ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జులై 8న ఒకటో ‘‘అరుణ్ జెట్ లీ స్మారకోపన్యాసం’’ కార్యక్రమాని కి హాజరు కానున్న ప్రధానమంత్రి


‘కౌటిల్యఇకనామిక్ కాన్ క్లేవ్’ లో పాల్గొనే ప్రతినిధుల తో కూడా ప్రధానమంత్రి భేటీ కానున్నారు

Posted On: 07 JUL 2022 11:43AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం జులై 8వ తేదీ నాడు సాయంత్రం 6:30 గంటల కు న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో జరిగే ఒకటో ‘‘అరుణ్ జెట్ లీ స్మారకోపన్యాసం’’ (ఎజెఎమ్ఎల్) కార్యక్రమం లో పాలుపంచుకోనున్నారు. ఇదే కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగిస్తారు కూడాను.

సింగపూర్ ప్రభుత్వం లో సీనియర్ మంత్రి అయిన శ్రీ థర్ మన్ షణ్ ముగరత్నమ్ ‘‘గ్రోథ్ థ్రూ ఇన్ క్లూసివిటీ, ఇన్ క్లూసివిటీ థ్రూ గ్రోథ్’’ అంశం పై ఈ ఒకటో ఎజెఎమ్ఎల్ లో ప్రధానోపన్యాసాన్ని ఇస్తారు. ఉపన్యాసం ముగిసిన తరువాత ఒఇసిడి సెక్రట్రి- జనరల్ శ్రీ మాథియాస్ కార్మన్ మరియు కొలంబియా యూనివర్సిటి ప్రొఫెసర్ శ్రీ అరవింద్ పన్ గఢియా ల ఆధ్వర్యం లో పానెల్ చర్చ ఉంటుంది.

దేశ ప్రజల కు శ్రీ అరుణ్ జెట్ లీ అందించినటువంటి అమూల్యమైన తోడ్పాటు కు గుర్తింపు ను ఇచ్చే క్రమం లో ఒకటో అరుణ్ జెట్ లీ స్మారకోపన్యాసాన్నిఆర్థిక మంత్రిత్వ శాఖ లోని ఆర్థిక వ్యవహారాల విభాగం ఏర్పాటు చేసింది.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరుగనున్న కౌటిల్య ఇకానామిక్ కాన్ క్లేవ్లో పాల్గొనే ప్రతినిధుల తో కూడా మాట్లాడుతారు. ప్రధాన మంత్రి కలుసుకొనే ప్రముఖ ఆర్థికవేత్తల లో జాన్ హాప్ కిన్స్ యూనివర్సిటీ కి చెందిన ఏనీ క్రూయెగర్ గారు; లండన్ స్కూల్ ఆఫ్ ఇకనామిక్స్ కు చెందిన శ్రీ నికోలస్ స్టర్న్; హార్వర్డ్ కెనెడీ స్కూల్ కు చెందిన శ్రీ రాబర్ట్ లారెన్స్; ఐఎమ్ఎఫ్ పూర్వ తాత్కాలిక మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ జాన్ లిప్ స్కీ; ప్రపంచ బ్యాంకు తరఫు న భారతదేశాని కి కంట్రీ డైరెక్టర్ శ్రీ జునైద్ అహమద్ తదితరులు ఉన్నారు. కెఇసి ని ఆర్థిక మంత్రిత్వ శాఖ అందించే సమర్ధన తో ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఇకనామిక్ గ్రోథ్ నిర్వహిస్తున్నది.

 

***


(Release ID: 1839832) Visitor Counter : 196