ప్రధాన మంత్రి కార్యాలయం
200 కోట్ల వేక్సీన్ డోజుల ను మించి పోయినందుకు గాను ప్రధాన మంత్రి కి అభినందనలు తెలిపిన శ్రీ బిల్ గేట్స్
శాస్త్రవేత్తలు, వైద్యులు మరియు నర్సుల ఉమ్మడి కృషి ని ప్రశంసించిన ప్రధానమంత్రి
Posted On:
20 JUL 2022 3:13PM by PIB Hyderabad
భారతదేశం లో ప్రజల కు టీకా మందును ఇప్పించే కార్యక్రమాని కి పెద్ద దన్ను గా నిలవడం లో శాస్త్రవేత్త లు, వైద్యులు మరియు నర్సు ల సామూహిక ప్రయాసల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
శ్రీ బిల్ గేట్స్ అభినందన పూర్వకం గా చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి జవాబు ఇస్తూ -
‘‘భారతదేశం లో ప్రజల కు టీకా మందు ను ఇప్పించే కార్యక్రమం స్థాయి ని, వేగాన్ని బట్టి చూసినప్పుడు అతి పెద్దది గా ఉంది. దీని కి ఎంతో మంది యొక్క - వారి లో శాస్త్రవేత్త లు, వైద్యులు మరియు నర్సు లు కలసి ఉన్నారు- సామూహిక ప్రయత్నాలు అండ గా నిలచాయి. అదే కాలం లో, భారతదేశ ప్రజలు విజ్ఞాన శాస్త్రం పట్ల చెప్పుకోదగ్గ విశ్వాసాన్ని చాటుకొని, వారి డోజుల ను సకాలం లో స్వీకరించారు.’’ అని పేర్కొన్నారు.
*****
DS/TS
(Release ID: 1843171)
Read this release in:
Tamil
,
Kannada
,
Malayalam
,
Bengali
,
Odia
,
English
,
Urdu
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati