వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

మరమ్మతులపై హక్కు సాధించేందుకు సమగ్ర వ్యవస్థ రూపకల్పన చేసేందుకు కమిటీని నియమించిన వినియోగ వ్యవహారాల శాఖ


మరమ్మతులపై హక్కు సాధించేందుకు వ్యవసాయ పనిముట్లు, మొబైల్ ఫోన్లు/టాబ్లెట్, వినియోగ వస్తువులు, ఆటోమొబైల్/ ఆటోమొబైల్స్ పరికరాలు లాంటి రంగాలను తన తొలి సమావేశంలో గుర్తించిన కమిటీ

స్వయంగా లేదా థర్డ్ పార్టీ ద్వారా మరమ్మతులు అనుమతించడం వల్ల ఆత్మ నిర్భర్ భారత్ కింద ఉపాధి అవకాశాల కల్పన

పర్యావరణ హిత జీవనశైలి కోసం ప్రపంచవ్యాప్త ఉద్యమం ప్రారంభం కావాలంటూ ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపుకు అనుగుణంగా రూపొందనున్న వ్యవస్థ

Posted On: 14 JUL 2022 11:51AM by PIB Hyderabad

వినియోగ వస్తువుల జీవన కాలం పెంచి అవి ఎక్కువ రోజులు ఉపయోగపడేలా చూసి పర్యావరణహిత జీవనశైలి నిర్మాణం కోసం సాగుతున్న ప్రయత్నాలు  (లైఫ్) సాకారం అయ్యేలా చూసేందుకు వినియోగదారుల వ్యవహారాల శాఖ ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంది. మరమ్మతులపై హక్కు సాధించేందుకు సమగ్ర వ్యవస్థ రూపకల్పన చేసేందుకు  వినియోగ వ్యవహారాల శాఖ ఒక కమిటీని నియమించింది. 

భారతదేశ స్థానిక మార్కెట్‌లో వినియోగదారులు మరియు ఉత్పత్తి కొనుగోలుదారులకు మరిన్ని హక్కులు కల్పించి, పరికరాలను ఉత్పత్తి చేసిన అసలు  తయారీదారులు మరియు మూడవ పక్షం కొనుగోలుదారులు మరియు విక్రేతల మధ్య వాణిజ్యాన్ని సమన్వయం చేయడం,పరికరాల జీవన కాలాన్ని ఎక్కువ చేసి ఈ-వ్యర్థాల విడుదల తగ్గించేందుకు దోహదపడే వ్యవస్థకు రూపకల్పన చేయాలన్న లక్ష్యంతో కమిటీ దృష్టి సారించి పనిచేస్తుంది. భారతదేశంలో ఈ వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత పరికరాల వినియోగ కాలం పెరగడంతో పాటు  పరికరాల మరమ్మతుకు థర్డ్ పార్టీకి అనుమతి ఇవ్వడం వల్ల   ఆత్మ నిర్భర్ భారత్ కింద ఉపాధి అవకాశాలు మరింత ఎక్కువగా అందుబాటులోకి వస్తాయి.

లక్ష్య సాధన కోసం వినియోగ వ్యవహారాల శాఖ ఒక కమిటీని నెలకొల్పింది. కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి నిధి ఖరే అధ్యక్షతన పనిచేసే కమిటీ సభ్యులుగా వినియోగ వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ అనుపం మిశ్రపంజాబ్ హర్యానా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పరంజీత్ సింగ్ దాలివాల్పంజాబ్ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ మాజీ అధ్యక్షుడుప్రొఫెసర్ (డా.) జి.ఎస్.  బాజ్‌పాయ్, పాటియాలా  రాజీవ్ గాంధీ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లా  వైస్-ఛాన్సలర్ప్రొ. శ్రీ అశోక్ పాటిల్, కన్స్యూమర్ లా అండ్ ప్రాక్టీస్ అధ్యక్షుడు, ఐసీఈఏ, ఎస్ఐఏఎమ్ లాంటి వినియోగదారులు, వినియోగదారుల హక్కుల కోసం కృషి చేస్తున్న సంస్థల ప్రతినిధులు వ్యవహరిస్తారు. 

కమిటి 2022 జూలు 13న  మొదటిసారిగా సమావేశం అయ్యింది. మరమ్మతులపై హక్కు సాధించేందుకు ముఖ్యమైన రంగాలను గుర్తించింది.  వ్యవసాయ పనిముట్లు, మొబైల్ ఫోన్లు/టాబ్లెట్, వినియోగ వస్తువులు, ఆటోమొబైల్/ ఆటోమొబైల్స్ పరికరాలు లాంటి రంగాలను  మరమ్మతులపై హక్కు సాధించేందుకు కమిటీ గుర్తించింది. 

