ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

2022 జూన్ 26వ తేదీ నుంచి 28 తేదీ వరకు జర్మనీ మరియు యుఎఇ లను సందర్శించనున్నప్రధాన మంత్రి

Posted On: 22 JUN 2022 6:16PM by PIB Hyderabad

జర్మనీ అధ్యక్షత న 2022వ సంవత్సరం జూన్ 26 తేదీ మరియు 27వ తేదీ లలో జరుగనున్న జి7 శిఖర సమ్మేళనం లో పాలుపంచుకోవాలంటూ జర్మనీ చాన్స్ లర్ శ్రీ ఓలాఫ్ స్కోల్జ్ ఆహ్వానించిన మీదట ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జర్మనీ లోని శ్లాస్ ఎల్మౌ ను సందర్శించనున్నారు. ఈ శిఖర సమ్మేళనం లో భాగం గా ప్రధాన మంత్రి పర్యావరణం, శక్తి, జలవాయు, ఆహార భద్రత, ఆరోగ్యం, స్త్రీ పురుష సమానత్వం మరియు ప్రజాస్వామ్యం వంటి అంశాల పై తన ఆలోచనల ను వెల్లడి చేయవచ్చన్న అంచనా ఉంది. ఈ ముఖ్యమైన అంశాల పై అంతర్జాతీయ సహకారాన్ని పటిష్టం చేయడం కోసం జరుగుతున్న ప్రయాస లో భాగం గా అర్జెంటీనా, ఇండోనేశియా, సెనెగల్ మరియు దక్షిణ ఆఫ్రికా ల వంటి ఇతర ప్రజాస్వామిక దేశాల ను కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ శిఖర సమ్మేళనం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దీనిలో పాలుపంచుకొనే దేశాల లో కొన్ని దేశాల నేతల తో ద్వైపాక్షిక సమావేశాలలో పాల్గొంటారు.

భారతదేశాని కి మరియు జర్మనీ కి మధ్య గల బలమైనటువంటి మరియు సన్నిహితమైనటువంటి భాగస్వామ్య సంప్రదాయాని కి అనుగుణం గా, అలాగే ఉన్నత స్థాయి రాజకీయ సంబంధాల ను దృష్టి లో పెట్టుకొని జి7 శిఖర సమ్మేళనాని కి ఆహ్వానం లభించింది. ప్రధాన మంత్రి కిందటి సారి జర్మనీ ని 2022వ సంవత్సరం లో మే 2వ తేదీ నాడు సందర్శించారు. ఆ రోజు న భారతదేశం- జర్మనీ అంతర్ ప్రభుత్వ సంప్రదింపులు (ఐజిసి) యొక్క ఆరో విడత కార్యక్రమం జరిగింది.

జి7 శిఖర సమ్మేళనం లో పాలుపంచుకొన్న తరువాత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 వ సంవత్సరం జూన్ 28 తేదీ నాడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) కి వెళ్తారు. అక్కడ యుఎఇ పూర్వ అధ్యక్షుడు మరియు అబూ ధాబీ పాలకుడు శ్రీ శేఖ్ ఖలీఫా బిన్ జాయద్ అల్ నాహ్ యాన్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి తన వ్యక్తిగత సంతాపాన్ని తెలియజేస్తారు. ప్రధాన మంత్రి దీనితో పాటు శ్రీ శేఖ్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నాహ్ యాన్ కు యుఎఇ నూతన అధ్యక్షుని గా, అబూ ధాబీ పాలకుని గా ఎన్నికైన సందర్భం లో అభినందనలు తెలియజేయనున్నారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అదే రోజు రాత్రి అంటే జూన్ 28వ తేదీ నాటి రాత్రి యుఎఇ నుంచి బయలుదేరుతారు.

***


(Release ID: 1836476) Visitor Counter : 165