గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022, వేడుకలు
Posted On:
20 JUN 2022 12:13PM by PIB Hyderabad
ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంవత్సరం సందర్భంగా వస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను బ్రాండ్ చేసేందుకు తోడ్పడే విధంగా భారత దేశ వ్యాప్తంగా 75 ప్రతిష్ఠాత్మక ప్రాంతాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్నినిర్వహించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రధానమంత్రి కర్ణాటకలోని మైసూర్ నుంచిల ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించనున్నారు.
కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలలు, పెట్రోలియం, సహజవాయువుల శాఖల మంత్రి శ్రీ హర్దీప్ ఎస్ పురీ న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహణలో పతంజలి యోగ్‌పీఠ్ కూడా పాలుపంచుకుంటోంది. మంత్రితో పాటుగా వేదికపై పతంజలి యోగ్‌పీఠ్‌కు చెందిన ఆచార్య బాల్ క్రిషన్ కూడా ఉండనున్నారు. పతంజలి యోగ్‌పీఠ్ నుంచి దాదాపు 12,000మంది పాల్గొంటుండగా, గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలుశాఖ, పెట్రోలియం & సహజవాయువుల మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. ఐడివై 2022కు నోడల్ మంత్రిత్వ శాఖగా ఉన్న ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన ప్రామాణిక నిర్వహణ ప్రక్రియ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్)కు అనుగుణంగా యోగా కార్యక్రమాలను నిర్వహిస్తారు.
ఈ ఏడాది ఐడివై 2022 ఇతివృత్తం మానవాళి కోసం యోగ (యోగా ఫర్ హ్యుమానిటీ). కోవిడ్-19 మహమ్మారి ఉధృతంగా ఉన్న కాలంలో వారి బాధలను ఉపశమింపచేయడంలో యోగా మానవాళికి మేలు చేసింది. అంతేకాకుండా కోవిడ్ అనంతర భౌగోళిక రాజకీయ నేపథ్యంలో కూడా దయ, కరుణల ద్వారా ప్రజలను ఒక చోటకి చేర్చడానికి, ఐక్యతా భావాన్ని పెంపొందించేందుకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలలో రోగ నిరోధకతను ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు తోడ్పడుతుంది.
***
(Release ID: 1835533)
Visitor Counter : 249