కమిటీ సమావేశంలో కొన్ని ముఖ్యమైన అంశాలు చర్చకు వచ్చాయి. వినియోగదారులు సులువుగా మరమ్మతులు చేసుకునేందుకు అవకాశం కల్పించే మాన్యువల్‌లను సంస్థలు పరికరాలతో పాటు అందించడం లేదని కమిటీ గుర్తించింది. పరికరాల విడి  భాగాలపై(స్క్రూలు మరియు ఇతర వాటి కోసం వారు ఉపయోగించే డిజైన్ రకం గురించి) ఉత్పత్తిదారులు నియంత్రణ కలిగి ఉంటున్నారు. మరమ్మత్తు ప్రక్రియలపై సాగుతున్న గుత్తాధిపత్యం వల్ల వినియోగదారులు తమకు నచ్చిన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. దీనివల్ల వినియోగదారుల హక్కులకు భంగం కలుగుతున్నదని కమిటీ  గుర్తించింది. ఉదాహరణకి గుర్తింపులేని కేంద్రం నుంచి పరికరాన్ని కొనుగోలు చేసిన సమయంలో వినియోగదారుడు డిజిటల్ వారంటీ కార్డు పొందే అధికారాన్ని కోల్పోవలసి వస్తున్నది. డిజిటల్ హక్కుల యాజమాన్యం, సాంకేతిక హక్కుల రక్షణ లాంటి అంశాల్లో  వివాదాలు కొనసాగుతున్నాయి. డిజిటల్ హక్కుల యాజమాన్యం వల్ల కాపీరైట్ కలిగి ఉన్న వారికి   ఉపశమనం కలుగుతుంది. నిర్ణీత కాలం వరకు మాత్రమే తాము ఉత్పత్తి చేస్తున్న పరికరం పనిచేసేలా చూసేందుకు  పరికరాల తయారీలో ఉత్పత్తిదారులు ఆమోదయోగ్యం కాని ప్రణాళికను అనుసరిస్తున్నారని కమిటీ గుర్తించింది. ఉత్పత్తిదారులు అనుసరిస్తున్న విధానాల వల్ల పరికరాలు నిర్దేశించిన కాలం వరకు మాత్రమే పనిచేస్తాయి. కాలపరిమితి ముగిసిన తర్వాత వీటిని తప్పనిసరిగా మార్చవలసి ఉంటుంది.  కొనుగోలుదారుకు పూర్తి అధికారాన్ని అందించేందుకు రూపొందిన  ఒప్పందాలు అమలు కానప్పుడు  యజమానుల చట్టపరమైన హక్కు దెబ్బతింటుందని కమిటీ అభిప్రాయపడింది. 

పరికరాలకు సంబంధించి పూర్తి వివరాలు పొందుపరిచే మాన్యువల్‌,పత్రాలు,సాఫ్ట్‌వేర్అప్‌డేట్‌,ఎటువంటి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లకు లైసెన్స్ పరిమితం అవుతుంది అన్న అంశాలకు సంబంధించి ఉత్పత్తిదారులు పూర్తి సమాచారాన్ని, వివరాలను కొనుగోలుదారులకు అందించాల్సిన అవసరం  ఉందని కమిటీ స్పష్టం చేసింది.    పరికరం తయారీలో ఉపయోగించిన భాగాలు, పరికరాల సర్వీస్ కోసం అవసరమైన పరికరాలకు సంబంధించిన పూర్తి వివరాలను థర్డ్ పార్టీకి తయారీదారులు అందించాలని కమిటీ స్పష్టం చేసింది. దీనివల్ల చిన్నచిన్న మరమ్మతులను వినియోగదారులు చేసుకోవడానికి వీలవుతుంది. పరికరాలకు అవసరమైన మరమ్మతులు చేసేందుకు అవసరమైన పూర్తి స్థాయి వ్యవస్థ మన దేశంలో అందుబాటులో ఉంది. మరమ్మతులు చేపట్టేందుకు అవసరమైన పరికరాలు, భాగాలు కూడా అందుబాటులో ఉన్నాయి. శిక్షణ పొందిన వారు కూడా ఉండడం వల్ల మరమ్మతుల రంగం దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక రంగంగా గుర్తింపు పొందింది. 

అంతర్జాతీయంగా విదేశాల్లో అమలు జరుగుతున్న విధానాలు కమిటీ సమావేశంలో చర్చకు వచ్చాయి. ఈ విధానాలను దేశంలో ఏమేరకు అమలు చేయవచ్చుననే అంశాన్ని కూడా సమావేశం చర్చించింది. అమెరికా, యూకే, యూరప్ దేశాల్లో ఇప్పటికే మరమ్మతుల హక్కు అమలులో ఉంది. 

USAలోఫెడరల్ ట్రేడ్ కమీషన్ తయారీదారులను అన్యాయమైన పోటీ వ్యతిరేక పద్ధతులను పరిష్కరించమని ఆదేశించింది మరియు వినియోగదారులు స్వయంగా లేదా థర్డ్-పార్టీ ఏజెన్సీ ద్వారా మరమ్మతులు చేసుకోవచ్చని నిర్ధారించుకోవాలని వారిని కోరింది.

