సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
2021-22లో భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న 747 వెబ్‌సైట్‌లు, 94 యూట్యూబ్ ఛానెల్‌లు తొలగించబడ్డాయి: కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్
Posted On:
21 JUL 2022 4:14PM by PIB Hyderabad
2021-22లో దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న యూట్యూబ్ ఛానెల్‌లపై మంత్రిత్వ శాఖ కఠిన చర్యలు తీసుకుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ ఈరోజు తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, 94 యూట్యూబ్ ఛానెల్‌లు, 19 సోషల్ మీడియా ఖాతాలు మరియు 747 యూఆర్‌ఎల్‌లకు వ్యతిరేకంగా మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుందని, వాటిని బ్లాక్ చేసిందని శ్రీ ఠాకూర్ చెప్పారు. ఈ చర్యలు సెక్షన్ 69A ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారం తీసుకోబడ్డాయి.
తప్పుడు /నకిలీ వార్తలను వ్యాప్తి చేయడం ద్వారా, ఇంటర్నెట్లో ప్రచారం చేయడం ద్వారా దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా పనిచేసే ఏజెన్సీల పై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి అన్నారు.
(Release ID: 1843586)
Visitor Counter : 247
Read this release in:
Urdu
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Odia
,
English
,
Hindi
,
Marathi
,
Bengali
,
Tamil
,
Malayalam