ప్రధాన మంత్రి కార్యాలయం

12వ తరగతి ఫలితాల ను సిబిఎస్ఇ ప్రకటించిన నేపథ్యం లో విద్యార్థుల కుఅభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి

విద్యార్థులు వారి అంతర్వాణి చెప్పినట్టు నడుచుకోవాలి అంటూ ప్రధాన మంత్రివిజ్ఞప్తి చేశారు

ఫలితాల ను చూసుకొని సంతోషం గా లేనటువంటి విద్యార్థుల ను ప్రోత్సహిస్తూమాట్లాడిన ప్రధాన మంత్రి

Posted On: 22 JUL 2022 2:05PM by PIB Hyderabad

పన్నెండో తరగతి ఫలితాల ను సిబిఎస్ఇ ప్రకటించిన అనంతరం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విద్యార్థుల కు అభినందనల ను తెలియజేశారు.

 

ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో -

 

‘‘సిబిఎస్ఇ XII వ తరగతి పరీక్షల లో ఉత్తీర్ణులు అయిన నా యువ మిత్రులు అందరికీ ఇవే అభినందన లు. ఈ యువ జనులు ప్రదర్శించిన సమర్పణ భావం, ధైర్యం ప్రశంసనీయం. మానవాళి ఒక పెద్ద సవాలు ను ఎదుర్కొన్న కాలం లో వారు ఈ పరీక్షల కోసం సన్నద్ధం అవడం తో పాటు ఈ సాఫల్యాన్ని కూడా సాధించారు.’’

 

‘‘సిబిఎస్ఇ XII వ తరగతి పరీక్షల లో ఉత్తీర్ణత సాధించిన మన యువ ఎగ్జామ్ వారియర్స్ కోసం ఎదురుచూస్తున్నటువంటి అవకాశాలు ఎన్నెన్నో. వారు వారి మనస్సు చెప్పే మాట ను వినాలి, మరి వారు ఉద్వేగం పెంచుకొన్న సబ్జెక్టుల ను అనుసరించాలి అంటూ వారి కి నేను విజ్ఞప్తి ని చేస్తున్నాను. వారు వారి భావి ప్రయాసల లో చక్కని ఫలితాల ను సాధించాలి అని నేను ఆకాంక్షిస్తున్నాను.’’

 

‘‘కొందరు విద్యార్థులు వారి ఫలితాల ను చూసుకొన్న తరువాత ఏమంత సంతోషం గా ఉండి ఉండకపోవచ్చు. అయితే, ఒక పరీక్ష అనేది వారి సత్తా ను ఎన్నటికీ నిర్వచించ జాలదు అనే విషయాన్ని వారు తెలుసుకొని తీరాలి. రాబోయే కాలాల్లో వారు తప్పక మరిన్ని విజయాల ను సాధించగలుగుతారు అని నాకు అనిపిస్తోంది. ఈ సంవత్సరం ‘పరీక్షా పే చర్చ’ (పిపిసి) కార్యక్రమం లో పరీక్షల కు సంబంధించి మనం మాట్లాడుకొన్న అంశాల ను కూడా శేర్ చేస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

Congratulations to all my young friends who passed the CBSE Class XII exams. The grit and dedication of these youngsters is commendable. They prepared for these exams through a time when humanity faced a monumental challenge and achieved this success.

— Narendra Modi (@narendramodi) July 22, 2022

There are innumerable opportunities that await our young Exam Warriors, who passed the CBSE Class XII exams. I urge them to follow their inner calling and pursue subjects they are passionate about. My best wishes for their future endeavours.

— Narendra Modi (@narendramodi) July 22, 2022

Some students may not be happy with their results but they must know that one exam will never define who they are. I am certain they will find more success in the times to come. Also sharing this year's PPC where we discussed aspects relating to exams. https://t.co/lKYdXhnHTF

— Narendra Modi (@narendramodi) July 22, 2022

 

*****



(Release ID: 1843840) Visitor Counter : 105