సహకార మంత్రిత్వ శాఖ

100వ అంతర్జాతీయ సహకార దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా కేంద్ర హోం శాఖ సహకార మంత్రి శ్రీ అమిత్ షా


100వ అంతర్జాతీయ సహకార దినోత్సవ ఇతివృత్తం “ఆత్మనిర్భర్ భారత్‌ను, మెరుగైన ప్రపంచాన్ని నిర్మిస్తున్న సహకార సంస్థలు”

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, కేంద్ర ప్రభుత్వం 'సహకార్ సే సమృద్ధి' మంత్రంతో సహకార రంగానికి సాధికారత కల్పిస్తోంది.


ఇటీవల కేంద్ర మంత్రివర్గం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్) కంప్యూటరీకరణను ఆమోదించడం ద్వారా సహకార రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.

Posted On: 03 JUL 2022 11:10AM by PIB Hyderabad

కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ మరియు నేషనల్ కోఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా (NCUI) సంయుక్తంగా జూలై 4న నిర్వహించే 100వ అంతర్జాతీయ సహకార దినోత్సవ వేడుకలకు కేంద్ర హోం మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో. ఎన్‌సీయూఐ భారతదేశంలో సహకార ఉద్యమం యొక్క అత్యున్నత సంస్థ. ఇది సహకార విద్య, శిక్షణపై దృష్టి సారిస్తుంది

100వ అంతర్జాతీయ సహకార దినోత్సవం యొక్క ఇతివృత్తం మెరుగైన ప్రపంచం కోసం సహకార సంఘాలు”. మెరుగైన ప్రపంచాన్ని సృష్టించడంలో ఆత్మనిర్భర్ భారత్ యొక్క ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుని, సహకార మంత్రిత్వ శాఖ మరియు ఎన్‌సీయూఐ  "ఆత్మనిర్భర్ భారతాన్ని, మెరుగైన ప్రపంచాన్ని నిర్మించే సహకార సంస్థలు" అనే అంశంపై  కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఆత్మనిర్భర్ భారత్ యొక్క ప్రాథమిక భావన, దృష్టి భారత ఆర్థిక వ్యవస్థ యొక్క స్వీయ-స్థిరమైన వృద్ధిపై ఆధారపడింది; భారతదేశ సహకార నమూనా ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించడంలో భారత ప్రభుత్వం యొక్క అలోచనలకు అనుగుణంగా నిర్మించబడింది.

 

భారతదేశంలో సహకార ఉద్యమం ప్రపంచంలోనే అతిపెద్దది. ప్రస్తుతం, భారతదేశంలోని 90 శాతం గ్రామాలను కలుపుతూ 8.5 లక్షల నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నాయి. సహకార సంఘాలు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో సమ్మిళిత వృద్ధికి సామాజిక-ఆర్థిక అభివృద్ధిని తీసుకురావడానికి కీలకమైన సంస్థలు. AMUL, IFFCO, KRIBHCO, NAFED, మొదలైనవి భారతదేశంలో సహకార ఉద్యమం యొక్క కొన్ని ప్రసిద్ధి చెంది విజయవంతమైన సంస్థలు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో సహకార రంగానికి సరైన ప్రోత్సాహాన్ని అందించడానికి, కేంద్ర ప్రభుత్వం జూలై 2021లో సహకార మంత్రిత్వ శాఖను రూపొందించింది. కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షాకు కొత్తగా ఏర్పడిన సహకార మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించబడ్డాయి.  మంత్రిత్వ శాఖ ఏర్పడిన అనంతరం, కొత్త సహకార విధానం మరియు పథకాల రూపకల్పనపై పని చేస్తోంది. కేంద్రమంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో సహకార సంఘాలలో నిరంతరం పురోగతి సాధిస్తోంది.

సహకార రంగంలో దేశంలోని రైతులు, వ్యవసాయం మరియు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, సాధికారానికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. అందుకే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం 'సహకార్ సే సమృద్ధి' మంత్రంతో సహకార రంగానికి సాధికారత కల్పిస్తోంది.

ప్రాథమిక రైతు రుణ సంఘాల సామర్థ్యాన్ని పెంచడం, వాటి కార్యకలాపాలలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావాలనే లక్ష్యంతో ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాల (PACS) కంప్యూటరీకరణను ఆమోదించడం ద్వారా సహకార రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది; పీఎసీఎస్ ల  వ్యాపారాన్ని విస్తరించేందుకు మరియు బహుళ కార్యకలాపాలు/సేవలను చేపట్టేందుకు ఈ కేబినెట్ నిర్ణయం వీలు కల్పిస్తుంది. ఈ ప్రాజెక్ట్ 5 సంవత్సరాల వ్యవధిలో సుమారు 63,000 ప్రస్తుతం అందుబాటులో ఉన్న సంఘాల యొక్క కంప్యూటరీకరణను చేస్తుంది. ఇందుకోసం కేటాయించిన మొత్తం బడ్జెట్ వ్యయం రూ. 2,516 కోట్లు.

సహకార సంస్థలు జూలై 2న ప్రపంచవ్యాప్తంగా 100వ అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని (CoopsDay) జరుపుకోనున్నాయి. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ సహకార దశాబ్దిగా 2012- 2022 వరకు ప్రకటించింది. ఇది సహకార సూత్రాలు మరియు విలువలతో ప్రేరణ పొందిన మానవ-కేంద్రీకృత వ్యాపార నమూనాకు కట్టుబడి ప్రపంచ సహకార సంస్థల యొక్క ప్రత్యేక సహకారాన్ని ప్రదర్శిస్తుంది. అంతర్జాతీయ సహకార దినోత్సవం యొక్క లక్ష్యం సహకార సంఘాలపై అవగాహన పెంచడం మరియు అంతర్జాతీయ సంఘీభావం, ఆర్థిక సామర్థ్యం, సమానత్వం మరియు ప్రపంచ శాంతికి సంబంధించిన ఉద్యమ ఆదర్శాలను ప్రోత్సహించడం. సహకార సంస్థలు ఉపాధి పొందిన జనాభాలో 10 శాతం మందికి ఉద్యోగాలను అందిస్తాయి. 300 అతిపెద్ద సహకార సంస్థలు లేదా ఉమ్మడిగా 2,146 యూఎస్ బిలియన్ల టర్నోవర్‌ను ఉత్పత్తి చేస్తాయి.

కేంద్ర పాడి పరిశ్రమ మరియు మత్స్యశాఖ మంత్రి శ్రీ పుర్షోత్తం రూపాలా, సహకార శాఖ సహాయ మంత్రి శ్రీ బి.ఎల్. వర్మ, ICA-AP అధ్యక్షుడు డాక్టర్ చంద్ర పాల్ సింగ్ ఈ వేడుకలకు హాజరు కానున్నారు. ఈ సమావేశానికి NCUI అధ్యక్షుడు దిలీప్ సంఘాని అధ్యక్షత వహిస్తారు.

**********



(Release ID: 1838944) Visitor Counter : 268