ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అమర్ నాథ్ యాత్రను ఘనంగా విజయవంతం చేసేందుకు పలు చర్యలు చేపట్టిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ


భక్తులకు ఆరోగ్య సేవల కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండింటి నుండి వైద్య నిపుణుల అందుబాటు

డి ఆర్ డీ ఓ సాయంతో బల్తాల్, చందన్వారి వద్ద ఇన్ డోర్ సదుపాయంగా రెండు 50 పడకల ఆస్పత్రుల ఏర్పాటు

Posted On: 30 JUN 2022 4:29PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఆదేశాల మేరకు, సుప్రీంకోర్టు సూచనలకు అనుగుణంగా అమర్ నాథ్ జీ యాత్ర  భక్తులకు  పటిష్టమైన ఆరోగ్య సేవలు అందించడానికి వివిధ చర్యలు చేపట్టారు.శ్రీ అమర్ నాథ్ జీ యాత్ర 2022 జూన్ 30 న ప్రారంభమై 2022 ఆగస్టు 11 న ముగుస్తుంది.

జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రభుత్వ ప్రయత్నాలకు అనుబంధంగా, ప్రత్యేకించి పెద్ద సంఖ్యలో యాత్రికులు వచ్చే రాష్ట్రాల ద్వారా స్పెషలిస్ట్ డాక్టర్లు, అలాగే జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు (జిడిఎంఓలు) సేవలతో సహా వైద్య సన్నద్ధత తో పాటు అవసరమైన ఏర్పాట్ల గురించి రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియచేశారు.

భక్తులకు ఆరోగ్య సేవలను అందించడానికి దిగువ పేర్కొన్న కార్యక్రమాలు చేపట్టారు.

అత్యవసర వైద్య  సేవలు అందించడానికి డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందితో సహా ఆరోగ్య నిపుణులను బ్యాచ్ లుగా నియమిస్తారు. మొదటి బ్యాచ్ 2022 జూన్ 25 నుంచి 2022 జూలై 13 వరకు పనిచేస్తుంది. రెండవ, మూడవ బ్యాచ్ లు  11 జూలై 2022 నుండి 28 జూలై 2022 వరకు, 26 జూలై 2022 నుండి 2022 ఆగస్టు 11 వరకు పనిచేస్తాయి. కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులు , సిజిహెచ్ఎస్ నుండి వైద్య నిపుణులee బ్యాచ్ లను సిద్ధం చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రులు, సీజీహెచ్ఎస్ నుంచి 155 మంది వైద్య సిబ్బంది (87 మంది వైద్యులు, 68 మంది పారామెడికల్ సిబ్బంది) కావాలని జమ్మూకశ్మీర్ ప్రభుత్వం డైరెక్టర్ హెల్త్ సర్వీసెస్ (డీహెచ్ఎస్ కశ్మీర్) ద్వారా కోరింది.

కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులు, సీజీహెచ్ఎస్ నుంచి మొత్తం 176 నామినేషన్లు (115 మంది వైద్యులు, 61 మంది పారామెడికల్ సిబ్బంది) వచ్చాయి.తదుపరి మోహరింపు కోసం పూర్తి జాబితాను డిహెచ్ఎస్ కాశ్మీర్ కు తెలియజేశారు.

11 రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాల నుండి వైద్య నిపుణులను (వైద్యులు మరియు పారామెడికల్ సిబ్బంది) నియమిస్తున్నారు.

11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల (ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర) నుంచి 437 మంది వైద్య సిబ్బంది (154 మంది వైద్యులు, 283 మంది పారామెడికల్ సిబ్బంది) కావాలని జమ్మూకశ్మీర్ ప్రభుత్వం డైరెక్టర్ హెల్త్ సర్వీసెస్ (డీహెచ్ఎస్ కాశ్మీర్) ద్వారా కోరింది

మొత్తం 9 రాష్ట్రాల నుంచి 433 నామినేషన్లు (214 మంది వైద్యులు, 219 మంది పారామెడికల్ సిబ్బంది) వచ్చాయి. ఈ మూడు బ్యాచ్ ల  కోసం ఇప్పటికే 428 మంది వైద్య సిబ్బందిని (211 మంది వైద్యులు, 217 మంది పారామెడికల్ సిబ్బంది) డిహెచ్ఎస్ (కాశ్మీర్) నియమించింది.

రెండు 50 పడకల ఆసుపత్రులు

బల్తాల్ , చందన్వారి వద్ద ఇన్ డోర్ వైద్య సదుపాయాన్ని పెంచడానికి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఎం ఓ హెచ్ ఎఫ్ డబ్ల్యు) డిఆర్ డిఒ ద్వారా ఏర్పాటు చేస్తోంది.

ఎం ఓ హెచ్ ఎఫ్ డబ్ల్యు అందించిన నిధుల తో డిఆర్ డిఒ 50 పడకల ఆసుపత్రిని బల్తాల్, చాంద్వారీలో ఏర్పాటు చేసింది.

పైన పేర్కొన్న రెండు 50 పడకల ఆసుపత్రులకు అవసరమైన అదనపు సిబ్బంది (యు & కె యుటి నుండి 129 మంది; ఎం ఓ హెచ్ ఎఫ్ డబ్ల్యు నుండి 129 మంది ) ని అందించాలని డి హెచ్ ఎస్ (కాశ్మీర్) కోరింది. ఎమ్ వోహెచ్ ఎఫ్ డబ్ల్యు (కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులు,  సిజిహెచ్ ఎస్ ల ద్వారా,  ఇంకా రాష్ట్రాలు నామినేట్ చేసిన వాటి ద్వారా) అందుబాటులో ఉన్న మిగులు బఫర్ మ్యాన్ పవర్ ను కాశ్మీర్ లోని డిహెచ్ ఎస్ కు మరింత విస్తరణ కొరకు అందుబాటు లో ఉంచారు.

హై ఆల్టిట్యూడ్ అస్వస్థత కు వైద్య సంరక్షణ పై సమగ్ర నోట్

అమర్ నాథ్ జీ యాత్ర 2022 కోసం సమగ్ర సమాచారం, విద్య , కమ్యూనికేషన్ (ఐఈసి) మెటీరియల్ ను తయారు చేశారు. అవసరమైన చర్యల కోసం దీనిని వాటాదారులకు  అందచేశారు.

ఇ సి మెటీరియల్ యాత్రికుల కొరకు చేయదగ్గవి మరియు చేయకూడనివి

యాత్రికులు ఎం చేయవచ్చు- ఏం చేయకూడదు సూచిస్తూ సంక్షిప్త పత్రాన్ని (ఇంగ్లిష్ , హిందీలో) తయారు చేశారు. అవసరమైన చర్యల కోసం దీనిని సంబంధిత భాగస్వాములకు  షేర్ చేశారు. 

ట్రైనర్ ల ట్రైనింగ్ ద్వారా విజయవంతంగా

కెపాసిటీ బిల్డింగ్

హై ఆల్టిట్యూడ్ ఎమర్జెన్సీల కోసం టి ఓ టి (ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్) ప్రోగ్రామ్ ను కూడా 2022 మే 4 నుంచి 6 వరకు కాశ్మీర్ లోని ధోబియావాన్ వద్ద విజయవంతంగా నిర్వహించారు.

భక్తులకు అమర్ నాథ్ దర్శనాన్ని సులభతరం చేయడానికి , మొత్తం యాత్రను గొప్ప విజయంగా మార్చడానికి ఆరోగ్య ,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇతర మంత్రిత్వ శాఖలతో కలిసి కృషి చేస్తోంది.

*****


(Release ID: 1838497) Visitor Counter : 133