రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
భారత్ ఎన్‌సీఏపీ (న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్)ని ప్రవేశపెట్టేలా ముసాయిదా జీఎస్ఆర్ నోటిఫికేషన్‌కు ఆమోదం తెలిపిన శ్రీ నితిన్ గడ్కరీ
Posted On:
24 JUN 2022 2:57PM by PIB Hyderabad
భారత్ ఎన్‌సీఏపీ (న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్) ప్రవేశపెట్టడానికి సంబంధించిన ముసాయిదా జీఎస్ఆర్ నోటిఫికేషన్‌కు కేంద్రరోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు. దీని ప్రకారం భారతదేశంలోని ఆటో మొబైల్స్ వాహనాలు క్రాష్ టెస్ట్‌లలో ఆవి కనబరిచిన పనితీరు ఆధారంగా స్టార్ రేటింగ్ అందించబడుతుంది. మన దేశంలో సురక్షితమైన వాహనాలను తయారు చేసేందుకు, భారతదేశంలోని ఓఈఎంల మధ్య మరింత ఆరోగ్యకర పోటీని ప్రోత్సహిస్తూ, వాహనాల స్టార్-రేటింగ్‌ల ఆధారంగా సురక్షితమైన కార్లను ఎంపిక చేసుకొనేందుకు వీలుగా వినియోగదారుల్ని అనుమతించేలా.. వినియోగదారుల - కేంద్రీకృత వేదికగా ఈ భారత్-ఎన్‌సీఏపీ పనిచేస్తుందని మంత్రి తన వరుస ట్వీట్‌లలో పేర్కొన్నారు. ధేశ కార్లలో నిర్మాణ మరియు ప్రయాణీకుల భద్రతను నిర్ధారించడానికి మాత్రమే కాకుండా భారతీయ ఆటోమొబైల్స్ ఎగుమతి-యోగ్యతను పెంచడానికి కూడా క్రాష్ టెస్ట్‌ల ఆధారంగా భారతీయ కార్లకు స్టార్ రేటింగ్ చాలా కీలకమని మంత్రి పేర్కొన్నారు. భారత్ ఎన్‌సీఏపీ యొక్క టెస్టింగ్ ప్రోటోకాల్ ప్రస్తుతం ఉన్న భారతీయ నిబంధనలలో గ్లోబల్ క్రాష్ టెస్ట్ ప్రోటోకాల్‌ల ఫ్యాక్టరింగ్‌తో సమలేఖనం చేయబడుతుందని, ఓఈఎం లు తమ వాహనాల్ని భారతదేశం యొక్క స్వంత అంతర్గత పరీక్షా సౌకర్యాలలో పరీక్షించుకోవడానికి వీలు కల్పిస్తుందని ఆయన అన్నారు. భారత్ ఎన్‌సీఏపీ యొక్క టెస్టింగ్ ప్రోటోకాల్ ప్రస్తుతం ఉన్న భారతీయ నిబంధనలలో గ్లోబల్ క్రాష్ టెస్ట్ ప్రోటోకాల్‌ల ఫ్యాక్టరింగ్‌తో సమలేఖనం చేయబడుతుందని, ఓఈఎం లు తమ వాహనాలను భారతదేశం యొక్క స్వంత అంతర్గత పరీక్షా సౌకర్యాలలో పరీక్షించుకోవడానికి వీలు కల్పిస్తుందని ఆయన అన్నారు. భారత్‌ను ప్రపంచంలోనే నంబర్ 1 ఆటోమొబైల్ హబ్‌గా మార్చే లక్ష్యంలోనూ.. మన ఆటోమొబైల్ పరిశ్రమను ఆత్మనిర్భర్‌గా మార్చడంలో భారత్ ఎన్‌సీఏపీ ఒక కీలకమైన సాధనంగా నిరూపితమవుతుందని శ్రీ గడ్కరీ అన్నారు.
***
(Release ID: 1836757)
Visitor Counter : 184