పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వన్యప్రాణి సంరక్షణ మరియు స్థిరమైన జీవవైవిధ్య వినియోగంపై అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసిన భారతదేశం-నమీబియా


రెండు దేశాలలో వన్యప్రాణి సంరక్షణ మరియు స్థిరమైన జీవవైవిధ్య వినియోగం అంశాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా అవగాహన ఒప్పందం

ప్రపంచ పరిరక్షణ ప్రయత్నాలకు దోహదపడే చారిత్రాత్మక పరిణామ సమతుల్యత పరిరక్షణకు దోహదపడే విధంగా భారతదేశంలో చిరుత జాతి పునరుద్ధరణ ప్రాజెక్టు అమలు

Posted On: 20 JUL 2022 12:59PM by PIB Hyderabad

వన్యప్రాణి సంరక్షణ మరియు స్థిరమైన జీవ వైవిధ్య వినియోగంపై   భారతదేశ ప్రభుత్వం మరియు రిపబ్లిక్ ఆఫ్ నమీబియా ప్రభుత్వం ఈ రోజు ఒక  అవగాహన ఒప్పందం ( ఎంఒయు  ) పై సంతకాలు చేశాయి.   భారతదేశంలో చారిత్రక  చిరుత జాతి పూర్వ స్థాయికి చేరుకునేలా చూసేందుకు ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాలు కృషి చేస్తాయి.  స్థాపించడానికి కుదుర్చుకున్నాయి. పరస్పర గౌరవం, సార్వభౌమాధికారం, సమానత్వం మరియు భారతదేశం మరియు నమీబియా దేశాలకు ప్రయోజనం కలిగే విధంగా  వన్యప్రాణుల సంరక్షణ మరియు స్థిరమైన జీవవైవిధ్య వినియోగాన్ని ప్రోత్సహించడానికి  ఎంఒయు దోహదపడుతుంది.
ఎంఒయులో ప్రాధాన్యతా క్రమంపై అమలు జరిగే ప్రధాన అంశాలు:

 

 

   



•  అంతరించిపోతున్న  చిరుతలను సంరక్షించి  గతంలో  సంచరించిన ప్రాంతాల్లో సంచరించే విధంగా చర్యలు అమలు చేస్తూ  చిరుతల  సంరక్షణ మరియు పునరుద్ధరణ అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక  దృష్టితో జీవవైవిధ్య పరిరక్షణ,
• రెండు దేశాలలో చిరుత సంరక్షణను ప్రోత్సహించే లక్ష్యంతో నైపుణ్యం మరియు సామర్థ్యం భాగస్వామ్యం మరియు మార్పిడి,
• ఉత్తమ  పద్ధతులు మార్పిడి చేసుకోవడం ద్వారా వన్యప్రాణుల సంరక్షణ మరియు స్థిరమైన జీవవైవిధ్య వినియోగం సాధించడం
• సాంకేతిక అనువర్తనాలు, వన్యప్రాణుల ఆవాసాలలో నివసించే స్థానిక ప్రజలకు జీవనోపాధిని కల్పించడం,  జీవవైవిధ్య పరిరక్షణకు విధానాలు అమలు చేయడం
• వాతావరణ మార్పు, పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ ప్రభావ అంచనా, కాలుష్యం మరియు వ్యర్థాల నిర్వహణ మరియు పరస్పర ఆసక్తి ఉన్న ఇతర రంగాల్లో సహకారం అందించుకోవడం
 • వన్యప్రాణుల నిర్వహణలో శిక్షణ మరియు విద్య కోసం సిబ్బంది మార్పిడి, సంబంధిత అంశాల్లో  సాంకేతిక నైపుణ్యాన్ని పంచుకోవడం.
పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ అంశాల అమలు, విలువల పరిరక్షణలో చిరుత పాత్ర ఎక్కువగా ఉంటుంది. గతంలో భారతదేశంలో చిరుతల సంతతి ఎక్కువగా ఉండేది. జీవ వైవిధ్య పరిరక్షణ కోసం చిరుతలు అంతరించిపోకుండా చూసి గతంలో మాదిరిగా వీటి సంతతిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
గతంలో చిరుతలు సంతరించిన ప్రాంతాలను పునరుద్ధరించడం,జీవ వైవిధ్యాన్ని రక్షించి, జీవ వైవిధ్య క్షీణత వల్ల నష్టాలను నివారించడం ప్రధాన లక్ష్యంగా ప్రాజెక్టు అమలు జరుగుతుంది.
ఇతర వన్య ప్రాణులతో పోల్చి చూస్తే చిరుతల వల్ల ప్రజలకు ఎక్కువగా నష్టం కలగదు. మనుషులు, పెద్ద పశువులపై చిరుతలు సాధారణంగా దాడి చేయవు. జంతువులను వేటాడి జీవించే చిరుత జాతికి పూర్వ వైభవం తీసుకు రావడం  వల్ల పర్యావరణ పరంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వన్యప్రాణుల ఆవాసాల (గడ్డి భూములు, పొదలు మరియు బహిరంగ అటవీ పర్యావరణ వ్యవస్థ) మెరుగైన నిర్వహణ మరియు పునరుద్ధరణ కు దోహదపడతాయి.  చిరుత వేటాడి సంహరించే వన్య ప్రాణుల సంఖ్య పెరుగుతుంది. పర్యావరణ వ్యవస్థలో దిగువ స్థాయిలో కనిపించే వన్య  జాతుల పరిరక్షణ సాధ్యమవుతుంది. జీవ వైవిధ్య పరిరక్షణలో పెద్ద వన్యప్రాణి గా గుర్తింపు పొందిన చిరుత కీలకంగా ఉంటుంది.
చిరుతలు సంచరించి జీవించడానికి అనువైన పరిస్థితులను అభివృద్ధి చేయడం లక్ష్యంగా భారతదేశంలో చిరుత పునరుద్ధరణ ప్రాజెక్ట్  జరుగుతుంది. జీవించి, అభివృద్ధి చెందడానికి  దోహదపడే  కల్పించినప్పుడు పెద్ద పిల్లి జాతికి చెందిన చిరుతల సంఖ్య పెరుగుతుంది. ప్రాజెక్టు ద్వారా దేశంలో చిరుత జాతి అభివృద్ధికి అవసరమైన పరిస్థితులు, వాతావరణాన్ని కల్పించడం ద్వారా గతంలో చిరుతలు సంచరించిన ప్రాంతాలు పరిరక్షించబడతాయి. దీనితో ప్రపంచ స్థాయిలో పర్యావరణ పరిరక్షణకు జరుగుతున్న ప్రయత్నాలకు భారతదేశం చిరుతల ద్వారా తన సహకారాన్ని అందించి  లక్ష్య సాధనకు తన వంతు సహకారం అందించి గలుగుతుంది. చిరుత సంరక్షణ ప్రాజెక్టును అమలు చేసేందుకు అనువైన ప్రాంతాన్ని గుర్తించేందుకు  2010-2012 మధ్య  పది ప్రాంతాల్లో సర్వే జరిగింది. అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి రూపొందించిన మార్గదర్శకాలు, భౌగోళిక పరిస్థితులు, జన్యుశాస్త్రం, సామాజిక - ఆర్థిక అంశాలు, ప్రజల జీవనోపాధి అంశాల ఆధారంగా సర్వే జరిగింది. మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్కులో చిరుత జాతిని ప్రవేశపెట్టడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయని గుర్తించారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఆసియా జాతికి చెందిన సింహాలను ప్రవేశపెట్టి వాటి  సంరక్షణకు అవసరమైన ఏర్పాట్లను కల్పించారు. అతి తక్కువ ఖర్చుతో ఇబ్బందులు లేకుండా కునో నేషనల్ పార్కులో చిరుత జాతిని ప్రవేశపెట్టవచ్చునని నిర్దారించారు.
