ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
మైగవ్ గుజరాత్- 18వ మైగవ్ స్టేట్ ఇన్‌స్టెన్స్ నేడు ప్రారంభించబడింది
6.67 కోట్ల మంది గుజరాతీలకు దేశ నిర్మాణానికి మరింత సహకారం అందించడానికి ఈ వేదిక శక్తినిస్తుంది
Posted On:
06 JUL 2022 11:29AM by PIB Hyderabad
మైగవ్ గుజరాత్, 18వ మైగవ్ గుజరాత్ ఈరోజు ప్రారంభించబడింది. ఈ పౌర కేంద్రీకృత వేదిక 4 ముఖ్య లక్ష్యాలతో ప్రారంభించబడింది –
- వర్షపు నీటిని ఆదా చేయడం మరియు నీటి పొదుపు చిట్కాలను పంచుకోవడంపై చర్చా వేదిక.
- ఈ-గవర్నెన్స్ ద్వారా ఈజ్ ఆఫ్ లివింగ్ పై చర్చా వేదిక.
- స్వచ్ఛతా అభియాన్‌పై పోల్.
- మైగవ్ గుజరాత్ ప్లాట్‌ఫారమ్ 6.67 కోట్ల మంది గుజరాతీలకు దేశ నిర్మాణానికి మరింత సహకారం అందించడానికి అవకాశం ఇస్తుంది.
ప్రభుత్వాన్ని సామాన్యులకు మరింత చేరువ చేయాలనే ఆలోచనతో 26 జూలై 2014న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అతిపెద్ద పౌర వేదిక అయిన మైగవ్‌ను ప్రారంభించారు. మైగవ్ పౌరుల ఆలోచనలు మరియు సూచనలను అందించడానికి మరియు భాగస్వామ్య పాలనను వాస్తవంగా చేయడానికి అనుమతించే వేదికగా అభివృద్ధి చెందింది.
నేడు మైగవ్ ప్లాట్‌ఫారమ్ -మైగవ్‌సాథీస్‌లో 2.5 కోట్లకు పైగా నమోదిత వినియోగదారులు ఉన్నారు. వీరు వివిధ విధాన సమస్యలపై ఆలోచనలు మరియు సూచనలను చురుకుగా పంచుకుంటారు మరియు ప్రభుత్వ పథకాలు మరియు కార్యక్రమాలకు సంబంధించిన క్విజ్ పోటీలు, హ్యాకథాన్‌లు, పోటీలు వంటి బహుళ కార్యకలాపాలలో కూడా పాల్గొంటారు.
మైగవ్ భారతీయ యువతలో జనాదరణ పొందిన దాదాపు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ఉంది. ముఖ్యంగా మన దేశంలోని సుదూర మూలల నుండి వారు కోవిడ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. సరైన మరియు సమయానుకూల సమాచారాన్ని వ్యాప్తి చేయడం ద్వారా మైగవ్.ఇన్‌కి మద్దతు ఇచ్చారు.
మన స్వదేశీ చాట్‌బాట్, మైగవ్ హెల్ప్‌డెస్క్, యువకులు మరియు పెద్దలు అనే తేడా లేకుండా చాలా ప్రజాదరణ పొందింది. కొవిన్ మరియు ఇటీవల డిజిలాకర్ యాప్‌తో సహా అనేక ప్రభుత్వ సేవలతో అనుసంధానించబడింది.
కొద్దిరోజుల క్రితం ప్రధాని చెప్పినట్టు "సాంకేతికతను మరింత అందుబాటులోకి తీసుకురావడం ద్వారా డిజిటల్ ఇండియా ప్రజలను శక్తివంతం చేసింది."
*****
(Release ID: 1839523)
Visitor Counter : 157