్వాసం తో ఎదురొడ్డి నిలబడింది. ఇందులో శాస్త్రవేత్తలు, ఆరోగ్య సంరక్షణ రంగం లోని వృత్తి నిపుణులు మరియు సామాన్య ప్రాజానీకం యొక్క పాత్ర ధన్యవాదాలు పలకడాని కి అర్హమైంది గా ఉంది. ఫలితం గా భారతదేశం లో ప్రతి ఒక్క రంగం ఒక సరికొత్త చైతన్యం తో తొణికిసలాడింది అని ఆయన అన్నారు. పరిశ్రమ, పెట్టుబడి, నూతన ఆవిష్కరణ లు, అంతర్జాతీయ వ్యాపారం.. ఇవి అన్నీ భారతదేశం అగ్ర భాగాన నిలచేటట్లుగా దోహదపడుతున్నాయి అని ఆయన అన్నారు. కిందటి సంవత్సరం లో భారతదేశం ప్రపంచం లోకెల్లా రెండో అతి పెద్ద మొబైల్ ఫోన్ తయారీదారు గా లెక్క కు వచ్చింది అని ప్రధాన మంత్రి అన్నారు. నూతన ఆవిష్కరణ అనేది జీవన విధానం గా మారిపోతున్నది. కేవలం 6 సంవత్సరాల కాలం లో గుర్తింపు పొందిన అటువంటి స్టార్ట్-అప్స్ సంఖ్య 15,000 శాతం మేరకు వృద్ధి చెందిందని ఆయన అన్నారు. కిందటి సంవత్సరం లో భారతదేశం ఇది వరకు ఎన్నడూ లేనంతగా 83 బిలియన్ డాలర్ లకు పైచిలుకు ఎఫ్ డిఐ ని అందుకొంది అని ప్రధాన మంత్రి తెలిపారు. మన స్టార్ట్-అప్స్ సైతం మహమ్మారి అనంతర కాలం లో అపూర్వమైనటువంటి స్థాయి లో నిధుల ను అందుకొన్నాయి. వీటన్నింటికీ మించి, అంతర్జాతీయ వ్యాపారం పరం గా చూస్తే భారతదేశం యొక్క స్థానం ఇంత వరకు ఎన్నడూ లేనంతటి ఉత్తమమైన స్థాయి లో ఉన్నది అని ప్రధాన మంత్రి అన్నారు.

సాంకేతిక విజ్ఞానం ముందు వరుస లో నిలచి అంతవరకు ఉన్న స్థితి ని గణనీయం గా మార్చి వేస్తున్నటువంటి కాలం లో, మూడు ముఖ్యమైన అంశాలు భారతదేశాని కి అనుకూలం గా ఉన్నాయి అని ప్రధాన మంత్రి చెప్పారు. వీటిలో ఒకటో అంశం సాంకేతిక విజ్ఞానం పట్ల మక్కువ ఉండడం. సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించడం లో సౌకర్యం తాలూకు భావన అంతకంతకు పెరుగుతున్నది. నిరుపేద లు సైతం దీనిని అక్కున చేర్చుకొంటున్నారు అని ఆయన అన్నారు. ‘‘ఇక రెండో అంశం ఏమిటి అంటే అది నష్టభయాన్ని భరించే వారి పట్ల విశ్వాసం ఉండడం. ఇంతకు ముందు నలుగురు గుమికూడే సందర్భాలు తటస్థించినప్పుడు ఒక యువకుడు గాని, లేదా ఒక యువతి గానీ తాను ఒక నవపారిశ్రామికవేత్త ను అని పరిచయం చేసుకోవడం అంటే అది ఎంతో కష్టం గా ఉండేది. జీవితం లో స్థిరపడు అని వారి తో ప్రజలు అనే వారు. ఇక్కడ జీవితం లో స్థిరపడటం అంటే నెల తిరిగేసరికల్లా జీతం వచ్చే ఉద్యోగాన్ని సంపాదించుకోమని అర్థం అని ప్రధాన మంత్రి వివరించారు. మూడో అంశాన్ని గురించి ఆయన చెప్తూ- సంస్కరణ పట్ల మొగ్గు చూపే స్వభావం అలవడిందన్నారు. ప్రధాన మంత్రి ఇంకా ఇలా మాట్లాడారు.. ‘‘మునుపు ఒక బలమైన ప్రభుత్వం అంటే అది ప్రతి ఒక్క విషయాన్ని మరియు ప్రతి ఒక్కరి ని అదుపు లో ఉంచాలి అనేటటువంటి అభిప్రాయమంటూ ఉండేది. కానీ మేం దీనిని మార్చాం. ఒక శక్తివంతమైన ప్రభుత్వం అన్నిటిని గాని, లేదా అందరి ని గాని కట్టడి చేయదు. అది జోక్యం చేసుకోవాలి అనేటటువంటి వ్యవస్థ లోని ఆవేశాని కి పగ్గం వేస్తుంది. ఒక పటిష్టమైన ప్రభుత్వం ఆంక్షల ను విధించేది కాకుండా ప్రతిస్పందన పూర్వకమైంది గా ఉంటుంది. ఒక బలమైన ప్రభుత్వం ప్రతి రంగం లోకి చొరబడి పోదు, అది తనకు తాను పరిమితి ని విధించుకొంటుంది. అంతేకాకుండా ప్రజల లోని ప్రతిభ పాటవాల కు అవకాశాల ను కల్పిస్తుంది’’ ఆయన విడమరచి చెప్పారు. ‘‘ఒక బలమైన ప్రభుత్వం యొక్క చేవ అనేది అది ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకో జాలదు అనే విషయాన్ని గాని లేదా అది ప్రతి ఒక్క పని ని చేయజాలదు అనే విషయాన్ని గాని అంగీకరించగలిగే అణకువ లో ఇమిడి ఉంటుంది.’’ అని ఆయన స్పష్టంచేశారు. ఈ కారణం గా సంస్కరణ లు ప్రజల కు మరియు ప్రతి ఒక్క రంగం లో వారు చూపే ప్రతిభ కు మరిన్ని అవకాశాల ను అందిస్తున్నాయి అని ఆయన అన్నారు. జాతీయ విద్య విధానం రూపకల్పన ద్వారా యువత కు అందించినటువంటి స్వాతంత్య్రాన్ని మరియు సరళత్వాన్ని అందించడంతో పాటు గా వ్యాపార నిర్వహణ లో సౌలభ్యం కోసం 25,000 నియమాల ను పాలించడవలసినటువంటి అగత్యం లేకుండా ఆ నియమాల ను రద్దు చేయడం కూడా జరిగిందనే ఉదాహరణల ను గురించి ఆయన ప్రస్తావించారు ‘‘ఎంజెల్ టాక్స్ తొలగింపు, వెనుకటి తేదీ నుంచి వర్తించే పన్ను ను ఎత్తివేయడం తో పాటు కార్పొరేట్ పన్ను లో తగ్గింపు వంటి చర్య లు పెట్టుబడుల ను మరియు పరిశ్రమ ను ప్రోత్సహిస్తున్నాయి. డ్రోన్స్ తయారీ, అంతరిక్షం, ఇంకా జియో స్పేశల్ రంగాల లో ప్రవేశపెట్టిన సంస్కరణ లు సరికొత్త బాటల ను పరుస్తున్నాయి’’, అని ఆయన అన్నారు.

యువత మరియు దేశం ల పురోగతి కి నడుమ న ఒక లంకె ఉంది అని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. ‘‘మీరు వృద్ధి చెందితే భారతదేశం వృద్ధి చెందినట్లు. మీరు నేర్చుకొనేవి భారతదేశాని కి పాఠాలు. మీ గెలుపు భారతదేశాని కి లభించేటటువంటి విజయం’’ అని చెబుతూ, ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.

ఈ కార్యక్రమం లో భాగం గా ప్రధాన మంత్రి 69 మంది స్వర్ణ పతక విజేతల కు బంగారు పతకాల ను మరియు సర్టిఫికెట్స్ ను అందజేశారు. అన్నా యూనివర్సిటీ ని 1978వ సంవత్సరం లో సెప్టెంబర్ 4వ తేదీ నాడు స్థాపించడం జరిగింది. దీనికి తమిళ నాడు పూర్వ ముఖ్యమంత్రి శ్రీ సి.ఎన్. అన్నా దురై పేరు ను పెట్టారు. విశ్వవిద్యాలయానికి తమిళ నాడు లో 13 కళాశాల లు, 494 అనుబంధ కళాశాల లతో పాటు మూడు ప్రాంతీయ ప్రాంగణాలు ఉన్నాయి. ఆ ప్రాంతీయ ప్రాంగణాలు తిరునెల్ వేలి, మదురై, కోయంబత్తూరు లలో ఉన్నాయి.

 

***

DS/AK

 



(Release ID: 1846169) Visitor Counter : 190