దక్షిణ ఆఫ్రికాలో ( దక్షిణ ఆఫ్రికా, నమీబియా,బోట్స్వానా, జింబాబ్వే) ప్రాంతాల్లో చిరుతలు ఎక్కువగా జీవిస్తున్నాయి. ఈ ప్రాంతాల వాతావరణ పరిస్థితులను కునో నేషనల్ పార్కులో నెలకొన్న వాతావరణ పరిస్థితులతోమాక్సిమమ్  ఎంట్రోపీ మోడల్‌లనువిధానాలను ఉపయోగించి అధ్యయనం చేయడం జరిగింది. రెండు ప్రాంతాల వాతావరణ పరిస్థితులు దాదాపు ఒకే విధంగా ఉన్నాయని అధ్యయనంలో వెల్లడైంది. దీంతో  కునో నేషనల్ పార్కులో చిరుత జాతి అభివృద్ధి చెందేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.
 అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి రూపొందించిన మార్గదర్శకాలు, వేటాడి జీవించడానికి అనువైన పరిస్థితులు,  కునో నేషనల్ పార్క్ సామర్థ్యం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని  కునో నేషనల్ పార్క్ లో  చిరుతలను ప్రవేశపెట్టేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం అయ్యింది.
ప్రస్తుతానికి  కునో నేషనల్ పార్కులో 21 చిరుతలను ప్రవేశ పెట్టడానికి అవసరమైన సౌకర్యాలు ఉన్నాయి. మరిన్ని సౌకర్యాలను కల్పించడం ద్వారా పార్కులో 36 చిరుతల సంరక్షణకు అవకాశం కలుగుతుంది. చిరుతలు తమకు అవసరమైన ఆహారాన్ని పొందడానికి వీలుగా ఇతర వన్య ప్రాణుల అభివృద్ధి కోసం  కునో నేషనల్ పార్కు మిగిలిన భాగాన్ని ( 1,280 చదరపు కిలోమీటర్లు) అభివృద్ధి చేయడం ద్వారా చిరుతల సంఖ్యని మరింత ఎక్కువ చేయవచ్చు.  
భారతదేశంలో చిరుత పునరుద్ధరణ కార్యక్రమానికి అవసరమైన ఆర్థిక మరియు పరిపాలనా సహకారాన్ని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ  ద్వారా కేంద్ర పర్యావరణ, అటవీ, పర్యావరణ మార్పుల మంత్రిత్వ శాఖ సమకూరుస్తుంది.కార్పొరేట్ల సామాజిక బాధ్యత(సీఎస్సార్‌)  ద్వారా ప్రభుత్వం, కార్పొరేట్ ఏజెన్సీల భాగస్వామ్యం రాష్ట్ర మరియు కేంద్ర స్థాయిలో అదనపు నిధుల కోసం ప్రయత్నాలు జరుగుతాయి.  వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఐఐ), జాతీయ మరియు అంతర్జాతీయ /చిరుత నిపుణులు/ఏజెన్సీలు ఈ కార్యక్రమానికి సాంకేతిక మరియు విజ్ఞాన సహాయాన్ని అందిస్తాయి.చిరుత పునరుద్ధరణ, సంరక్షణ ప్రాజెక్టు విజయం సాధించేలా చూసేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ, పర్యావరణ మార్పుల మంత్రిత్వ శాఖ,  నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర అటవీ శాఖ అధికారులకు ఆఫ్రికాలోని చీతా పరిరక్షణ కేంద్రాల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. చిరుతల అభివృద్ధి, సంరక్షణ కార్యక్రమాల్లో పాల్గొనే భారతదేశానికి చెందిన సిబ్బంది, అధికారులకు ఆఫ్రికాకు చెందిన నిపుణులు శిక్షణ ఇస్తారు.
 చిరుతల సంరక్షణ బాధ్యతను  కునో నేషనల్ పార్క్ స్వీకరిస్తుంది. సంరక్షణ, అభివృద్ధి అంశాలపై నిపుణులు చేపడతారు. స్థానిక గ్రామాల ప్రజలు కార్యక్రమంలో పాల్గొనేలా చూసేందుకు వివిధ అవగాహన కార్యక్రమాలు అమలు  జరుగుతాయి. సంరక్షణ కార్యక్రమంలో సర్పంచులు, స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు, మత పెద్దలు, స్వచ్ఛంద సేవా సంస్థలకు స్థానం కల్పిస్తారు. వన్య ప్రాణుల సంరక్షణ కోసం అటవీ శాఖ అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలపై అవగాహన కల్పించి, ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు పాఠశాలలు,కళాశాలలు,గ్రామాల్లో కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందుతుంది. దీనికోసం  "చింటూ చిరుత" అనే స్థానిక మస్కట్‌తో ప్రచార, అవగహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. చిరుత-మానవ సంబంధాలకు  సంబంధించిన సమాచారాన్ని వ్యాప్తి చేయాలని కునో నేషనల్ పార్క్ చుట్టుపక్కల నియోజకవర్గాలకు చెందిన  రాష్ట్ర అధికారులు, శాసనసభకు ఎన్నికైన ప్రజా ప్రతినిధులను   మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కోరారు.
 2020లో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా, సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ సలహాలు, సూచనలు, మార్గదర్శకాలకు లోబడి   భారతదేశంలో చిరుతలు తిరిగి ప్రవేశపెట్టి అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని జాతీయ పులుల సంరక్షణ సంస్థ, కేంద్ర పర్యావరణ, అటవీ, పర్యావరణ మార్పుల మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తున్నాయి.
భారతదేశంలో “చిరుతలను తిరిగి ప్రవేశపెట్టడానికి కార్యాచరణ ప్రణాళిక” బ్రోచర్ లింక్‌ను క్లిక్ చేయండి

 

***


(Release ID: 1842985) Visitor Counter : 764