రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

టైర్ రోలింగ్ నిరోధకత, వెట్ గ్రిప్, రోలింగ్ సౌండ్ కోసం నోటిఫికేషన్ విడుదల

Posted On: 01 JUL 2022 1:01PM by PIB Hyderabad

కేంద్ర మోటార్ వెహికల్స్ రూల్స్ 1989లోని రూల్ 95ను సవరిస్తూ రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ జూన్ 282022న  నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ 142:2019లో నిర్వచించబడిన ప్రకారం  ఇది క్లాస్ C1 (ప్యాసింజర్ కార్లు), C2 (తేలికపాటి ట్రక్) మరియు C3 (ట్రక్ మరియు బస్సు) కింద వచ్చే టైర్‌లకు రోలింగ్ రెసిస్టెన్స్వెట్ గ్రిప్ మరియు రోలింగ్ సౌండ్ విడుదలను తప్పనిసరి చేస్తుంది. ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ పేర్కొన్న విధంగాఈ టైర్లు వెట్ గ్రిప్ అవసరాలు మరియు రోలింగ్ రెసిస్టెన్స్ మరియు రోలింగ్ సౌండ్ ఎమిషన్స్ యొక్క స్టేజ్ 2 పరిమితులకు అనుగుణంగా ఉండాలి. ఈ నియంత్రణతోభారతదేశం యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ కమిషన్ ఫర్ యూరోప్ నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది.

 టైర్ల రోలింగ్ నిరోధకత ఇంధన సామర్థ్యంపై ప్రభావం చూపుతుందివెట్ గ్రిప్ పనితీరు తడి పరిస్థితులలో టైర్ల బ్రేకింగ్ పనితీరును ప్రభావితం చేస్తుంది మరియు వాహన భద్రతను ప్రోత్సహిస్తుంది. రోలింగ్ సౌండ్ ఎమిషన్ అనేది చలనంలో ఉన్న టైర్లు మరియు రహదారి ఉపరితలం మధ్య జరిగే రాపిడి నుండి వెలువడే ధ్వనికి సంబంధించినది.

Click here for gazette notification

***(Release ID: 1838609) Visitor Counter : 150