ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్మూ కు ఒక ఫలప్రదమైన పదవీకాలం దక్కాలనిఆకాంక్షించిన ప్రధాన మంత్రి 

प्रविष्टि तिथि: 25 JUL 2022 1:34PM by PIB Hyderabad

రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్మూ పదవీ కాలం ఫలప్రదం కావాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఆమె పదవీ బాధ్యతల ను స్వీకరించడం భారతదేశాని కి, ప్రత్యేకించి పేద ప్రజలకు, ఆదరణ కు నోచుకోనటువంటి వర్గాలు మరియు బలహీన వర్గాల వారికి ఒక చరిత్రాత్మకమైనటువంటి ఘడియ అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రపతి తన పదవీ బాధ్యత ల స్వీకార సందర్భం లో చేసిన ప్రసంగం లో భారతదేశం యొక్క కార్యసాధనల ను గురించి ప్రస్తావించడం తో పాటు గా భారతదేశం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ను జరుపుకొంటూ ఉన్న కాలం లో దేశం ముందున్న పథాన్ని గురించి చక్కగా దర్శించారని కూడా ఆయన అన్నారు.

 

ప్రధాన మంత్రి తన ట్వీట్ లలో -

‘‘శ్రీమతి ద్రౌపదీ ముర్మూ గారు భారతదేశ రాష్ట్రపతి గా పదవీ ప్రమాణం స్వీకరించడాన్ని యావత్తు దేశ ప్రజలు సగర్వం గా తిలకించారు. ఆమె రాష్ట్రపతి గా పదవీ బాధ్యతల ను స్వీకరించడం భారతదేశాని కి, ప్రత్యేకించి పేదల కు, ఆదరణ కు నోచుకోనటువంటి వర్గాలు మరియు బలహీన వర్గాల వారికి ఒక చరిత్రాత్మకమైనటువంటి ఘడియ అని చెప్పాలి. రాష్ట్రపతి గా ఆమె పదవీ కాలం ఫలప్రదం కావాలి అని నేను కోరుకొంటూ, ఆమెకు శుభాకాంక్షల ను తెలియజేస్తున్నాను.’’

‘‘రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్మూ గారు పదవీ ప్రమాణాన్ని స్వీకరించిన తరువాత చేసిన ప్రసంగం లో, ఆశ మరియు కరుణల తో కూడిన సందేశాన్ని ఇచ్చారు. భారతదేశం యొక్క కార్య సాధనల ను గురించి ఆమె ప్రముఖం గా ప్రస్తావించారు. అంతేకాక భారతదేశం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ను జరుపుకొంటున్న కాలం లో దేశం ముందు ఉన్న మార్గం తాలూకు ఒక భవిష్యత్ దృష్టికోణాన్ని కూడా ఆమె ఆవిష్కరించారు.’’ అని పేర్కొన్నారు.

DS

 

 

 


(रिलीज़ आईडी: 1844642) आगंतुक पटल : 210
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam