ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం

ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(పీఏసీఎస్ ) కంప్యూటీకరణ కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


2516 కోట్ల బడ్జెట్ అంచనాలతో పనిచేస్తున్న 63,000 పీఏసీఎస్ ల కంప్యూటీకరణ .

దాదాపు 13 కోట్ల మంది రైతులకు ప్రయోజనం వీరిలో ఎక్కువ మంది చిన్న, సన్నకారు రైతులు
పారదర్శకత, సామర్థ్యం, విశ్వసనీయతను పెంపొందించి పంచాయతీ స్థాయిలో నోడల్ డెలివరీ సర్వీస్ పాయింట్‌గా మారేందుకు పీఏసీఎస్‌లకు అవకాశం

క్లౌడ్ ఆధారిత యూనిఫైడ్ సాఫ్ట్‌వేర్‌లో సహాయంతో డేటా స్టోరేజీ, సైబర్ సెక్యూరిటీ, హార్డ్‌వేర్, ఇప్పటికే ఉన్న రికార్డుల డిజిటలైజేషన్, నిర్వహణ, శిక్షణ ప్రధాన భాగాలుగా కార్యక్రమం అమలు

Posted On: 29 JUN 2022 3:41PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ  కమిటీ పీఏసీఎస్‌ సామర్థ్యాన్ని పెంచడంవాటి కార్యకలాపాలు పారదర్శకత మరియు జవాబుదారీతనం తీసుకురావాలనే లక్ష్యంతో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్కంప్యూటీకరణ పథకాన్ని ఆమోదించింది.పీఏసీఎస్ వ్యాపార కార్యక్రమాలను విస్తరించి బహుళ కార్యకలాపాలు/సేవలు అందించేందుకు ఈ పథకం  వీలు కల్పిస్తుంది.   అయిదు సంవత్సరాల కాలంలో పనిచేస్తున్న సుమారు 63,000  పీఏసీఎస్ ల   కంప్యూటరీకరణ కోసం పథకాన్ని సిద్ధం చేశారు.  2516 కోట్ల రూపాయల బడ్జెట్  అంచనాలతో పథకం అమలు జరుగుతుంది. మొత్తం బడ్జెట్ లో . 1528 కోట్ల రూపాయలను కేంద్రం తన వాటాగా సమకూరుస్తుంది. 

 దేశంలోని మూడు-అంచెల స్వల్పకాలిక సహకార రుణ వ్యవస్థ లో  ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు దిగువ స్థాయిలో పనిచేస్తున్నాయి. వీటిలో దాదాపు   13 కోట్ల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు.   గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు  కీలక పాత్ర పోషిస్తున్నాయి. . దేశంలోని అన్ని సంస్థలు అందిస్తున్న కేసీసీ  రుణాలలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు వాటా  41 % (3.01 కోట్ల మంది రైతులు)గా ఉంది.  ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ద్వారా  కేసీసీ    రుణాలు పొందుతున్న వారిలో  95 % (2.95 కోట్ల మంది  రైతులు) చిన్న మరియు సన్న కారు రైతులు ఉన్నారు. వ్యవస్థలో  రెండు అంచెలు అనగా. రాష్ట్ర సహకార బ్యాంకులు (ఎస్‌టిసిబిలు) మరియు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (డిసిసిబిలు) పనిచేస్తున్నాయి. నాబార్డ్ ద్వారా ఈ రుండు అంచెల కంప్యూటీకరణ పూర్తయింది.  వీటిని  కామన్ బ్యాంకింగ్ సాఫ్ట్‌వేర్ (CBS) పరిధిలోకి తీసుకుని రావడం జరిగింది. 

అయినప్పటికీప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల కంప్యూటీకరణ    ఇప్పటి వరకు జరగలేదు.  మరియు ఇప్పటికీ ఎక్కువ శాతం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల కార్యక్రమాలు సిబ్బంది ద్వారా జరగడం వల్ల సమర్ధత,  విశ్వసనీయత లోటు ఏర్పడింది. కొన్ని రాష్ట్రాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు  కంప్యూటరీకరణ విడివిడిగా పాక్షికంగా జరిగింది.  సంఘాలు  ఉపయోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌లో ఏకరూపత లేదు మరియు అవి  డిసిసిబిలు,ఎస్‌టిసిబి లతో  అనుసంధానించబడలేదు. కేంద్ర  హోం మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా  సమర్థ మార్గదర్శకత్వంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను కంప్యూటరీకరించాలని మరియు జాతీయ స్థాయిలో ఒక ఉమ్మడి వేదిక పైకి తీసుకురావాలని,వారి రోజువారీ వ్యాపారం. కామన్ అకౌంటింగ్ సిస్టం  కలిగి ఉండాలని ప్రతిపాదించబడింది. 

 కంప్యూటీకరణ వల్ల  ఆర్థిక సమగ్రత కల్పించడంతో పాటు రైతులకు ప్రత్యేకించి చిన్న సన్నకారు రైతులకు అందిస్తున్న వివిధ సేవలు ,  ఎరువులువిత్తనాలు మొదలైన ఇన్‌పుట్‌లను అందించడానికి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు నోడల్ సర్వీస్ డెలివరీ పాయింట్‌గా మారేందుకు  ప్రాజెక్ట్ సహాయం చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటలైజేషన్‌ను మెరుగుపరచడమే కాకుండా బ్యాంకింగ్ కార్యకలాపాలకు అలాగే బ్యాంకింగేతర కార్యకలాపాలకు అవుట్‌లెట్‌లుగా  ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల కార్యకలాపాలు విస్తరిస్తాయి.  ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల  ద్వారా అమలు చేయగల వివిధ ప్రభుత్వ పథకాలను (క్రెడిట్ మరియు సబ్సిడీ ప్రమేయం ఉన్న చోట) చేపట్టేందుకు డిసిసిబిలు వీలవుతుంది.  రుణాలను వేగంగా తక్కువ పరివర్తన వ్యయంతో అందించి  ఆడిట్ మరియు చెల్లింపులు మరియు రాష్ట్రంతో అకౌంటింగ్‌లో అసమతుల్యత తగ్గింపును నిర్ధారిస్తుంది.

సైబర్ భద్రత మరియుసమాచార  నిల్వ కోసం క్లౌడ్ ఆధారిత సాధారణ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయడం,   ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు హార్డ్‌వేర్నిర్వహణ సహకారం  మరియు శిక్షణతో సహా ఇప్పటికే ఉన్న రికార్డుల డిజిటలైజేషన్‌ కార్యక్రమాలు  ప్రాజెక్ట్ కింద అమలు జరుగుతాయి.  ఈ సాఫ్ట్‌వేర్ రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా అనుకూలీకరణ సౌలభ్యంతో స్థానిక భాషలో ఉంటుంది.   కేంద్ర మరియు రాష్ట్ర స్థాయిలలో ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్లు ఏర్పాటు చేయబడతాయి. దాదాపు 200 పిఎసిఎస్‌ల క్లస్టర్‌లో జిల్లా స్థాయిలో సహకారం అందించడం జరుగుతుంది. పీఏసీఎస్‌ల కంప్యూటరీకరణ పూర్తయిన రాష్ట్రాల విషయంలో. సాధారణ సాఫ్ట్‌వేర్‌తో ఏకీకృతం చేసి అమలు చేసేందుకు   వారి హార్డ్‌వేర్ అవసరమైన స్పెసిఫికేషన్‌లకు అనుగుణంగా 1వ ఫిబ్రవరి, 2017 తర్వాత సాఫ్ట్‌వేర్   ప్రారంభించబడితేప్రతి పిఏసిఎస్కి 50,000/- రీయింబర్స్ చేయబడుతుంది

***



(Release ID: 1837965) Visitor Counter : 1836