ప్రధాన మంత్రి కార్యాలయం

పి.వి. సింధు గారి ని ఆమె తొలిసారిగా సింగపూర్ ఓపెన్ టైటిల్ ను గెలుచుకొన్నందుకు అభినందించిన ప్రధాన మంత్రి

Posted On: 17 JUL 2022 2:23PM by PIB Hyderabad

పి.వి. సింధు గారు తొలి సారి గా సింగపూర్ ఓపెన్ టైటిల్ ను గెలుచుకొన్న సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమె కు అభినందన లు తెలిపారు. ఇది దేశానికి ఒక గర్వకారణమైన ఘడియ అని, అంతేకాకుండా వృద్ధిలోకి వస్తున్నటువంటి క్రీడాకారుల కు ఇది ప్రేరణ ను కూడా అందించగలదని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

కేంద్ర క్రీడాశాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింహ్ ఠాకుర్ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానంగా తాను మరొక ట్వీట్ లో

‘‘@Pvsindhu1 తొలిసారి గా సింగపూర్ ఓపెన్ టైటిల్ ను గెలుచుకొన్న సందర్భం లో ఆమె కు ఇవే నా అభినందన లు. ఆమె తన అసాధారణ క్రీడా ప్రతిభ ను మరో మారు చాటిచెప్పారు, తద్ద్వారా సఫలత ను సాధించారు. ఇది దేశాని కి ఒక గర్వకారణమైనటువంటి ఘడియ; అంతేకాదు, ఈ కార్యసాధన అనేది వృద్ధి లోకి వస్తున్నటువంటి క్రీడాకారుల కు ప్రేరణ ను కూడా అందిస్తుంది.’’ అని పేర్కొన్నారు.

 
***
DS/SH

 

 



(Release ID: 1842265) Visitor Counter : 141