ప్రధాన మంత్రి కార్యాలయం
మహారాష్ట్రముఖ్యమంత్రి గా శ్రీ ఏక్ నాథ్ శిందే పదవీప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో ఆయనకు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
ఉప ముఖ్యమంత్రిగా శ్రీ దేవేంద్ర ఫడ్ ణవీస్ పదవీప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో ఆయన కుకూడా అభినందనల ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
Posted On:
30 JUN 2022 8:32PM by PIB Hyderabad
మహారాష్ట్ర ముఖ్యమంత్రి గా శ్రీ ఏక్ నాథ్ శిందే పదవీప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో ఆయన ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
మహారాష్ట్ర ముఖ్యమంత్రి గా శ్రీ @mieknathshinde గారు పదవీప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో ఆయన ను నేను అభినందించదలచుకొన్నాను. క్షేత్ర స్థాయి నాయకుడు గా ఆయన కు రాజకీయపరమైనటువంటి, చట్టసభ కు సంబంధించినటువంటి మరియు పాలనపరమైనటువంటి అనుభవం దండి గా ఉంది. మహారాష్ట్ర ను మరింత ఉన్నతమైన శిఖరాల కు తీసుకుపోయే దిశ లో ఆయన కృషి చేస్తారన్న నమ్మకం నాకుంది.’’ అని పేర్కొన్నారు.
ఉప ముఖ్యమంత్రి గా శ్రీ దేవేంద్ర ఫడ్ ణవీస్ పదవీప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీ దేవేంద్ర ఫడ్ ణవీస్ ను కూడా అభినందించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గా పదవీప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో శ్రీ @Dev_Fadnavis గారి కి ఇవే అభినందన లు. ఆయన ప్రతి ఒక్క బిజెపి కార్యకర్త కు ప్రేరణ గా ఉన్నారు. ఆయన కు గల అనుభవం మరియు ప్రావీణ్యం లు ప్రభుత్వానికి ఒక ఆస్తి గా ఉంటాయి. మహారాష్ట్ర యొక్క అభివృద్ధి పథాన్ని మరింత బలపరుస్తారన్న విశ్వాసం నాలో ఉంది.’’ అని పేర్కొన్నారు.
***
DS/AK
(Release ID: 1838475)
Visitor Counter : 137
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada