పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
1 జూలై 2022 నుండి గుర్తించబడిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం
నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల అక్రమ తయారీ, దిగుమతి, నిల్వ, పంపిణీ, అమ్మకం మరియు వినియోగాన్ని తనిఖీ చేయడానికి జాతీయ మరియు రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు
భాగస్వాములందరి ద్వారా సమర్థవంతమైన నిమగ్నత మరియు సంఘటిత చర్యల ద్వారా మాత్రమే నిషేధాన్ని విజయవంతం చేయడం సాధ్యపడుతుంది.
ఎస్.యూ.పి(SUP) లను నిషేధించడంలో ప్రజల భాగస్వామ్యం కీలకం
Posted On:
28 JUN 2022 1:04PM by PIB Hyderabad
2022 కల్లా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను దశలవారీగా తొలగించాలని గౌరవనీయులైన భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు అనుగుణంగా, భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ 2021 ఆగస్టు 12న ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ సవరణ నిబంధనలు, 2021 ను నోటిఫై చేసింది. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' స్ఫూర్తిని ముందుకు తీసుకువెళుతూ, చెత్తాచెదారం మరియు నిర్వహణలో లేని ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కలిగే కాలుష్యాన్ని అరికట్టడానికి దేశం ఒక నిర్ణయాత్మక చర్య తీసుకుంటోంది. 2022 జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా తక్కువ యుటిలిటీ మరియు అధిక లిట్టరింగ్ సామర్ధ్యం కలిగిన గుర్తించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ, దిగుమతి, నిల్వ, పంపిణీ, అమ్మకం మరియు వినియోగాన్ని భారతదేశం నిషేధించనుంది.
సముద్ర పర్యావరణంతో సహా భూసంబంధమైన మరియు జల జీవావరణ వ్యవస్థలపై చెత్తతో నిండిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల ప్లాస్టిక్ వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడ్డాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వల్ల వచ్చే కాలుష్యాన్ని పరిష్కరించడం అనేది అన్ని దేశాలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన పర్యావరణ సవాలుగా మారింది.
2019 లో జరిగిన 4 వ ఐక్యరాజ్యసమితి పర్యావరణ అసెంబ్లీలో, భారతదేశం సింగిల్-యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తుల కాలుష్యాన్ని పరిష్కరించడంపై ఒక తీర్మానాన్ని ప్రయోగాత్మకంగా తీసుకుంది, చాలా ముఖ్యమైన ఈ సమస్యపై ప్రపంచ సమాజం దృష్టి సారించాల్సిన తక్షణ అవసరాన్ని గుర్తించింది. యు.ఎన్.ఇ.ఎ 4 వద్ద ఈ తీర్మానాన్ని ఆమోదించడం ఒక ముఖ్యమైన దశ. 2022 మార్చిలో ఐక్యరాజ్యసమితి పర్యావరణ అసెంబ్లీ 5వ సెషన్లో, ప్లాస్టిక్ కాలుష్యంపై ప్రపంచ చర్యను నడిపించే తీర్మానంపై ఏకాభిప్రాయాన్ని అభివృద్ధి చేయడానికి భారతదేశం అన్ని సభ్య దేశాలతో నిర్మాణాత్మకంగా నిమగ్నమైంది.
చెత్తాచెదారంతో నిండిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించడానికి భారత ప్రభుత్వం దృఢమైన చర్యలు చేపట్టింది. నిషేధిత వస్తువుల జాబితాలో ప్లాస్టిక్ కర్రలతో కూడిన ఇయర్ బడ్స్, బెలూన్లకు ప్లాస్టిక్ కర్రలు, ప్లాస్టిక్ జెండాలు, క్యాండి స్టిక్స్ , ఐస్ క్రీమ్ స్టిక్స్, అలంకరణ కోసం పాలిస్టైరిన్ (థర్మోకోల్), ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్కులు, స్పూన్లు, కత్తులు, స్ట్రా, ట్రేలు, స్వీట్ బాక్సుల చుట్టూ చుట్టడం లేదా ప్యాకింగ్ ఫిల్మ్‌లు, ఆహ్వాన కార్డులు, సిగరెట్ ప్యాకెట్లు, 100 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ లేదా పీవీసీ బ్యానర్లు, స్టిర్రర్లు ఉన్నాయి.
ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సవరణ నిబంధనలు, 2021 ప్రకారం సెప్టెంబర్ 30, 2021 నుండి అమలులోకి వచ్చే విధంగా డెబ్బై ఐదు మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌ల తయారీ, దిగుమతి, నిల్వ, పంపిణీ, అమ్మకం మరియు వాడకాన్ని నిషేధించింది. 31 డిసెంబర్ 2022 నుండి అమలులోకి వచ్చే విధంగా నూట ఇరవై మైక్రాన్ల మందం కంటే తక్కువ మందం కలిగిన వాటిపై నిషేధం ఉంటుంది.
పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాల నిర్వహణ సవరణ నియమాలు, 2022 ప్రకారం ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌పై పొడిగించిన ఉత్పత్తిదారుల బాధ్యతపై మార్గదర్శకాలను ఫిబ్రవరి 16, 2022న తెలియజేసింది. ఎక్స్ టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ (EPR) అనేది ప్రొడక్ట్ జీవితకాలం ముగిసేంత వరకు పర్యావరణపరంగా మంచి నిర్వహణ కొరకు ఒక ప్రొడ్యూసర్ యొక్క బాధ్యత. ప్లాస్టిక్ ప్యాకేజింగ్ వ్యర్థాల వృత్తాకార ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌కు కొత్త ప్రత్యామ్నాయాల అభివృద్ధిని ప్రోత్సహించడానికి మరియు వ్యాపారాల ద్వారా స్థిరమైన ప్లాస్టిక్ ప్యాకేజింగ్ వైపు వెళ్లడానికి తదుపరి దశలను అందించడానికి మార్గదర్శకాలు ఫ్రేమ్‌వర్క్ ను అందిస్తాయి.
సూక్ష్మ,చిన్నమరియు మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ మరియు సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ (సిపెట్) మరియు వాటి రాష్ట్ర కేంద్రాలతో పాటుగా సిపిసిబి / ఎస్ పిసిబిలు / పిసిసిల ప్రమేయంతో నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులకు ప్రత్యామ్నాయాల తయారీకి సాంకేతిక సహాయాన్ని అందించడం కొరకు MSME యూనిట్ ల కొరకు కెపాసిటీ బిల్డింగ్ వర్క్ షాప్ లు నిర్వహించబడుతున్నాయి. నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ నుండి దూరంగా పరివర్తన చెందడంలో అటువంటి సంస్థలకు మద్దతు ఇవ్వడానికి కూడా కూడా నిబంధనలు రూపొందించబడ్డాయి.
భారత ప్రభుత్వం సృజనాత్మకతను ప్రోత్సహించడానికి మరియు దేశవ్యాప్తంగా త్వరితగతిన చొచ్చుకుపోవడానికి మరియు ప్రత్యామ్నాయాల లభ్యతకు ఒక పర్యావరణ వ్యవస్థను అందించడానికి కూడా చర్యలు తీసుకుంది.
1 జూలై 2022 నుండి గుర్తించబడిన ఎస్.యూ.పి(SUP) వస్తువులపై నిషేధాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి, జాతీయ మరియు రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయబడతాయి. నిషేధించబడిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అక్రమ తయారీ, దిగుమతి, నిల్వ, పంపిణీ, అమ్మకం మరియు వినియోగాన్ని తనిఖీ చేయడానికి ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు ఏర్పాటు చేయబడతాయి. నిషేధించబడిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల అంతర్-రాష్ట్ర తరలింపును ఆపడానికి సరిహద్దు చెక్ పాయింట్లను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలను కోరడం జరిగింది.
ప్లాస్టిక్ ముప్పును అరికట్టడంలో పౌరులకు సాధికారత కల్పించడం కొరకు CPCB గ్రీవెన్స్ రిడ్రెసల్ యాప్ ప్రారంభించబడింది. విస్తృత ప్రజావ్యాప్తి కొరకు, ప్రకృతి - మస్కట్ కూడా ఏప్రిల్ 5న ప్రారంభించబడింది.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ అవగాహన ప్రచారంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు మరియు స్టార్టప్‌లు, పరిశ్రమలు, కేంద్ర, రాష్ట్ర మరియు స్థానిక ప్రభుత్వాలు, నియంత్రణ సంస్థలు, నిపుణులు, పౌర సంస్థలు, ఆర్ అండ్ డి మరియు విద్యాసంస్థలు కలిసి వచ్చాయి.
భాగస్వాములందరి సమర్థవంతమైన నిమగ్నత, సమిష్టి చర్యల ద్వారా మరియు ప్రజల ఉత్సాహవంతమైన భాగస్వామ్యం ద్వారా మాత్రమే ఈ నిషేధం తాలూకు విజయం సాధ్యపడుతుందని మంత్రిత్వ శాఖ విశ్వసిస్తోంది.
*****
(Release ID: 1837529)
Visitor Counter : 875
Read this release in:
Hindi
,
Punjabi
,
Gujarati
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Odia
,
Tamil
,
Malayalam