 తయారీదారులను అన్యాయమైన పోటీ వ్యతిరేక పద్ధతులు మార్చుకోవాలని,   వినియోగదారులు స్వయంగా లేదా థర్డ్-పార్టీ ఏజెన్సీ ద్వారా మరమ్మతులు చేసుకునే అధికారం కలిగి ఉండాలని అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్  ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. 

స్వయంగా లేదా స్థానిక దుకాణాల్లో  మరమ్మతులు చేసుకునేందుకు వీలుగా విడి భాగాలు అందించాలని ఎలక్ట్రానిక్ ఉపకరణ తయారీదారులకు ఇటీవల యూకే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రిపేర్ కేఫ్‌లు ఆస్ట్రేలియన్ వ్యవస్థ అంతర్భాగంగా ఉన్నాయి. మరమ్మతుల రంగంలో ఉన్నవారు సమావేశమై  మరమ్మత్తు నైపుణ్యాలను పంచుకోవడానికి సమావేశమయ్యే ఉచిత సమావేశ స్థలాలుగా   రిపేర్ కేఫ్‌లు పనిచేస్తున్నాయి. యూరోపియన్ యూనియన్ 10 సంవత్సరాల పాటు ప్రొఫెషనల్ రిపేర్‌మెన్‌లకు ఉత్పత్తుల భాగాలను తయారీదారులు సరఫరా చేయాలని చట్టాన్ని ఆమోదించింది.

పర్యావరణహిత జీవనశైలికి దారి తీసే కార్యక్రమాన్ని 'లైఫ్'  పేరిట గత నెలలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు.  వివిధ వినియోగదారుల ఉత్పత్తులను పునర్వినియోగం మరియు రీసైక్లింగ్ దీనిలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. మరమ్మత్తు అనేది అన్ని రకాల పునర్వినియోగం మరియు ఉత్పత్తుల జీవన కాలాన్ని ఎక్కువ చేయడానికి సహకరిస్తుంది.  మరమ్మత్తు చేయలేని లేదా నిర్ణీత కాలం తర్వాత పనిచేయని పరికరాన్ని  ఉత్పత్తి చేయడం  అంటే ఇ-వ్యర్థాలను ఉత్పత్తి చేయడం లేదా  తప్పనిసరిగా కొత్త ఉత్పత్తులను కొనుగోలు చేసేలా వినియోగదారులను బలవంతం చేయడం అవుతుంది.  అందువల్లఉత్పత్తుల మరమ్మత్తులు పరిమితం చేయడం వలన వినియోగదారులు తప్పనిసరిగా అదే ఉత్పత్తి లేదా  కొత్త మోడల్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 

కొనుగోలు చేసిన ఉత్పత్తి/ పరికరాన్ని సజావుగా సక్రమంగా వినియోగించాలని పర్యావరణహిత జీవన శైలి సూచిస్తుంది. ఒక వస్తువును కొనుగోలు చేసిన వ్యక్తి దానిపై పూర్తి హక్కు అధికారం కలిగి ఉండాలని  "మరమ్మత్తు హక్కు" ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. కొనుగోలు చేసి సొంతం చేసుకున్న వస్తువుల వినియోగంపై ప్రజలు పూర్తి అధికారం కలిగి ఉండాలి. ఎటువంటి ఆంక్షలు, నియంత్రణ లేకుండా వాటిని ఉపయోగించడం, అవసరమైన మరమ్మతులను   సహేతుకమైన ఖర్చుతో చేసుకునే స్వేచ్ఛ కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. మరమ్మతులపై ఉత్పత్తిదారులు ఎటువంటి నియంత్రణ, పరిమితులు విధించకూడదు. అయితే, గత కొంతకాలంగా ఉత్పత్తిదారులు ఆంక్షలు, నియంత్రణ తో 'మరమ్మత్తు హక్కు' ను పరిమితం చేసి హక్కులు  హరిస్తున్నారని గుర్తించారు. ఆంక్షల వల్ల మరమ్మత్తులో గణనీయమైన జాప్యం జరగడమే కాకుండా కొన్ని సమయాల్లో ఉత్పత్తులు అధిక ధరలు వసూలు చేసి మరమ్మత్తు చేస్తున్నారని కమిటీ గుర్తించింది.  ఉత్పత్తిని కొనుగోలు చేసిన వినియోగదారునికి    ఎటువంటి ఎంపిక స్వేచ్ఛ ఉండడం  లేదు. తరచు విడి భాగాలు అందుబాటులో ఉండవు ఇది వినియోగదారులకు తీవ్ర వేదనకు, వేధింపులు కలిగిస్తుంది.

***



(Release ID: 1841667) Visitor Counter : 315