ప్రధాన మంత్రి కార్యాలయం

జపాన్ పూర్వ ప్రధాని శ్రీ ఆబే శింజోశోచనీయ మరణం పట్ల తీవ్ర దు:ఖాన్ని మరియు దిగ్భ్రాంతి ని వ్యక్తం చేసిన ప్రధానమంత్రి


శ్రీ ఆబే శింజో కు గొప్ప గౌరవం గా2022 జులై 09వ తేదీ నాడు జాతీయ సంతాపదినం గా పాటించడం జరుగుతుందని ప్రకటించినప్రధాన మంత్రి

Posted On: 08 JUL 2022 3:52PM by PIB Hyderabad

జపాన్ పూర్వ ప్రధాని శ్రీ ఆబే శింజో శోచనీయ మరణం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దు:ఖాన్ని మరియు దిగ్భ్రాంతి ని వ్యక్తం చేశారు. శ్రీ ఆబే తో తనకు స్నేహం, అనుబంధం ఉండేవన్న సంగతి ని కూడా శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖం గా ప్రస్తావించడం తో పాటు గా, భారతదేశం-జపాన్ సంబంధాల ను ఒక ప్రత్యేక వ్యూహాత్మక మరియు ప్రపంచ భాగస్వామ్య స్థాయి కి శ్రీ ఆబే ఉన్నతీకరించారని కూడా శ్రీ మోదీ పేర్కొన్నారు. శ్రీ ఆబే శింజో కు ఎనలేని గౌరవాన్ని చాటుతూ 2022 జులై 9వ తేదీ ని ఒక రోజు పాటు జాతీయ సంతాప దినం గా పాటించడం జరుగుతుంది అని కూడా శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. టోక్యో లో శ్రీ ఆబే శింజో తో క్రితం సారి భేటీ అయినప్పటి ఒక ఛాయాచిత్రాన్ని కూడా ప్రధాన మంత్రి శేర్ చేశారు.

ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో

‘‘నాకు అత్యంత ప్రియమైనటువంటి మిత్రులలో ఒకరైన శ్రీ శింజో ఆబే శోచనీయ మరణానికి గురి అయిన సందర్భం లో నేను మాటల లో వ్యక్తపరచలేనంత గా దు:ఖించాను; నేను స్తబ్ధుడి ని అయ్యాను. ఆయన ఒక సమున్నతమైనటువంటి ప్రపంచ శ్రేణి రాజనీతిజ్ఞుడు, ఉత్కృష్ట నేత యే కాక ఒక యోగ్య పరిపాలకుడు కూడాను. జపాన్ ను తీర్చిదిద్దడం కోసం, అలాగే ప్రపంచాన్ని ఉత్తమమైందిగా మలచడం కోసం ఆయన తన జీవితాన్ని సమర్పణం చేసివేశారు.’’

‘‘శ్రీ ఆబే తో నా అనుబంధం అనేక సంవత్సరాల క్రిందటిది. గుజరాత్ కు ముఖ్యమంత్రి గా నేను ఉన్న కాలం నాటి నుంచి ఆయన తో నాకు పరిచయం ఉంది; మరి నేను ప్రధాన మంత్రి అయిన తరువాతా మా స్నేహం కొనసాగింది. ఆర్థిక వ్యవస్థ పట్ల మరియు ప్రపంచ వ్యవహారాల పట్ల ఆయన కు గల నిశితమైనటువంటి అంతర్ దృష్టి నా మీద ఎల్లవేళ లా ఒక బలమైన ముద్ర ను వేసింది.’’

‘‘ఇటీవలే జపాన్ కు నేను వెళ్లిన కాలం లో శ్రీ ఆబే ను మరొక సారి కలుసుకొని, అనేక విషయాల పై చర్చించే అవకాశం నాకు లభించింది. ఆయన ఎప్పటి మాదిరి గానే సమయస్ఫూర్తి తోను, అంతర్ దృష్టి యుక్తం గాను నడుచుకొన్నారు. అదే మా చివరి సమావేశం అవుతుందని నేను అనుకోనేలేదు. ఆయన కుటుంబానికి మరియు జపాన్ ప్రజానీకానికి నేను నా హృద‌య‌పూర్వక సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను.’’

‘‘భారతదేశం జపాన్ సంబంధాల ను ఒక ప్రత్యేక వ్యూహాత్మక మరియు ప్రపంచ శ్రేణి భాగస్వామ్యం స్థాయి కి ఉన్నతీకరించడానికి శ్రీ ఆబే అందించినటువంటి తోడ్పాటు ఎనలేనిది. ఈ రోజు న, యావత్తు భారతదేశం జపాన్ తో కలసి దు:ఖిస్తున్నది; అంతేకాక, ఈ కఠినమైన ఘడియ లో మనం మన జపాన్ సోదరీమణుల మరియు సోదరుల వెన్నంటి నిలబడుతున్నాం.’’

‘‘పూర్వ ప్రధాని శ్రీ ఆబే శింజో అంటే మాకు ఉన్నటువంటి అపారమైన గౌరవానికి గుర్తు గా 2022వ సంవత్సరం జులై 9వ తేదీ నాడు ఒక రోజు జాతీయ సంతాప దినం గా పాటించడం జరుగుతుంది.’’

‘‘నా ప్రియ మిత్రుడు శ్రీ శింజో ఆబే తో టోక్యో లో నేను ఈ మధ్యనే జరిపిన భేటీ తాలూకు ఒక చిత్రాన్ని ఇదుగో శేర్ చేస్తున్నాను. భారతదేశం- జపాన్ సంబంధాల ను బలపరచడం కోసం ఎల్లప్పుడూ ఉద్వేగభరితం గా ఉండే శ్రీ ఆబే, జపాన్-ఇండియా అసోసియేశన్ కు చైర్ మన్ గా పదవీబాధ్యతల ను ఇటీవలే స్వీకరించారు.’’ అని పేర్కొన్నారు.

 

*****

DS/TS

 (Release ID: 1840168) Visitor Counter : 134