మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మిషన్ వాత్సల్య పథకానికి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసిన మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

प्रविष्टि तिथि: 07 JUL 2022 2:23PM by PIB Hyderabad

 

పిల్లల సంక్షేమం మరియు పునరావాసం కోసం గతంలో బాలల రక్షణ సేవల పధకంగా అమలు జరిగిన  పథకాన్ని మహిళా  మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2009-10 నుంచి కేంద్ర ప్రాయోజిత పథకంగా   “మిషన్ వాత్సల్య   పథకాన్ని అమలు చేస్తోంది.    భారతదేశంలోని ప్రతి బిడ్డకు ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన బాల్యాన్ని అందించడం లక్ష్యంగా మిషన్ వాత్సల్య అమలు జరుగుతోంది. పిల్లల  పూర్తి సామర్థ్యాన్ని గుర్తించి అన్ని రంగాల్లో  అన్ని విధాలుగా వారు  అభివృద్ధి సాధించేందుకు పథకం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. పిల్లలు సుస్థిర అభివృద్ధి సాధించేందుకు అవసరమైన పరిస్థితులు కల్పించడం,  జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015  నిబంధనలు పూర్తిగా అమలు జరిగేలా చూసిఎస్డీజీ  లక్ష్యాలను సాధించడంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు మిషన్ సహకారం అందిస్తుంది. పిల్లల్లో మార్పు తెచ్చేందుకు    క్లిష్ట పరిస్థితుల్లో సంస్థలతో సంబంధం లేకుండా  కుటుంబ ఆధారిత సంస్థీకరణ సూత్రం ఆధారంగా మిషన్ వాత్సల్య చివరి ప్రయత్నంగా  సంరక్షణను ప్రోత్సహిస్తుంది.

 

 చట్టబద్ధమైన సంస్థల పనితీరును మెరుగు పరచడం,  లోపాలు లేకుండా  సేవలను అందించే వ్యవస్థను  బలోపేతం చేయడం,  ఉన్నత స్థాయి సంస్థాగత సంరక్షణ/సేవలుసంస్థలతో సంబంధం లేకుండా సమాజ భాగస్వామ్యంతో  సంరక్షణ చర్యలను ప్రోత్సహించడం,  అత్యవసర ఔట్రీచ్ సేవలుశిక్షణ మరియు సామర్థ్యం పెంపుదల అంశాలతో “మిషన్ వాత్సల్య” అమలవుతోంది. 

పథకం అమలు కోసం మంత్రిత్వ శాఖతో అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు  మెమోరాండం ఆఫ్ అండర్‌టేకింగ్ పై సంతకం చేశాయి. కేంద్ర ప్రాయోజిత పథకంగా కేంద్రం మరియు రాష్ట్ర/కేంద్ర పాలిత ప్రాంతాల  ప్రభుత్వాల మధ్య నిర్దేశిత వ్యయ భాగస్వామ్య నిష్పత్తి ప్రకారం మిషన్ వాత్సల్య  అమలు చేయబడుతుంది.

మిషన్ వాత్సల్య పథకం అమలుకు సంబంధించి మంత్రిత్వ శాఖ  వివరణాత్మక మార్గదర్శకాలను జారీ చేసింది.      మిషన్ వాత్సల్య పథకం  మార్గదర్శకాల ఆర్థిక నిబంధనల ఆధారంగా 2022-23 సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికలు మరియు ఆర్థిక ప్రతిపాదనలు  సిద్ధం చేయాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది.   01 ఏప్రిల్, 2022 నుంచి మిషన్ వాత్సల్య పథకం నిబంధనలు వర్తిస్తాయి.

మిషన్ వాత్సల్య పథకం  వివరణాత్మక మార్గదర్శకాలు  

https://wcd.nic.in/acts/ guidelines-mission-vatsalya లో అందుబాటులో ఉన్నాయి:

***


(रिलीज़ आईडी: 1839886) आगंतुक पटल : 1992
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam