ప్రధాన మంత్రి కార్యాలయం
అసమ్ లో వరద యొక్క స్థితి ని కేంద్ర ప్రభుత్వం నిరంతరం గాపర్యవేక్షిస్తున్నది; సాధ్యమైన అన్ని విధాలు గాను సహాయాన్నిఅందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తో కలసి పాటుపడుతున్నది: ప్రధాన మంత్రి
Posted On:
23 JUN 2022 8:55PM by PIB Hyderabad
అసమ్ లో వరద యొక్క స్థితి ని కేంద్ర ప్రభుత్వం నిరంతరం గా పర్యవేక్షిస్తున్నదని మరియు ఈ సవాలు ను అధిగమించడం కోసం సాధ్యమైన అన్ని విధాలు గాను సహాయాన్ని అందించడాని కి రాష్ట్ర ప్రభుత్వం తో కలసి పనిచేస్తోందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో -
‘‘గత కొద్ది రోజులు గా, అసమ్ లోని కొన్ని ప్రాంతాలు భారీ వర్షపాతం కారణం గా వరద ల పాలబడ్డాయి. అసమ్ లో తలెత్తిన స్థితి ని కేంద్ర ప్రభుత్వం అదే పని గా పర్యవేక్షిస్తున్నది. ఈ సవాలు ను అధిగమించడం కోసం సాధ్యమైన అన్ని విధాలు గాను సహాయాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తో కలసి పనిచేస్తున్నది.’’
‘‘వరద ప్రభావిత ప్రాంతాల లో సైన్యం మరియు ఎన్ డిఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి. వారు ఆయా ప్రాంతాల నివాసుల ను అక్కడి నుంచి ఖాళీ చేయించే కార్యక్రమం తో పాటు బాధితులైన వారికి సాయాన్ని కూడా అందిస్తున్నారు. వాయుసేన ప్రజల ను ఖాళీ చేయించే ప్రక్రియ లో భాగం గా 250 కి పైగా విన్యాసాల ను నిర్వహించింది.’’
‘‘ముఖ్యమంత్రి @himantabiswa, అసమ్ ప్రభుత్వం లోని మంత్రులు మరియు అధికారులు జిల్లాల లో రోజు లో 24 గంటలు అదే పని గా పాటుపడుతున్నారు; మరియు బాధితుల కు వారు సాయాన్ని అందిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల ప్రజానీకం యొక్క రక్షణ మరియు శ్రేయం ల కోసం ఆ ఈశ్వరుడి ని నేను ప్రార్థిస్తున్నాను; సాధ్యమైన అన్ని విధాల సమర్ధన ను అందించడం జరుగుతుంది అంటూ మరోమారు హామీ ని ఇస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1836719)
Visitor Counter : 160
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam